Breaking News

Daily Archives: August 14, 2015

సమ్మె విరమించిన పంచాయతీ కార్మికులు

  మాక్లూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 44 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న పంచాయతీ కార్మికులు ఎట్టకేలకు విదుల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి హామీ మేరకు శుక్రవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కార్మికులు విధులు నిర్వహించారు. చెత్తను తొలగించి మురికి కాల్వలను శుభ్రం చేశారు.

Read More »

మచ్చర్లలో ఇద్దరికి డెంగ్యూ

  ఆర్మూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో ఇద్దరికి డెంగ్యూ వ్యాధి సోకింది. గ్రామంలోని నర్సారెడ్డి, ఆయన కుమారుడికి డెంగ్యూ వ్యాధి సోకిందని, దీంతో వారిని హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి కుటుంబీకులు చికిత్సలు చేయిస్తున్నారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి సోకడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అధికారులు స్పందించి వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read More »

నోడల్‌ అధికారులు గ్రామాలకు వెళ్ళాలి

  ఆర్మూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలో గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందస్తుగా నోడల్‌ అధికారులు వెళ్ళి వివరాలు తెలుసుకోవాలని ఎంపిడివో ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. గ్రామ జ్యోతి విజయవంతానికి నోడల్‌ అధికారులదే ప్రధాన బాద్యత అని ఆయన అన్నారు. నోడల్‌ అధికారులు గ్రామ స్థాయి అధికారులను సమన్వయం చేసుకొని ముందస్తుగా గ్రామాలకు వెళ్లి పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు.

Read More »

బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు

  ఆర్మూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ టి.జగదీశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు ఆర్మూర్‌ పోలీసు స్టేసన్లో తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ శుక్రవారం తెలిపారు. సిఐ కథనం ప్రకారం…జగదీశ్వర్‌రావు మోర్తాడ్‌ నుంచి ఆర్మూర్‌ వరకు రైల్వే బ్రిడ్జిల నిర్మాణం కొరకు టెండరు వేసి పనులు చేస్తుండగా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన కె.ఆర్‌.సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులు జగదీశ్వర్‌రావును, తన కూలీపనివారికి ఫోన్‌చేస్తూ రైల్వే వంతెన కాంట్రాక్టు ...

Read More »

దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీగా తీర్చిదిద్దుదాం

  – తెలంగాణ యూనివర్సిటీలో వైఫై సేవలు ప్రారంభించిన ఎంపి కవిత డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్నందున వారి సౌలభ్యంకొరకు వైఫై ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలునాటి, గ్రంథాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోగల వివిధ విశ్వవిద్యాలయాల్లో లేనివిధంగా మొట్టమొదట డిచ్‌పల్లి ...

Read More »

సామాజిక అభివృద్ది సాధించేందుకు గ్రామజ్యోతి

  – జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలలో సామాజిక దృక్పథాన్ని పెంపొందించి గ్రామ పంచాయతీ విధులలో వారిని భాగస్వాములను చేయడమే గ్రామ జ్యోతి ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులు, ఎంపిడివోలు, తహసీల్దార్లు, గ్రామ జ్యోతి మార్పు ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించనున్న గ్రామ జ్యోతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌ చర్చించారు. మిగతా కార్యక్రమాలకు గ్రామ ...

Read More »

ప్రజలకు తోడుగా… అండగా…

  – కొత్త జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తానని, విద్య, సంక్షేమంపై ప్రత్యేకంగా దృస్టి కేంద్రీకరిస్తానని కొత్తగా విదులలో చేరిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఆమె నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఇంతవరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన డి.రోనాల్డ్‌రోస్‌ నుంచి చార్జి తీసుకున్నారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిదులతో మాట్లాడుతూ, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ...

Read More »

ఆలిన కడతేర్చిన కసాయి అరెస్టు – రిమాండ్‌

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కట్టుకున్నవాడే కాలయముడై భార్యను హత్యచేసిన సంఘటనలో నిందితుడు బాల్‌రాజును పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్తానిక పోలీస్‌ స్టేషన్లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను పట్టణ సిఐ శ్రీనివాస్‌ రావు వెల్లడించారు. కామారెడ్డి పట్టణం హరిజనవాడకు చెందిన బాలరాజు, యాదమ్మ దంపతుల మధ్య కొంత కాలంగా ఆర్థిక విషయాలపై గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో బుధవారం రాత్రి గొడవ పెద్దదికావడంతో బాలరాజు భార్య యాదమ్మను హత్యచేశాడన్నారు. ...

Read More »

శనివారం జ్ఞాన, వైద్య, యోగ శిక్షణ పరిచయ కార్యక్రమం

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాన, వైద్య, యోగ శిక్షణ పరిచయ కార్యక్రమాన్ని కామారెడ్డిలోని పార్శి రాములు కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎంఎంవై ద్వారా మానసిక ప్రశాంతత, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యల పరిష్కారం, దీర్ఘకాలిక రుగ్మతలైన బిపి, షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, అల్సర్‌, తదితర రోగాలకు ఉపశమనం పొందవచ్చన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈనెల 17 ...

Read More »

రాజీవ్‌ సద్భావన యాత్రకు ఘనస్వాగతం

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతియేటా కాంగ్రెస్‌ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్‌ సద్భావన యాత్ర శుక్రవారం కామారెడ్డికి చేరుకుంది. కామారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులు యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా సద్భావన యాత్ర ప్రతినిధి అయ్యర్‌ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజీవ్‌ సద్భావన యాత్ర పేరుతో పెరంబదూర్‌ నుంచి ఢిల్లీ వరకు ప్రతియేటా యాత్ర చేపడతామన్నారు. ఈయేడు సైతం యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రాజీవ్‌ ఆశయాల అమలు దిశగా కృషి చేయాలని, ఉగ్రవాదాన్ని దేశం నుంచి ...

Read More »

40వ రోజుకు చేరిన మునిసిపల్‌ కార్మికుల సమ్మె

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మునిసిపల్‌ కార్మికులు మాట్లాడుతూ నెలరోజులకు పైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీసం తమను చర్చలకు ఆహ్వానించకపోవడం, వారి నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. గ్రామసేవకుల సమస్యలు సైతం పరిష్కరించి తమను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ ...

Read More »

అలరించిన విద్యార్థుల వేషధారణ

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ ప్లే స్కూల్లో శుక్రవారం విద్యార్థులు వివిధ వేషధారణలతో అలరించారు. స్వాతంత్య్ర వేడుకల్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రిహార్సల్స్‌ చేశారు. చిన్నారి విద్యార్థులు భారతమాత, సుభాష్‌ చంద్రబోస్‌, గాంధీజి వివిధ దేశభక్తులు, మిలిటరీ సైనికుల్లాగా వేషధారణలతో ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Read More »

నూతన మద్యం విధానాన్ని రద్దుచేయాలి

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన మద్యం విధానాన్ని రద్దుచేయాలని పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కామారెడ్డి ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా పివోడబ్ల్యు జిల్లా నాయకురాలు అరుణ, పిడిఎస్‌యు జిల్లా నాయకులు ఆజాద్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పల్లెపల్లెకు మద్యం పేరిట ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు ఏర్పాటు ...

Read More »

జిల్లా కలెక్టర్‌గా రోనాల్డ్‌రోస్‌ సేవలు భేష్‌

  నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సంవత్సరం పైగా జిల్లా కలెక్టర్‌గా సేవలందించి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళుతున్న రోనాల్డ్‌ రోస్‌కు క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్‌సిఎల్‌పి పిడి సుధాకర్‌రావు, టిఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, రెవెన్యూ సంఘంప్రతినిధులు, తదితరులు కలెక్టర్‌ సేవలను గుర్తు చేసుకొని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎంతో ప్రశాంతంగా ...

Read More »

వానకురిసే… మనసు మురిసే…

  కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి తాపంతో చాలాకాలంగా వర్షం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు, రైతాంగానికి మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాసింత ఊరటనిచ్చింది. మంగళవారం రాత్రి 3 గంటలకుపైగా భారీ వర్షం కురియగా… అనంతరం ఓ మోస్తరు వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. వర్షాభావం కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో పట్టణ ప్రజలతో పాటు రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. బంగాళాకాతంలో అల్పపీడనం కారణంగా ...

Read More »

అంబేడ్కర్‌ భవన నిర్మాణం కోసం 20 లక్షలు మంజూరు

ఆర్మూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లో అంబేడ్కర్‌ భవన నిర్మాణం కోసం 20 లక్షలు మంజూరైనట్టు ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్‌లో నిధులకు సంబంధించిన 10 లక్షల చెక్కును సంఘం సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రావు, అర్గుల సురేశ్‌, జడ్పిటిసి సాందన్న, పింజ అశోక్‌, చక్కు గంగారాం, మాణిక్యం ఉన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

సిఎం రిలీఫ్‌ఫండ్‌ అందజేత

  ఆర్మూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ అభివృద్దికి, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం. నియోజకవర్గానికి చెందిన పుప్పాల మోహన్‌కు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా వైద్య చికిత్స నిమిత్తం సిఎం రిలీఫ్‌ ఫండ కింద రూ. లక్ష అందజేశారు. లక్ష రూపాయలు మంజూరు కావడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిఎంతో మాట్లాడి ఫండ్‌ విడుదలయ్యేలా చూశారు. ఈ మేరకు గురువారం పుప్పాల ...

Read More »

ప్రారంభానికి సిద్దమైన తెవివి గ్రంథాలయం

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో నిజామాబాద్‌ ఎంపి కె.కవిత చేతుల మీదుగా శుక్రవారం సెంట్రల్‌ లైబ్రరి భవనం ప్రారంభించనున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. మొత్తం యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వివిధ కమిటీలుగా ఏర్పడి ఎంపి కవితకు ఘనస్వాగతం చెప్పడానికి, భవన ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీనియర్‌ ఆచార్యులు యాదగిరి, జయప్రకాశ్‌రావు, ఇతర అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో కలిసి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ...

Read More »

కట్టుకున్నవాడే కడతేర్చాడు

  కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కట్టుకున్నవాడే కాలయముడై భార్యను కడతేర్చిన సంఘటన బుధవారం రాత్రి కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణం హరిజనవాడకు చెందిన యాదమ్మ (35)ను ఆమె భర్త బాలరాజు బుధవారం రాత్రి మెడపై కాలితో తొక్కి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఆర్థిక విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి గొడవ పెద్దదికావడంతో బాలరాజు భార్య యాదమ్మను హత్యచేశాడు. పోలీసులు సంఘటన చేరుకొని శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి ...

Read More »

తెవివిలో విద్యార్థులకు పోటీలు

  డిచ్‌పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని క్విజ్‌, మాక్‌టెస్ట్‌, వ్యాసరచన తదితర పోటీలను నిర్వహించారు. వర్సిటీ సమాన అవకాశాల సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.అపర్ణ, పోటీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ బాల శ్రీనివాసమూర్తి, ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మణచక్రవర్తిల ఆద్వర్యంలో గత మూడురోజులుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ అపర్ణ నేతృత్వంలో జస్ట్‌ ఎ మినట్‌, టెల్‌ అబౌట్‌ యువర్‌సెల్ప్‌ అనే వినూత్నమైన పోటీలను విద్యార్థులలో కాంపిటీటివ్‌ ...

Read More »