Breaking News

Daily Archives: August 12, 2015

వ్యక్తి అదృశ్యం

  ఆర్మూర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం కమల నెహ్రూ కాలనీకి చెందిన దీకొండ గంగాధర్‌ అనే వ్యక్తి గత నెలరోజుల నుంచి కనపడకుండా పోయినట్టు ఆర్మూర్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు వచ్చిందని సిఐ రవికుమార్‌ బుధవారం తెలిపారు. అదృశ్యమైన దీకొండ గంగాధర్‌ కుమారుడు భరత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు తప్పిపోయిన వ్యక్తికి సుమారు 47 సంవత్సరాలు ఉన్నాయని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ వెల్లడించారు.

Read More »

ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో బుధవారం ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ పర్యవేక్షణలో పట్టణ, మండల గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లకు ట్రాపిక్‌పై అవగాహన కల్పించారు. సదస్సుకు ఆర్మూర్‌ ఎంవిఐ అశ్వంత్‌కుమార్‌తో పాటు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, ట్రాపిక్‌ ఎస్‌ఐ రహీమ్‌, నవనాథ్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు సుమీత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో సిఐ రవికుమార్‌ మట్లాడుతూ ఆటోలన్నింటికి విధిగా నెంబరు కలిగి ఉండాలని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించకూడదని, అలాగే ఆటో డ్రైవర్లు ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

  కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం 44వ నెంబరు జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పల్లెపల్లెకు మద్యం పేరిట ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మద్యానికి మరింత బానిసలుగా తయారుచేయడం ఏమిటని ప్రశ్నించారు. మద్య నిషేదం దిశగా అడుగులు వేయాలని కోరుతుండగా కొత్త మద్యం విధానంతో ...

Read More »

ఓసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి

  కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బుధవారం ఓసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓసిల్లో అందరూ ఉన్నవారే లేరని, వెనకబడ్డ వారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఓసిలకు రిజర్వేషన్‌ లేకపోవడంతో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఉద్యోగాల్లో వెనకబాటు తనానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి ఓసిలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం ...

Read More »