Breaking News

కలకత్తా శిల్పి ఘర్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతుల తయారీ

 

కామారెడ్డి, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలకత్తా శిల్పి ఘర్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో మట్టి గణపతులను రూపొందించి కలకత్తా కళాకారులు అందరిని ఆకర్షిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలకత్తాకు చెందిన కళాకారులు ఎలాంటి రసాయన పదార్థాలు, పిఓపి, రంగులు వినియోగించకుండా కలకత్తా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మట్టితో భారీ గణేశ్‌ విగ్రహాలు రూపొందిస్తున్నారు.

పీరూ భాయ్‌ అనే వ్యక్తి కలకత్తా శిల్పి ఘర్‌ నిర్వహిస్తున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యం పొందిన కళాకారులు కేవలం మట్టితో వివిధ ఆకారాల్లో వినాయక ప్రతిమలు రూపొందిస్తున్నారు. వినియోగదారుల కోరిక మేరకు రూ.5 వేల నుంచి రూ. 50 వేల వరకు ఐదడుగుల నుంచి 15 అడుగుల వరకు విగ్రహాలను తయారుచేసి ఇస్తున్నారు. మట్టితో అందంగా తయారుచేసిన విగ్రహాలు ప్రజలను ఆకట్టుకోవడమే గాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *