Breaking News

Daily Archives: August 6, 2015

గోదావరి పైప్‌లైన్‌ పరిశీలించి సమస్య తలెత్తకుండా చూడాలి

  – కలెక్టర్‌కు విన్నవించిన మునిసిపల్‌ పాలకవర్గం కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి తాగునీటి కోసం వచ్చే గోదావరి జలాల పైప్‌లైన్‌లు ప్రతి నిత్యం పగిలిపోవడంవల్ల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, వాటిని పరిశీలించి సమస్య తలెత్తకుండా చూడాలని గురువారం కామారెడ్డి మునిసిపల్‌ పాలకవర్గం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌కు వినతి పత్రం అందజేశారు. గురువారం కామారెడ్డికి వచ్చిన కలెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. గోదావరి జలాల పైప్‌లైన్లు జలాల్‌పూర్‌ నుంచి కామారెడ్డి పట్టణం ...

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ కార్మికులు గత 37 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించపోవడాన్ని నిరసిస్తూ గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో అటెండరు, వాచ్‌మెన్‌, స్వీపర్లు, ఎలక్ట్రిషియన్లు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు ...

Read More »

జాతిపితకు కొవ్వొత్తులతో నివాళి

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌81వ జయంతి ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీసాయి సుధ విద్యాలయంలో చిన్నారి విద్యార్తులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్‌ రాజేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ దశ, దిశ నిర్దేశించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి విద్యార్తి నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఆచార్య జయశంకర్‌ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలువేసి వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. తెరాస, టిపియుఎస్‌, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ జేఏసి, మునిసిపల్‌ ఛైర్మన్‌, పట్టణ స్వర్ణకార సంఘం, బిజెపి, టిజివిపి, తదితర పార్టీల ఆద్వర్యంలో నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాదన వెనక ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన ...

Read More »

తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం

  కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డకు ఆరునెలలు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రి పాలు ఇవ్వాలని, తద్వారా బిడ్డకు వ్యాధి నిరోదక శక్తి పెరిగి సంజీవనిలా పనిచేస్తుందని ...

Read More »

తల్లిపాల వారోత్సవాలు

  ఆర్మూర్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమని, శక్తినిస్తాయని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అన్నారు. గురువారం పట్టణంలోని జమ్మన్‌జెట్టి వీధిలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కౌన్సిలర్‌ లత ఆనంద్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం

  – బ్రహ్మాజివాడను సందర్శించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండేవిధంగా 198 వ్యక్తిగత మరుగుదొడ్లను స్వల్పకాలంలో నిర్మించుకొని స్వచ్ఛభారత్‌, స్వచ్ఛతెలంగాణ నిర్మాణంలో బ్రహ్మాజివాడ గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి ప్రశంసించారు. బ్రహ్మాజివాడ సమగ్ర అభివృద్దికి గ్రామజ్యోతి కార్యక్రమం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేయనున్నట్టు వారు ప్రకటించారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ...

Read More »

జిల్లా పరిశ్రమల ప్రోత్సహక మండలితో కలెక్టర్‌ సమావేశం

  నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ ఐపాస్‌ క్రింద రూ. 13.34 కోట్ల పెట్టుబడులతో 27 యూనిట్లు నెలకొల్పేందుకు దరఖాస్తులు అందినట్టు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. గురువారం తన చాంబరులో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సహక మండలి సమావేశంలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక క్రింద యూనిట్లు నెలకొల్పిన లబ్దిదారులకు ప్రభుత్వ పరంగా అందించేరాయితీల మంజూరును అంశాల వారిగా సమీక్షించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి ...

Read More »

అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రగతిభవన్‌లో నిర్వహించిన జయశంకర్‌ 81వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ, తెలంగాణ ఆలోచనకు ఆద్యుడు జయశంకర్‌ అని, సమాజానికి వారు ...

Read More »

ఘనంగా ఆచార్య జయశంకర్‌ జయంతి

  రెంజల్‌ , ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటయ్య, ఎంపిడివో చంద్రశేఖర్‌, ఎంపిపి మోబిన్‌ఖాన్‌, జడ్పిటిసి నాగభూసణం రెడ్డి, ఎస్‌ఐ రవి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక

  రెంజల్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల మహిళా సమాఖ్య 9వ మహాజనసభ కార్యక్రమం గురువారం మండల ఎపిఎం గంగాధర్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిపి మోబిన్‌ఖాన్‌, ఎంపిడివో చంద్రశేఖర్‌లు హాజరయ్యారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా బుజ్జక్క – సాటాపూర్‌, ఉపాధ్యక్షులుగా సావిత్రి – తాడ్‌బిలోలి, కార్యదర్శిగా లక్ష్మి- రెంజల్‌, సంయుక్త కార్యదర్శిగా షాహిన్‌-కందకుర్తి, కోశాధికారిగా తిరుపతి-బోర్గాం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏరియా కో ఆర్డినేటర్‌ రమేశ్‌బాబు, అష్ట గంగాధర్‌, సిసిలు పల్లికొండ ...

