Breaking News

Daily Archives: August 30, 2015

ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి – పట్టించుకోని అధికారులు

  డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో పందులు యథేచ్చగా తిరగడం వల్లే డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి తాండవమాడుతున్నా పంచాయతీ సిబ్బంది, అధికారలు మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని అంటున్నారు. గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్లే ఈ వ్యాధి సోకుతుందని పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య అధికారులు సూచించగా, పందులు పెంచేవారికి తహసీల్దార్‌ రవిందర్‌ మందలించారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పందులు ఉంచాలని ఆదేశించగా అధికారుల సూచనలు ...

Read More »

అంగడికి తగ్గని ఆదరణ

  నందిపేట్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక యుగంలోను దశాబ్దం క్రితం మొదలైన వారంతపు సంత (అంగడి)లకు ఈ కాలంలో కూడా ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. నగరాల్లో సూపర్‌ మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ లాంటి వాటికి ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉనికిని చాటుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్య అవసర వస్తువులు, పదార్థాల కోసం ఏర్పాటు చేసుకున్న అంగళ్ళు గ్రామీణ బజార్లుగా చలామణి అవుతున్నాయి. నందిపేట్‌ మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే ...

Read More »

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

  నిజామాబాద్‌ రూరల్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని, జిల్లాలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17నాడు ఉత్సవాలను అధికారంగా నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన సెప్టెంబర్‌ ...

Read More »

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

  నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని దాన్ని వెలికితీసి సమాజానికి ఉపయోగపడేలా మలిచేది మాత్రం ఉపాధ్యాయులేనని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక రాజీవ్‌గాంధీఆడిటోరియంలో జిల్లాలోని 14 సాంఘీక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థుల సమ్మెళనం, అలాగే ఫిజికల్‌ డైరెక్టర్‌ మన్నాన్‌ ఉద్యోగ విరమణ కార్యక్రమాలను నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్‌ ...

Read More »

కొనసాగుతున్న గ్రామజ్యోతి

  ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామజ్యోతిలో భాగంగా గుర్తించిన పనుల నమోదు కార్యక్రమం ఆదివారం సైతం కొనసాగుతుంది. మండలంలో 20 గ్రామాలుండడంతో గ్రామాల వారిగా ఈ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎంపిడివో ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. కార్యక్రమానికి సంబంధిత కార్యదర్శులు పనుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.

Read More »

31న హరితహారం

  ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ సమాజ్‌ స్మశానవాటికలో సోమవారం ఉదయం 10 గంటలకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నట్టు అధ్యక్ష, కార్యదర్శులు మురళీధర్‌, పడాల్‌ గణేష్‌లు తెలిపారు. హరితహారంలో భాగంగా శ్మశానవాటికలో వివిధ మొక్కలునాటి వాటి పరిరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమానికి సమాజ సభ్యులందరు పాల్గొనాలని వారు పేర్కొన్నారు.

Read More »

31 నుంచి యోగా శిక్షణ

  ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఈనెల 31వ తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు ద్యానవైద్య యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకురాలు రేణుకమాత ఆదివారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు రెండు బ్యాచులుగా యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆసక్తిగలవారు ఈ శిబరంలో హాజరు కావాలని ఆమె కోరారు.

Read More »

ర్యాగింగ్‌ చేస్తే చర్యలు తప్పవు

  ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు తమ శ్రద్దను చదువుపై ఉంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ చెప్పారు. అలా కాకుండా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినా, ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా కటిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్‌, కళాశాలలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ర్యాగింగ్‌ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థినిలపై, ఆడపిల్లలపై ర్యాగింగ్‌ చేస్తే కేసులు నమోదు చేస్తామని, కాబట్టి యువత చదువుపై దృష్టి పెట్టాలని ...

Read More »

వర్షానికి తడిసి ముద్దయిన పట్టణం

  కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తన్న వర్షానికి పట్టణం తడిసి ముద్దయింది. గత కొన్ని నెలలుగా ఎండ వేడిమితో సతమతమవుతున్న ప్రజలకు శుక్రవారం ప్రారంభమైన వర్షం ఊరటనిచ్చింది. వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని చాలా వార్డుల్లో అంతర్గత రోడ్లు మురికి కాలువలు లేకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. ఏదేమైనప్పటికి ఓ పక్క భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రస్తుతం ...

Read More »

ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

  కామారెడ్డి. ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం ప్రజలు రాఖీ పండగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండగ రోజున సోదరీ మణులు తమ సోదరులకు రాకీలు కట్టారు. కూతుళ్ళు తండ్రులకు రక్షాధారణ చేశారు. ఆనవాయితీ ప్రకారం అనంతరం కట్నకానుకలు స్వీకరించారు. జీవితాంతం తోడునీడగా నిలవాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం నేపథ్యంలో రాఖీ ...

Read More »

40 లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని 40 లక్షల మత్స్యకారులకు కేజ్‌ కల్చర్‌ చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎడపల్లి మండలం జానకంపేట్‌ అశోక్‌సాగర్‌ చెరువులో కేజ్‌ కల్చర్‌ చేపల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. గతంలో మత్స్యకారులకు చేపల పెంపకాన్ని ప్రోత్సహించనందున వారు ఉపాధి లేక వలసలకు వెళుతున్నారని, ప్రస్తుతం వారిని ప్రోత్సహించి ఉపాధి కల్పించడానికి కొత్త ...

Read More »

రక్షాబంధన్‌….

  ఆత్మీయతను పంచి.. అనురాగమును పెంచే పండగ నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే రక్షాబంధన్‌ కార్యక్రమం నిజామాబాద్‌ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండగకు ప్రత్యేక విశిష్టత ఉంది. శనివారం ఉదయం నుంచే మంగళ స్నానాలు ఆచరించిన ప్రజలు ఆయా ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే ఇళ్ళల్లో అక్కా, చెల్లెల్లు అన్నా, ...

Read More »