Breaking News

Daily Archives: August 15, 2015

కల్టివేటరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్టివేటరు బోల్తాపడిన సంఘటనలో దోమకొండ మండలం చింతామాన్‌పల్లి గ్రామానికి చెందిన నాంపల్లి (32) మృతి చెందాడు. దేవునిపల్లి ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం… కెజ్‌వీల్‌తో పొలాన్ని దున్నేందుకు కిరాయిపై చింతామాన్‌పల్లికి చెందిన నాంపల్లి అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కామారెడ్డి మండలం రాఘవాపూర్‌కు వచ్చాడు. గ్రామ శివారులో కల్టివేటరుతో దున్నుతుండగా అదుపుతప్పి బోల్తాపడడంతో నాంపల్లి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ...

Read More »

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  ఇందూరు, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్న, పెద్ద అందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనండం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు నగర మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ ఆకుల సుజాత ఆధ్వర్యంలో జెండా ...

Read More »

అలరించిన విద్యార్థుల వేషధారణ

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు భారతమాత, ఝాన్సీలక్ష్మిబాయి, సుభాష్‌ చంద్రబోస్‌తో పాటు వివిధ దేశభక్తుల వేషధారణలో ఆహుతులను అలరించారు. విద్యార్థులు ప్రదర్శించిన అభినయగేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కనువిందు చేశాయి. కార్యక్రమంలో వైద్యుడు శ్యాంసుందర్‌, ప్రతినిధి ఎస్‌.ఎన్‌.చారి, మధుసూదన్‌, విశ్వనాథ్‌, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్‌, సంధ్య, ప్రధానాచార్యులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Read More »

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  – ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆయా పార్టీలు, కార్యాలయాలు, కార్మిక సంఘాలు, కులసంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరంజాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్డీవో కార్యాయలంలో ఆర్డీవో నగేశ్‌, మునిసిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అనిల్‌, తెరాస పట్టణ కార్యాలయంలో అధ్యక్షుడు ...

Read More »

ఉత్తమ విద్యార్థికి బహుమానం

  రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి పాఠశాలలో 2014-15 సంవత్సరంలో 10వ తరగతిలో 8.8 గ్రేడుతో ఉత్తీర్ణులైన సయ్యద్‌ బిలాల్‌ అనే విద్యార్థికి స్థానిక ఎంపిటిసి మోహన్‌ రెండు గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిసంవత్సరం ఉన్నత పాఠశాలలో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు కోరారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్తులకు 5 గ్రాముల బంగారాన్ని అందిస్తామన్నారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఇద్దరు ...

Read More »

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో శనివారం 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌ పతాకావిష్కరణ చేయగా, మండల ప్రధాన కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద జడ్పిటిసి నాగభూషణం రెడ్డి పతాకావిష్కరణ చేశారు. అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉదయం 10 గంటలకు తహసీల్‌ కార్యాలయంలో అధికారిక ప్రకటన ప్రకారం తహసీల్దార్‌ వెంకటయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయగీతాన్ని ...

Read More »

జాతి నిర్మాణం విద్యాలయాల్లో జరుగుతుంది

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతి నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుందని, అధ్యాపకులపై జాతి నిర్మాణ బాధ్యత ఉందని గొప్ప అంకితభావంతో కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ పార్థసారధి అన్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఆయన వర్సిటీ పరిపాలనా భవనం, కామర్స్‌, వర్సిటీ కళాశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, లా కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగురవేసి అక్కడి సమావేశమందిరంలో ప్రసంగించారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులు విద్యార్థులను ...

Read More »