Read More »

ఘనంగా జయశంకర్‌ జయంతి వేడుకలు

  ఇందూరు, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మ గౌరవ పోరాటానికి అర్థవంతమైన భాష్యంచెప్పిన తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ 81వ జయంతి వేడుకలు నిజామాబాద్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జేఏసి ఛైర్మన్‌ గోపాల్‌శర్మ మాట్లాడారు. తెలంగాణలో విద్య కార్పొరేటీకరణ కాకుండా అందరికి అందుబాటులో ఉండాలని ఆశించిన జయశంకర్‌ ఆశయాలను కేంద్ర ప్రభుత్వం నేటి వరకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదన్నారు. తెలంగాణ పూర్తి విభజనపై అన్ని రంగాల అభివృద్దిపై నేటి వరకు రోడ్డు మ్యాప్‌ కేంద్ర ...

Read More »

మహిళల అభివృద్దికి సహకరిస్తాం

  ఆర్మూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అన్నారు. బుధవారం పట్టణంలోని గణేశ్‌ స్లమ్‌ సమాఖ్య మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు స్లమ్‌ సమాఖ్యల ద్వారా వ్యక్తిగత రుణాలు పొంది ఉపాధి ఏర్పరుచుకొని పురుషులపై ఆధారపడకుండా బ్రతుకుతున్నారని ఆమె అన్నారు. ఇలాగే పట్టణంలోని మహిళలందరు సమాఖ్యల ద్వారా అభివృద్ది చెందాలని ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు సమాఖ్య వార్షిక నివేదిక చదివి వినిపించారు. ...

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇళ్ళల్లో పాచి పనులు చేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు ఇండ్ల పాచిపని చేసేవారి యూనియన్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 300 మంది ఇళ్లల్లో పాచి పనులు చేస్తున్నామన్నారు. పేదరికంలో మగ్గుతూ పిల్లలకు తిండి పెట్టి చదివించలేక అవస్తలు పడుతున్నామని విన్నవించారు. తమకు జీవనభృతి కల్పించాలని, ప్రభుత్వం నుంచి ఇళ్ళస్తలాలు అందేలా చూడాలని తదితర సమస్యలు విన్నవించారు. కార్యక్రమంలో ...

Read More »

ముర్రుపాలు బిడ్డకు సంజీవని

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముర్రుపాలు బిడ్డకు సంజీవనిలా పనిచేస్తుందని, ముర్రుపాలే బిడ్డకు మొదటి టీకా అని 24వ వార్డు కౌన్సిలర్‌ రేణుక అన్నారు. ఆగష్టు 1వ తేదీ నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం 24వ వార్డులో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి బిడ్డకు ఆరునెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, ఇతర ఆహారపదార్థాలు ఇవ్వకూడదన్నారు. 7వ నెల నుంచి తల్లిపాలతో పాటు అంగన్‌వాడి కేంద్రంలో ...

Read More »

ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎంయు డిపో కార్యదర్శి హరినాథ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎం, సిటిఎం, ఏవోలు తమ మొండి వైఖరి మానుకోవాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు మేలు చేయాలని, లేనిపక్షంలో తదుపరినిరసన కార్యక్రమాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారి వైఖరిని మార్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిఎంయు నాయకులు ఏ.ఆర్‌.రెడ్డి, సత్యం, ...

Read More »

8వ వార్డులో నీటి ఎద్దడి తీర్చండి

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 8వ వార్డు వాంబే కాలనీలో నెలకొన్న నీటి ఎద్దడిని తీర్చాలని తెరాస పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్‌ అలీకాన్‌ ఆధ్వర్యంలో బుధవారం కమీషనర్‌ను కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులతో గతంలో బోరు వేశారని, రిపేరు కోసం మూడునెలల క్రితం తీసుకెళ్ళి ఇంతవరకు తిరిగి బిగించలేదని చెప్పారు. దీంతో ప్రజలు నీటి ఎద్దడితో బాధపడుతున్నారని, వెంటనే మోటారును బిగించి సమస్యలు తీర్చాలని కమీషనర్‌ విక్రమసింహారెడ్డిని కోరారు. ఆయన ...

Read More »

ఉపాధ్యాయ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలి

  – తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏపి ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్న గ్రేడ్‌-2 భాషా పండితులను పిఇటిలుగా అప్‌గ్రేడ్‌ చేసి గ్రేడ్‌-1 భాషా పండితులను ఫిజికల్‌ డైరెక్టర్లుగా మార్చిందని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయా పోస్టుల్లోని ఉద్యోగులను అప్‌గ్రేడ్‌ చేయాలని తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలేటి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి డివిజన్‌ స్థాయి సమావేశం బుధవారం కామారెడ్డిలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై వెంకట్రావు మాట్లాడారు. ...

Read More »

ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సంఘీభావం

  ఇందూరు, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె బుధవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. సమ్మెకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను త్వరలో ప్రభుత్వం దృస్టికి తీసుకెలతామని హామీ ఇచ్చారు. అలాగే న్యాయం చేకూరేలా చూస్తామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషించే ఆరోగ్యశ్రీ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది, జేఏసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »