Breaking News

Daily Archives: August 3, 2015

మెంటారింగ్‌ విధానం ప్రవేశపెట్టాలి

  – రిజిస్ట్రార్‌ లింబాద్రి డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి అధ్యాపకుడు, అధ్యాపకురాలు పదిమంది విద్యార్థులకు మార్గ నిర్దేశకత్వం (మెంటారింగ్‌) చేసేలా మెంటర్‌ విధానం ప్రవేశ పెట్టాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సూచించారు. సోమవారం తన చాంబర్‌లో ప్రిన్సిపాల్స్‌తో సమావేశమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి మార్గ నిర్దేశం చేయడానికి, వారికి అన్ని వేళలా గైడ్‌ చేయడానికి మెంటరింగ్‌ విధానం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అలాగే ప్రిన్సిపాల్స్‌ తమ కళాశాలల పరిధిలో టైంటేబుల్‌, ...

Read More »

మూడేళ్ళలోపు చిన్నారులను అంగన్‌వాడి కేంద్రాల్లో చేర్పించాలి

  నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్‌వాడి కేంద్రాల్లో చేర్పించడానికి విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులకు నిర్ణీత సమయంలో చర్యలు తీసుకొని ప్రజావాణి విభాగానికి ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలన్నారు. పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ద కనబర్చాలన్నారు. మొక్కుబడిగా కాకుండా జిల్లా అధికారులు విధిగా అన్ని వివరాలతో ప్రజావాణికి సకాలంలో హాజరుకావాలని, తప్పని పరిస్థితిలో ముందస్తు అనుమతి పొంది ఉంటే సరైన ...

Read More »

5వ తేదీ నుంచి రూ. 20 లకే కిలో ఉల్లి

  – మంత్రి హరీష్‌రావు నిజామాబాద్‌ అర్బన్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5 నుంచి రాష్ట్రంలోని డివిజన్‌ కేంద్రాల్లో రైతు బజార్లలో 20 రూపాయలకే కిలో ఉల్లిగడ్డ అందించనున్నామని రాష్ట్ర మార్కెటింగ్‌, నీటి పారుదల మరియు భూగర్భజలాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఇసుక, ఉల్లిగడ్డల దరలు, ప్రాజెక్టులకు భూసేకరణపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణరాష్ట్రంలో ...

Read More »

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రత్యేక అధికారి బదావత్‌ ప్రేమ్‌దాస్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు వెంటనే జీవో జారీచేయాలన్నారు. గిరిజనులకు రాజ్యాంగ బద్దంగా పెరిగిన జనాభా లెక్కల ప్రకారం 6 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని కోరారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా ...

Read More »

మండల విద్యాధికారికి సన్మానం

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారిని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పునూతుల రమేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ గత సంవత్సరం వేసవి సెలవుల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవుల కొరకు ప్రొసిడింగ్‌ తీసుకురావాలని కోరారు. ఈ విషయమై మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రాఘవరెడ్డి, గిరి, సంగయ్య, ...

Read More »

ఆర్యవైశ్య నూతన కార్యవర్గానికి సన్మానం

  కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎన్జీవోస్‌ కాలనీ ఆర్యవైశ్య సంఘం ఇటీవల ఎన్నికైంది. సోమవారం నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులను ఆర్యవైశ్య ప్రతినిదులు సన్మానించారు. సంఘం అధ్యక్షునిగా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అతిమాముల రమేశ్‌ గుప్తను సన్మానించారు. ఆయనతోపాటు సంఘం ప్రధాన కార్యదర్శి బాల్‌రాజయ్య, కోశాధికారిగా రాములు, సభ్యులు పెంటయ్య, శ్రీనివాస్‌, రవిందర్‌, లింగమూర్తి, శంకర్‌గుప్త, ఆంజనేయులు, వెంకటరమణ, అంజయ్య, విఠల్‌గుప్త, లక్ష్మిపతి, తదితరులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఆర్యవైశ్య సంఘం ...

Read More »

మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీపై డిఎస్పీకి ఫిర్యాదు

  – డిఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా, ర్యాలీ కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయాలని పేర్కొంటూ పట్టణంలోని ఆర్యవైశ్యులు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా డిఎస్పీ కార్యాలయానికి చేరుకొని అక్కడే ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎస్పీ భాస్కర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రసన్నకుమార్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో ...

Read More »

తెవివిలో కలాం సంతాపసభ

  డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాన యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు డాక్టర్‌ అబ్దుల్‌ కలాం సంతాప సంస్మరణ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన కలాం తన ప్రత్యేకతను నిలుపుకున్నారన్నారు. ఓయు ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ బహుముఖీన ప్రజ్ఞావంతుడు కలాం అని అభివర్ణించారు. కార్యక్రమంలో మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణచారి, డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ జాన్సన్‌, విద్యార్థి నాయకులు సంతోష్‌, రాజ్‌కుమార్‌ పాల్గొని నివాళులు ...

Read More »

మాస్‌ మీడియా అత్యంత ప్రభావ శీలంగా ఉంది

  – ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత మానవ సమాజ దైనందిన జీవితంలో మాస్‌ మీడియా అత్యంత ప్రభావశీలమైందని జర్నలిజం విద్యావేత్త ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మాస్‌ కమ్యూనికేషన్‌ పిహెచ్‌డి స్కాలర్లకు కోర్సు వర్కు తరగతి నిర్వహించారు. భారతదేశంలో మాస్‌ కమ్యూనికేషన్‌ సాధనాలు, మాస్‌ మీడియా అనూహ్యంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రసార మాధ్యమాలు మానవుని ప్రతి జీవన కోణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ఈ దిశగా వాటి ప్రభావంపై లోతైన పరిశోధనలు ...

Read More »

ప్రజావాణికి 6 పిర్యాదులు

  ఆర్మూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేస స్పందన లభిస్తుంది. ప్రజలు వారి ఫిర్యాదులను నేరుగా తహసీల్దార్‌ శ్రీధర్‌కు అందజేస్తున్నారు. ఈవారం సైతం ప్రజావాణి కొనసాగింది. మొత్తం 6 ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ తెలిపారు. వీరిలో 3 ఆహారభద్రత కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు, ఒకటి భూమికి సంబంధించినవి, రెండు బీడీ పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. వీటిని సంబంధిత అదికారులకు బదిలీ చేసి పరిష్కరించేవిదంగా చర్యలు ...

Read More »

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

  ఆర్మూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 8వ వార్డు కమలా నెహ్రూ కాలనీలో లక్ష 50 వేల ఇఐయుఎస్‌ నిధులతో సిసి డ్రైన్‌ పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్మూర్‌ అభివృద్దిలో భాగంగా మునిసిపల్‌ పాలకవర్గానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపి కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమకు అండగా ఉండాలని ఆమె కోరారు. ఆర్మూర్‌ అభివృద్దికి ఎల్లవేళలా పాటుపడతామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ...

Read More »

ఎస్సీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌

  – ఈ వార్డెన్‌ మాకొద్దంటూ విద్యార్థుల ఆందోళన – మెను ప్రకారం భోజనం పెట్టడం లేదంటున్న విద్యార్థులు – తహసీల్దార్‌ విచారణ గాంధారి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని వార్డెన్‌ దేవేందర్‌ చితకబాదిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని విద్యార్థి ‘అసరాజ్‌’ తల్లి దండ్రులకు, స్థానికులకు తెలపడంతో సోమవారం హాస్టల్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో 50 మంది విద్యార్థులు ఉండగా, ప్రతిరోజు వార్డెన్‌ దేవేందర్‌ తమను ...

Read More »