Breaking News

Daily Archives: August 18, 2015

గ్రామ సభల్లో హాజరు పెంచాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సర్పంచ్‌లు, వార్డుసభ్యుల సహకారాన్ని పొందాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ యోగితారాణా సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి గ్రామ జ్యోతి మండల ప్రత్యేకాధికారులు, మార్పు ప్రతినిదులు, నోడల్‌ అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ మార్పు ప్రతినిధులు, నోడల్‌ అధికారులు తమకు నిర్దేశించిన గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామజ్యోతి కమిటీలకు వారి విధులపై ...

Read More »

రాజేశ్వరస్వామి ఆలయంలో పల్లకీసేవ

  కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పల్లకీసేవ ఊరేగింపును శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు. రాత్రివేళ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శివుని విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం అభిషేకం, సంకల్పం, మంగళహారతి, శివపార్వతుల పల్లకీసేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు లింగారెడ్డి, భూపతి, సుదర్శన్‌, శ్రీనివాస్‌రెడ్డి, నర్సాగౌడ్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

  కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలోగల శ్రీసీతారామచంద్ర ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతియేటా ఆలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, దేవినవరాత్రులు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి, శివపార్వతుల కళ్యాణం రోజుల రథం ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. కార్తీక మాసంలో పౌర్ణమిరోజు ఆలయం నిండా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈయేడు సైతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పూజల్లో మునిసిపల్‌ ...

Read More »

బదిలీపై వెళ్తున్న ఎంఇవోకు సన్మానం

  కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నుంచి బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారి ఎస్‌.రాములును మంగళవారం ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమేనని, కానీ పనిచేసిన చోట గుర్తింపు పొందేలా విధులు నిబద్దతతో నిర్వహించాలని రాములు అన్నారు. కార్యక్రమంలో డిప్యూటి డిఇవో బలరాం, కొత్త ఎంఇవో దత్తాత్రి, ప్రధానోపాధ్యాయులు సింహాద్రి, గంగాధర్‌, శ్రీధర్‌, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బహిరంగసభ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుర్మయాదవ భారీ బహిరంగ సభ గోడప్రతులను మంగళవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుర్మయాదవ ప్రతినిధులు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆగష్టు 24 వతేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. కుర్మ యాదవులు సభకు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సభకు ఎమ్మెల్యేలను, మంత్రులను ఆహ్వానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కుర్మ యాదవ ప్రతినిదులు భూమయ్య, ...

Read More »

లింగాయిపల్లిలో గ్రామజ్యోతి

  కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ ప్రజలు గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు సర్పంచ్‌, వార్డ్‌మెంబర్లు, గ్రామ ప్రజలు చీపుర్లుచేబూని గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకోసం గ్రామజ్యోతి ఉపయోగపడుతుందని, ఇలాంటి మంచి కార్యక్రమంలో తాము భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌, వార్డ్‌మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »