Breaking News

Daily Archives: August 9, 2015

కార్మికుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

  ఇందూరు, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె శనివారం 35వ రోజుకు చేరుకుంది. అయినా ఈ సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించి అక్రమ అరెస్టులకు పాల్పడడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. కార్మికుల సమస్యలు తీర్చేందుకు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసినట్టు వ్యవహరిస్తూ ఇచ్చిన మాట మట్టిలో కలపడం సరికాదని సిఐటియు జిల్లా మహిళా ...

Read More »

ఆరుగురు పేకాట రాయుళ్ళ అరెస్టు

  ఆర్మూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామ శివారులోని రైల్వే ట్రాకు ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడి శనివారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. వారి వద్ద నుంచి 23 వేల 500 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని వారిపై గేమింగ్‌ యాక్టు చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు.

Read More »

మద్యంపై ఉన్న శ్రద్ద రైతులపై ఉందా..?

  – రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి – బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆర్మూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఆనందంగా జీవనం కొనసాగిస్తారనుకుంటే తొలి తెలంగాణ రాష్ట్రంలో ఇటు ప్రజలు, అటు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆర్మూర్‌ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాలు లేక నాటిన విత్తనాలు ...

Read More »

సన్‌ఫ్లవర్‌ పాఠశాలలో ఘనంగా బోనాల పండగ

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలోని సన్‌ఫ్లవర్‌ పాఠశాలలో శనివారం విద్యార్థులు ఘనంగా బోనాల పండగ జరుపుకున్నారు. వివిధ రకాల వేషధారణలతో విద్యార్థులు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన బెట్టుకొని దుర్గామాత, మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌, అధ్యాపకులు రాజనర్సింగ్‌రావు, ప్రిన్సిపాల్‌ సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ముఖ్యమంత్రి చిత్రపటానికి చెత్తాభిషేకం

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి చెత్తతో అభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు అడగగానే వేతనాలు పెంచి కార్మికులే నా దేవుళ్ళు అని చెప్పిన కేసీఆర్‌ నెలరోజులకు పైగా సమ్మె చేస్తున్నా కనీసం తమను చర్చలకుపిలవకపోవడం గర్హనీయమన్నారు. కార్మిక దేవుళ్లకు కేసీఆర్‌ ఇచ్చే నైవేద్యం ఏంటని ప్రశ్నించారు. ...

Read More »

కామారెడ్డిని మాడల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి

  – ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది మోడల్‌ సిటీగా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. పట్టణంలోని 24వ వార్డు హౌజింగ్‌ బోర్డు కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్తాపన చేశారు. ఈసందర్భంగా కాలనీ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ...

Read More »

నూతన బైక్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బజాజ్‌ ఇటీవల విడుదల చేసిన డిస్కవరీ నూతన బైక్‌ను శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త టెక్నాలజీ పుంతలు తొక్కుతున్న నేటి తరుణంలో సరికొత్త బైక్‌లు, కార్లు ఆయా కంపెనీలు ఆవిష్కరించడం దేశానికే గర్వకారణమన్నారు. టెక్నాలజీ మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నాయకులు రమేశ్‌గుప్త, జూకంటి ప్రభాకర్‌రెడ్డి, షోరూం నిర్వాహకులు పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 18వ వార్డులో శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ ప్రత్యేక నిధులతో సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కాంట్టార్లు పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యతగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ముదాం, సిద్దవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 14 వరకు తిరుపతిలో నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన గోడప్రతులను శనివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ సంస్థను స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో ప్రస్తుత విద్యావ్యవస్థ, ప్రభుత్వాల పనితీరు, తాము నిర్వహించాల్సిన పాత్రపై చర్చిస్తామన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుకలకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ ప్రతినిదులు భానుప్రసాద్‌, అరుణ్‌, ...

Read More »

వామపక్షాల ఆధ్వర్యంలో సిఎం దిష్టిబొమ్మ దగ్దం

  ఇందూరు, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యలపై చర్చించేందుకు సిఎం కేసీఆర్‌ను కలవడం కొరకు శుక్రవారం సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు, ఆయా పార్టీల నేతల అరెస్టులకు నిరసనగా శనివారం నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద సిఎం కేసీఆర్‌ దిస్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈసందర్భంగా సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యేడాది గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచారే తప్ప కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్‌ చేయకపోవడం ...

Read More »