Breaking News

Monthly Archives: July 2015

ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా అఖండ మెజార్టీతో ఎన్నికైన కైలాష్‌ శ్రీనివాస్‌రావును శుక్రవారం ఆర్యవైశ్య అభివృద్ది సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ఎదిగేలా కృషి చేయాలని శ్రీనివాస్‌ను కోరారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రమణ, వెంకటేశం, లింగం, పురుషోత్తం, శ్రీనివాస్‌, వెంకటేశం, గంగయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

టిజివిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం టిజివిపి 3వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు టిజివిపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ టిజివిపి ఉస్మానియా యూనివర్సిటీలో 2012 జూలై 31న బట్టుశ్రీహరి అధ్యక్షతన ఆవిర్భవించిందన్నారు. టిజివిపి ఆవిర్భవించి మూడేళ్ల పూర్తయిందని, అప్పటినుంచి తెలంగాణ ఉద్యమంతో పాటు విద్యార్థుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటాలు చేస్తుందని తెలిపారు. ...

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా గురుపూజోత్సవం

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ ఆషాఢ పూర్ణిమ రోజు వేదవ్యాసుడు జన్మించి లోకాలన్నింటికి జ్ఞానాన్ని అందించే వేదాలను రచించాడని తెలిపారు. అటువంటి వేదాలను మానవులు జీవితాంతం ఆచరించాలని వక్తలు పేర్కొన్నారు. గురువు విశిస్టతను విద్యార్థులకు, ఉపాధ్యాయులు వివరించారు. నిజమైన గురువు ఎలా ఉండాలో ప్రత్యక్షంగా చూపించిన వ్యక్తి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం అని కొనియాడారు. ...

Read More »

పిడిఎస్‌యు ఆద్వర్యంలో జూనియర్‌ కళాశాల ఎదుట ఆందోళన

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈసందర్బంగా పిడిఎస్‌యు పట్టణ అధ్యక్షుడు సురేశ్‌ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు సరిపడా గదులు లేవని, మరుగుదొడ్లు, ప్రహరిగోడ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో పిడి సైతం లేరని పేర్కొన్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు కనీసం తాగునీటి సౌకర్యం లేక మధ్యాహ్న ...

Read More »

వైభవంగా గురుపూజోత్సవం

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టనంలోని గణపతి సచ్చిదానంద స్వామిజి ఆశ్రమంలో విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. స్వామిజి పాదుకలకు పూజలు జరిపారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, దత్తాత్రేయ తైలాభిషేకం, దత్తాత్రేయ హోమం, సంకీర్తన కార్యక్రమాలు, హనుమాన్‌ చాలీసా పారాయణం, మహా మంగళహారతి కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ వెంకటకృష్ణ, నవీన్‌ కుమార్‌ల ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ...

Read More »

అంగన్‌వాడి కేంద్రంలో చోరీ

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రుక్మిణి కుంట అంగన్‌వాడి కేంద్రంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్టు కేంద్రం నిర్వాహకురాలు సాదికా బేగం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడి కేంద్రం తాళం పగులగొట్టి దొంగలు సామగ్రిని, పదార్థాలను చోరీ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 150 కిలోల బియ్యం, గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యి, నీళ్ళ డ్రమ్ము, కుక్కలు, 12 కిలోల నూనె, మూడు సంచుల బాలామృతం, 20 కిలోల కందిపప్పు, 180 కోడిగుడ్లు తదితర సామగ్రి ...

Read More »

ఉద్రిక్తతకు దారితీసిన కార్మికుల ఆందోళన

  – ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నం – కార్మికుల అరెస్టు, విడుదల కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న 26వ రోజు సమ్మెలో భాగంగా నిజాంసాగర్‌ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నర్సింగ్‌ రావు అనే కార్మికుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యం చేశాడు. ...

Read More »

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

  నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈమేరకు స్థానిక బాలుర ఐటిఐ కళాశాలలో ప్రిన్సిపాల్‌ విఠల్‌ చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాదనే లక్ష్యంగా ఏర్పడిన విద్యార్థి సంఘం టిజివిపి అన్నారు. సంస్థ స్థాపించిన మూడేల్ళలోనే విద్యార్థి ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు. సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో ఫీజురీయంబర్స్‌మెంట్‌పై ఉద్యమించి సాధించుకోవడం ...

Read More »

గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ…

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుబ్రహ్మ, గురువిష్ణు: గురుదేవో మహేశ్వర, గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ, తస్మైశ్రీ గురవే నమ: అని మనం గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా తమసోమ జ్యోతిర్గమయా అంటూ చీకటి చీల్చుకుంటూ వెలుగులోకి పయనించాలంటే అందుకు జ్ఞానమనే కాగడాను పట్టి ముందుకు నడిపేది కూడా గురువే అని చెప్పుకుంటున్నాం. ఈ నేపథ్యంలో లోకానికి నాలుగు వేదాలుగా విభజన చేసి అందించిన వ్యాసముని జయంతిని వ్యాసపూర్ణిమ, గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ...

Read More »

నీటి సమస్యతో నర్సరీ తరలింపు

  రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, నీలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలకు నీటి సమస్య తలెత్తడంతో వాటిని రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నర్సరీ వద్దకు తరలిస్తున్నట్టు క్షేత్ర సహాయకులు మధు, సాయిలు తెలిపారు. తాడ్‌బిలోలిలోని 50 వేల మొక్కలు, నీలాలోని 50 వేల మొక్కలను రెంజల్‌ ఆరోగ్య కేంద్రానికి తరలించి మొక్కలు నాటుతున్నట్టు వారు తెలిపారు. ఉపాధి హామీ ఆధ్వర్యంలో ప్రతి కూలీ మొక్కలను తమ పంట పొలాల వద్దగానీ, ఇంటి ఆవరణలో ...

Read More »

తెలంగాన ఉద్యోగుల సమాఖ్య ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా సాయాగౌడ్‌

  డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయాగౌడ్‌ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య జిల్లా శాఖ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆయన ఈ జిల్లా స్థాయి పదవికి ఎంపిక కావడంతో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ఇతరఅధ్యాపక సిబ్బంది అభినందించారు. నాన్‌ టీచింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. వర్సిటీ ఉద్యోగుల సంక్షేమం కోసం, జిల్లాలోని ఉద్యోగుల హక్కుల కోసం పాటుపడతానని ఆయన తెలిపారు.

Read More »

సమాజంలో మాస్‌ కమ్యూనికేషన్‌దే కీలకపాత్ర

  – ప్రొఫెసర్‌ బాలస్వామి డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత సమాజంలో ప్రసార మాధ్యమాలు చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్‌ బి.బాలస్వామి అన్నారు. ప్రజల జీవనాన్ని, సమాజ గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల అవకాశమున్న ప్రసార మాధ్యమాలు నిత్య జీవనంలో ఎంతో కీలకమైనవని ఆయన అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్న పిహెచ్‌.డి. కోర్సు వర్కు తరగతుల్లో భాగంగా శుక్రవారం ఆయన రీసర్చ్‌ స్కాలర్స్‌ను ఉద్దేశించి ...

Read More »

భిక్షాటన చేస్తూ మునిసిపల్‌ కార్మికుల నిరసన

  నందిపేట్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెల రోజుల నుంచి మునిసిపల్‌ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ మేరకు నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం సమ్మెలో భాగంగా మునిసిపల్‌ కార్మికులు ఆయా దుకాణాల వద్దకెళ్లి యజమానుల వద్ద నుంచి భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమకు నెలరోజుల నుంచి వేతనాలు లేవని ఆకలితో అలమటిస్తున్నామని, మంచి మనసుతో భిక్ష సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. దుకాణ యజమానుల ...

Read More »

నల్లపోచమ్మ దగ్గర స్థలాన్ని పరిశీలించిన మునిసిపల్‌ ఛైర్మన్‌

  ఆర్మూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో వనభోజనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నల్లపోచమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు, 5వ వార్డు కౌన్సిలర్‌ వన్నెల్‌ దాస్‌ లత శ్రీనివాస్‌లతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా సంతోసంగా వనబోజనాలు జరుపుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టు గల పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేయించినట్టు ...

Read More »

తెవివిలో 10 హెక్టార్లలో ఉద్యానవనం ప్రాజెక్టు

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన సెంట్రల్‌ లైబ్రరి భవనానికి ఎదురుగా మొత్తం 10 హెక్టార్ల స్థలంలో హార్టికల్చర్‌ ప్రాజెక్టును చేపట్టనున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈ ఉద్యానవనం ప్రాజెక్టును హార్టికల్చర్‌ డిపార్టుమెంట్‌ పర్యవేక్షణ సహకారంతో అభివృద్ది చేస్తున్నట్టు అన్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌కు వన్నె తెచ్చే విధంగా అతి సుందరంగా తీర్చిదిద్దుతామని, ఉద్యానవనం, లైబ్రరీ, నర్సరీ ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం ...

Read More »

మంజీర కళాశాలలో జాబ్‌మేళా

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీరా డిగ్రీ కళాశాలలో గురువారం రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. హైదరాబాద్‌ ట్రాపిక్‌ విభాగంలో సిఎస్‌ఇ పోస్టులకు గాను నిర్వహించిన రాతపరీక్షకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 55 మంది మౌఖిక పరీక్షకు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా కంపెనీ ప్రతినిధి రాజేశ్‌ మాట్లాడుతూ కళాశాలల ద్వారా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ యువతకు అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. జాబ్‌మేళాలో సెలక్టు అయిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, డైరెక్టర్‌ ...

Read More »

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షనిగా ఎన్నికైన మాజీ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌రావును గురువారం హైవే సిండికేట్‌ ప్రతినిధులు సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి ఉన్నత స్తానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిండికేట్‌ ప్రతినిధులు సోమశేఖర్‌, శ్రీధర్‌, లక్ష్మణ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, విష్ణు, సత్యం, జినేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యుత్‌ అసిస్టెంట్‌ లైన్‌మెన్‌పై దాడి

  – దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డి-2 విద్యుత్‌ సెక్షన్‌లో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం.బాబుపై బుధవారం సాయంత్రం డిప్యూటి తహసీల్దార్‌ ల్యాండ్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోతిసింగ్‌ దాడిచేసి గాయపరిచినట్టు బాధితుడు తెలిపారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసు స్టేషన్‌లో మోతిసింగ్‌పై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతిసింగ్‌ ఇంట్లో కరెంటు బిల్లు సర్వీసుపై బకాయి ఉన్నందున బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు. దీంతో ఇంటి సరఫరా ...

Read More »

నీటి సరఫరాను పరిశీలించిన పాలక మండలి

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాలక సంఘం పరిదిలోని 5వ వార్డులో జరుగుతున్న నీటి సరఫరాను గురువారం పురపాలక సంఘం పాలక మండలి సభ్యులు సమీక్షించారు. 5వ వార్డు కౌన్సిలర్‌ పద్మ ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, కమీషనర్‌ విక్రమసింహారెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పైప్‌లైన్‌ లీకేజీలను, పైప్‌లైన్‌ వ్యవస్థను తనికీ చేశారు. ఈ సందర్బంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ రంగాచారి కాలనీలో కొత్త పైప్‌లైన్‌ వ్యవస్తను ఏర్పాటు చేసి తద్వారా స్థానికులకు ...

Read More »

ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరంచేసేందుకు తెరాస కుట్ర

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని ప్రభుత్వ టూరిజం హోటల్‌ హరిత రెస్టారెంట్‌ను లీజ్‌పేరుతో ప్రయివేటు పరం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఎం మండల కార్యదర్శి రాజలింగం ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హరిత హోటల్‌ను టూరిజం శాఖలోని ఉన్నతాధికారి బంధువులు లీజ్‌ పద్దతిలో కాజేయాలని కుట్రకు టూరిజం శాఖ ఎం.డి. క్రిస్టినా ఆమోదముద్ర వేయడం హేయమైనచర్యగా అభివర్ణించారు. ఓవైపు కామారెడ్డిని జిల్లాగా చేస్తామని కేసీఆర్‌ ప్రకటించి కామారెడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ ...

Read More »