Breaking News

Daily Archives: August 27, 2015

రాష్ట్రస్తాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విజయ్‌ విద్యార్థినిల ఎంపిక

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి విజయ్‌ హైస్కూల్‌ విద్యార్తినిలు రాష్ట్రస్తాయి పుట్‌బాల్‌ పోటలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ కవితా దివాకర్‌ గురువారం తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యార్తినిలు అక్షర, ఆశి కిరాడ్‌లు రాష్ట్రస్తాయి పోటీలకు ఎంపికైనట్టు ఆమె చెప్పారు. జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ సెలక్షన్స్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచి విద్యార్తినిలు రాష్ట్రస్తాయికి ఎంపికైనట్టుఆమె చెప్పారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో జరిగిన ఎంపికలో ...

Read More »

తెలుగుభాషపై

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుభాష ఎంతో గొప్పనైనదని, తెలుగు భాషపై ప్రతిఒక్కరు మమకారం పెంచుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సద్దార్‌ అస్కారీ చెప్పారు. గురువారం ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యవహారిక భాషా పితామహుడైన గిడుగు రామ్మూర్తి పంతులు 152వ జయంతి వేడుకలు, తెలుగు భాషా దినోత్సవం పేరిట ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలుగు భాషలో మాట్లాడి తెలుగు భాష గొప్పతనాన్ని చాటాలని కోరారు. కళాశాల తెలుగు ఉపాధ్యాయుడు ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో హరితహారం

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నవనాథ పురం అధ్యక్షుడు పోలెపల్లి సుందర్‌ ఆద్వర్యంలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గ్రామంలోని లిటిల్‌ప్లవర్‌ స్కూల్‌ ఆవరణలో యోగేశ్వర కాలనీ, గ్రామంలోని వీధుల్లో క్లబ్‌ సబ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా అధ్యక్షుడు సుందర్‌ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలునాటడం వల్ల పర్యావరణాన్ని రక్షించిన వారమవుతామని ఆయన చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రజలందరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read More »

బిసి విద్యార్థుల సమస్యలపై పోరాడుతాం

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి విద్యార్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముందుండి పోరాడుతామని టిబివిఎస్‌ జిల్లా అధ్యక్షుడు లిక్కి పూర్ణమౌళి చెప్పారు. బిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనలో బిసి సంక్షేమ సంఘం ముందుండి పోరాడుతుందని బిసి విద్యార్థి శక్తిని ప్రదర్శిస్తుందని ఆయన చెప్పారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పీజు రీయంబర్స్‌మెంట్‌, పీజుల మంజూరుకాక అనేక అవస్తలు పడుతున్నారనని ఆవేదనవ్యక్తం ...

Read More »

అంకాపూర్‌కు ఎర్రబెల్లి రైతుల రాక

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి మెదక్‌ జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం పది గంటలకు వస్తున్నట్టు గురడి రెడ్డి సంఘం కార్యదర్శి కె.కె.భాజన్న గురువారం తెలిపారు. ఎర్రబెల్లి గ్రామస్తులు నాలుగు బస్సుల్లో అంకాపూర్‌కు వస్తున్నట్టు ఆయన చెప్పారు. గ్రామ రైతులతో సమావేశమై పంటల సాగు వివరాలు తెలుసుకుంటారని చెప్పారు.

Read More »

కస్తూర్బాలో శిక్షణ శిబిరాల పరిశీలన

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ రాజారాం పరిశీలించారు. ఈ యేడాది వేసవికాలంలో అనాథ విద్యార్తినిలకు 10వ తరగతిలో పెయిల్‌ అయినవారికి కెజిబివిలో శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 36 మండలాల నుంచి ఎందరు విద్యార్థులు వచ్చారు. శిక్షణ ఎంతమందికి ఇచ్చారు. నిధులెన్ని మంజూరయ్యాయి, ఆర్డర్‌ కాపీల కెజివిపి ప్రిన్సిపల్‌ గంగామణిని అడిగి తెలుసుకన్నారు. వేసవి శిక్షణ పొందిన విద్యార్థుల రికార్డులను ఆయన పరిశీలించారు. అనాథ ...

Read More »

ఘనంగా జెండా జాతర

  ఆర్మూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టనంలోనిజెండా గల్లిలోగల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జెండా జాతర ఉత్సవాలను గురువారం సర్వసమాజ్‌, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు జెండా ఊరేగింపు నిర్వహించి అంకాపూర్‌ గ్రామ శివారులో ...

Read More »

రికార్డులు, ఫైళ్ళ నిర్వహణ సక్రమంగా జరగాలి

  నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ నియామకాల ప్రకారం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో పనులను సరైన పద్ధతిలో నిర్వహించటానికి చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పరిషత్‌ సిఇవో తెలిపారు. గురువారం డిఆర్వో కార్యాలయంలో సెక్షన్లను సందర్శించి సంబంధిత పర్యవేక్షకులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.\ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు పరిపాలన కేంద్రమైన కలెక్టర్‌ కార్యాలయంలో పనులు సక్రమంగా జరిగేలా, పైళ్ళు నిర్దేశించిన సమయంలో తీసుకునేలా చూడాలని జిల్లా ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో గురువారం మునిసిపల్‌ ఛైర్‌ఫర్సన్‌ సుష్మసిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 7 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్టు తెలిపారు. పట్టణంలోని 33 వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించేందుకు అధికారులచేత నివేదిక రూపొందిస్తున్నామన్నారు. దాన్ని ప్రభుత్వానికి అందజేసి అవసరమైన నిదులు తీసుకొచ్చి పట్టణంలో సదుపాయాల కల్పనకు కృసి చేస్తామన్నారు. కాంట్రాక్టర్లను పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు ప్రగతి పనులు ప్రారంభించారు. రూ. 2 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని చాలా వార్డుల్లో రోడ్లు లేని దుస్థితి నెలకొందని, ఆయా వార్డులను గుర్తించి ప్రణాళిక బద్దంగా అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, కౌన్సిలర్‌ భూంరెడ్డి, ...

Read More »

పట్టణ పారిశుద్యంలో అందరూ భాగస్వాములు కావాలి

  కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణం చెత్త రహితంగా పరిశుభ్రంగా ఉండాలంటే అందులో కార్మికులతో పాటు పాలకవర్గ సభ్యులు భాగస్వామ్యం అవసరముందని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం కౌన్సిలర్లకు స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ తెలంగాన వ్యర్థ పదార్థాల నిర్వహనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఛైర్‌పర్సన్‌ హాజరై మాట్లాడారు. పట్టణం శుభ్రంగా ఉంటేనే ప్రజలందరు ఆరోగ్యంగా ఉంటారని, ఆ దిశగా కార్మికులు, పాలక వర్గ ప్రతినిదులు కృసి చేయాలన్నారు. ఆయా ...

Read More »

విశ్వవిద్యాలయ సంచాలకులతో రిజిస్ట్రార్‌ సమీక్ష

  డిచ్‌పల్లి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివిలోని వివిధ విభాగాలకు సంబంధించిన సంచాలకులు ఉపసంచాలకులతో తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి గురువారం సమీక్షించారు. న్యాక్‌ సందర్భంగా వివిధ విభాగాలలోని సంచాలకులు తమ విభాగాల నివేదికలు సిద్దం చేయాలని తెలిపారు. యూనివర్సిటీలోని అడ్మిషన్లు, పరీక్షల విభాగం, రీసర్చ్‌ డెవలప్‌మెంట్‌, ఆర్‌టిఐ, మహిళా విభాగం, బిసి, ఎస్సీ, మైనార్టీ, పబ్లికేషన్స్‌, డైరెక్టర్స్‌ స్పోర్ట్స్‌, యుజిసి, కెరీర్‌ గైడెన్స్‌, కాంపిటీటివ్‌ సెల్‌, తెలంగాణ పరిశోధన కేంద్రం, సంచాలకులతో సమావేశం నిర్వహించారు. నేటివరకు నిర్వహించిన ...

Read More »

డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగు సిలబస్‌లో మార్పు

  డిచ్‌పల్లి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణరాష్ట్ర ఉన్నత విద్యామండలి వారి ఆధ్వర్యంలో డిగ్రీ ప్రథమ సంవత్సర పాఠ్య ప్రణాళిక పుస్తకాలు రూపొందించారు. పుస్తక రూపంలో తెలుగు అకాడమి వారు ప్రచురించిన డిగ్రీ ప్రథమ సంవత్సర పాఠ్య ప్రణాళిక పుస్తకాన్ని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తన చాంబర్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల వారు ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పాఠ్యాంశాలు అమల్లో ఉంటాయని రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీచేశారు. పాఠ్యాంశాలను ...

Read More »

గ్రామస్తుల ఐక్యతతోనే గ్రామాభివృద్ది

  – ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ బీర్కూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బైరాపూర్‌ గ్రామాన్ని బుధవారం బోధన్‌ ఆర్డీవోశ్యాంప్రసాద్‌లాల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గ్రామప్రజలందరు ఐక్యంగా ఉంటేనే గ్రామాభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా వివిధ కమిటీల ద్వారా గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ది చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులందరితో శ్రమదానంలో భాగంగా గ్రామంలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. మహిళలు బహిర్భూమి సమాజానికి సిగ్గుచేటని ఆయన అన్నారు. గ్రామంలో మరుగుదొడ్లు లేని ...

Read More »

మదర్‌ థెరిస్సా రోగులపాలిట దేవత

  నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరాశ్రయులకు, అనాధలకు, రోగులకు సేవలందించి వారి పాలిట దేవతల లాగా ఉన్నారని మదర్‌ థెరిసా సేవలను కొనియాడారు. అనాథలకు, రోగులకు సేవచేయడం ఎంతో గొప్ప విషయమని స్నేహసోసైటి రూరల్‌ రికన్‌స్ట్రక్షన్స్‌ ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య అన్నారు. బుధవారం నగరంలోని మారుతినగర్‌లోని స్నేహసోసైటి రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అంధుల మరియు మానసిక వికలాంగుల పాఠశాలలో, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ ఇందూరు,మేఘన డెంటల్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మదర్‌థేరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా హజరైన ...

Read More »

30న న్యాయశాఖ జాతీయ సదస్సు

  నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ సదస్సు జయప్రదం చేయాలని న్యాయశాఖ ఉద్యోగుల అధ్యక్ష,కార్యదర్శులు జగన్నాథం,రాజశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 30 న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కాచిగూడలో గల మున్నూరుకాపు సంఘంలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డిఎస్‌బోస్లే,హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుభాస్‌రెడ్డి గౌరవ అతిథిగా హజరుకానున్నారన్నారు. జగన్నాథ శెట్టి కమిషన్‌ ...

Read More »

రెండోరోజు అర్చకుల నిరసన

  – దేవాదాయశాఖ అధికారికి వినతి నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా అర్చకులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. బుధవారం నిరసనలో భాగంగా నగరంలో అర్చకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి, కంఠేశ్వరం ఆలయం నుంచి హమల్‌వాడి సాయిబాబా ఆలయం, జెండా బాలాజీ ఆలయం మీదుగా, మాధవనగర్‌ ఆలయం, వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అక్కడినుంచి ఎండోమెంట్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి దేవాదాయశాఖ అధికారికి ...

Read More »

బోరు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 4వ వార్డులో బుధవారం వార్డు కౌన్సిలర్‌ జ్యోతి బోరు తవ్వకం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో నెలకొన్న నీటి ఎద్దడి దృష్ట్యా మునిసిపల్‌, కాలనీవాసుల భాగస్వామ్యంతో వార్డులో బోరు తవ్వకం పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వార్డులో నీటి ఎద్దడి నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ప్రభాకర్‌ యాదవ్‌, నాయకులు సతీష్‌, లక్ష్మణ్‌, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రగతిపనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని 29వ వార్డులో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ బుధవారం పలు ప్రగతిపనులు ప్రారంభించారు. బిఆర్‌జిఎఫ్‌ నిధులు రూ.లక్షతో చేపట్టిన సిసి డ్రైన్‌, కల్వర్టు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంతో కౌన్సిలర్‌లు అందరితో కలిసి పనిచేస్తున్నామన్నారు. అన్ని వార్డుల్లో ప్రగతి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ సునిత, కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాష్‌ ...

Read More »