Breaking News

Daily Archives: August 22, 2015

లింగాపూర్‌లో గ్రామజ్యోతి

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని లింగాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోగల కల్కినగర్‌లో శనివారం గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లను, మురికి కాల్వలను శుభ్రం చేశారు. మురికి కాలువల్లో మందులు పిచికారిచేశారు. కాలనీలోని హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో గడ్డిని తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్‌ బాల్‌రాజు అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నర్సారెడ్డి, అధికారి సాయిలు, వార్డుసభ్యులు కాశయ్య, వెంకటేశం, లింగం, ...

Read More »

ఘనంగా మెగాస్టార్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం చిరంజీవి ప్యాన్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టనంలోని హరిజనవాడ పాఠశాలలో చిన్నారి విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్తులకు నోటుపుస్తకాలు, పెన్సిళ్ళు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని వేడుకున్నారు. అభిమానుల కోరికమేరకు మెగాస్టార్‌ 150వ చిత్రాన్ని నటించి విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు ...

Read More »

ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

  – సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిద్దిరాములు కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆశవర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిద్దిరాములు డిమాండ్‌ చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆశవర్కర్లచేత వెట్టిచాకిరి చేయించుకుంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు పేర్కొన్నారు. ఆశ వర్కర్లకు రూ. 15 వేల కనీస వేతనం ...

Read More »

దేవునిపల్లి గ్రామంలో గ్రామజ్యోతి

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో శనివారం ఎస్‌ఐ నవీన్‌కుమార్‌తోపాటు గ్రామస్తులు గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. వాటర్‌ ట్యాంకులు, మినీ నీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. గ్రామంలోని పరిసరాల్లోని పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్‌ నిట్టు వెంకట్‌రావు మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ పిలుపుమేరకు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని, అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో ...

Read More »

పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, పుస్తకపఠనం చేసి విజ్ఞానం, కృత్యాలు, ఆటపాటల్లో రాణించాలని పట్టనంలోని 5వ వార్డు కౌన్సిలర్‌ పద్మరాంకుమార్‌గౌడ్‌ అన్నారు. ఆమె శనివారం వార్డులోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ఆటపాటల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు ఆటలు, పాటలు, డ్యాన్సు కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ...

Read More »

కంపుకొడుతున్న నందిపేట కాలనీలు

  – పెరుగుతున్న దోమల బెడద నందిపేట్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలు కంపుకొడుతున్నాయి. మురికి కాల్వలు సరిగా తీయకపోవడం వల్ల నీరు రోడ్లపైకి వచ్చి రోజుల తరబడి చెత్తతో కూడి నిల్వ ఉంటుంది. దీంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. అటువైపుగా నడవాలంటేనే ముక్కుమూసుకోని వెళ్లాల్సి వస్తుందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు చెత్త పేరుకుపోవడంతో దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో విషజ్వరాల బారిన పడే ప్రమాదముందని ప్రజలు అంటున్నారు. దోమలనివారణ కోసం ...

Read More »