Breaking News

Daily Archives: August 31, 2015

ఉరివేసుకొని ఆత్మహత్య

  ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం జర్నలిస్టు కాలనీకి చెందిన రాజ్‌కుమార్‌ (26) ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ సోమవారం తెలిపారు. మృతుని అన్న గటాడి విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఆర్మూర్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఆయన వివరించారు. మృతుని అన్న కథనం ప్రకారం.. తన తమ్ముడు రాజ్‌కుమార్‌ మతిస్థిమితం లేనివాడని ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు ...

Read More »

వ్యాయామంతో శారీరక ఆరోగ్యం

  – మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ అన్నారు. కామారెడ్డి సిరిసిల్లా రోడ్డులో రాయల్‌ పవర్‌ వ్యాయామ శాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అందరు వ్యాయామ శాలను వినియోగించుకొని శారీరక దారుఢ్యాన్ని, వ్యాధులు లేని జీవితాన్ని పొందాలని సూచించారు. జిమ్‌ నిర్వాహకుడు ఎజాజ్‌ మాట్లాడుతూ జిమ్‌లో ...

Read More »

పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం

  కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. స్వర్ణకారసంఘానికి ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షులుగా బ్రహ్మం, కార్యదర్శిగా ఎంజి బ్రహ్మం, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, బొట్టు శ్రీను, కోశాధికారిగా చక్రపాని, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్‌, ప్రభు, తదితరులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా విశ్వనాథం, చారి, లక్ష్మయ్య, చక్రపాణిలు వ్యవహరించారు.

Read More »

గుండాయిజం అదుపునకు రూ. 20 కోట్లతో కమాండెంట్‌ కంట్రోల్‌ రూం

  – శాంతి భద్రతలకోసం రూ. 350 కోట్లు మంజూరు – రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాన ప్రాంతంలోని గుండాయిజాన్ని, రౌడీ యిజాన్ని అదుపు చేయడానికి హైదరాబాద్‌లో రూ. 20 కోట్లతో 20 అంతస్తుల కమాండెంట్‌ కంట్రోల్‌ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. సోమవారం సదాశివనగర్‌ మండలంలో 67 లక్షల విలువతోనిర్మించిన పోలీసు స్టేషన్‌నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ...

Read More »

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో 33 శాతం మహిళా పోలీసులు

  – హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి భీమ్‌గల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల రక్షణకు ప్రతి పోలీస్‌స్టేషన్లో 33 శాతం మహిళా పోలీసులను నియమించనున్నామని పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సరైన మర్యాద ఇచ్చి వారి పని పూర్తిచేసి పంపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని రాష్ట్రహోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం భీమ్‌గల్‌ మండల కేంద్రంలో 2 కోట్లతో నిర్మించిన పోలీసు స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ...

Read More »

ప్రజావాణికి 7 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో తహసీల్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావణి కార్యక్రమం ఈవారం సైతం కొనసాగింది. అందులో భాగంగానే ఆర్మూర్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌ ఫిర్యాదు దారుల వద్దనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన ఏడు ఫిర్యాదుల్లో మూడు ఆహారభద్రత కార్డులకు సంబంధించినవి, రెండు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి, ఒకటి పట్టా బూమి ఆన్‌లైన్‌ ఎంట్రీ కోసం, మరొకటి వికలాంగ పించన్ల కోసం వచ్చినట్టు తెలిపారు. పిర్యాదులను సంబంధిత అధికారులకు బదిలీచేసి వాటిని సత్వరమే ...

Read More »

8న తెలుగు అధ్యాపకుల సమావేశం

  డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లోని తెలుగు అధ్యాపకులతో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 1.30 గంటలకు యూనివర్సిటీ కళాశాలలో నిర్వహించనున్నట్టు తెవివి తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు ఆచార్య కనకయ్య తెలిపారు. 2015-16 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్‌ మార్పు జరిగినందున ఇందుకు సంబంధించిన సమగ్ర విషయాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు కనకయ్య వివరించారు. సమావేశంలో ...

Read More »

ఆర్టీసి కార్మికులను ఆదుకోవాలి

  ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నుంచి వివిధ పట్టణాలకు ప్రత్యేక సర్వీసులను రద్దుచేయడంతో ఆర్మూర్‌ డిపో ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగారు. బస్టాండ్‌లో టెంట్లు వేసుకొని బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సోమవారం ఆర్టీసి కార్మికులకు బిజెపి రాష్ట్ర నాయకుడు అల్జాపూర్‌ శ్రీనివాస్‌తోపాటు బిజెవైఎం పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్‌ ఆర్టీసి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. ఆర్మూర్‌ నుంచి వివిద ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను రద్దుచేయడం ...

Read More »

దళిత రైతులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

  ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత రైతులు వ్యవసాయ భూముల్లో ఆధునిక పద్దతుల్లో పంటలు పండించి అధిక లాభాలు గడించాలని ఆర్మూర్‌ ఎంపిపి పోతునర్సయ్య తెలిపారు. సోమవారం ఆర్మూర్‌ మండల పరిసత్‌ కార్యాలయంలో పంట సమూహాల అభివృద్ది పథకం కింద సమగ్ర వ్యవసాయంపై దళిత రైతులకు శిక్షణ శిబిరాన్ని నిజామాబాద్‌ రైతుశిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఎడిఎ నర్సింహాచారి రైతులకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని ...

Read More »

పాఠశాలలో చోరీ

  ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని ఫతేపూర్‌ గ్రామంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్టు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో దొంగలు పగులగొట్టిన గదిలో ఏమి లేకపోవడంతో పెద్దగా చోరీ జరగలేదని ఆయన వివరించారు. విషయమై ఆర్మూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన చెప్పారు.

Read More »

క్షత్రియ సమాజ్‌ ఆద్వర్యంలో హరితహారం

  ఆర్మూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో క్షత్రియ శ్మశాన వాటికలో సోమవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సమాజ్‌ అద్యక్షులు మురళీధర్‌, కార్యదర్శి పడాల్‌ గణేశ్‌ ఆధ్వర్యంలో కానుగ మొక్కలు, టేకు తదితర మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియ కులస్తులకు అన్ని రకాలుగా శ్మశానంలో అవసరాలను గుర్తించి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం వినూత్న కార్యక్రమం చేపట్టి రాష్ట్రాన్ని హరితవనంగా ...

Read More »

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

  మెదక్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొన్ని నిమిషాల్లో సొంతింటికి చేరుకుంటానన్న ఆశ అడియాశ అయింది…ప్రమాద వశాత్తు గుర్తు తెలియని వాహనం మృత్యువు రూపంలో మింగేసింది.. వివరాల్లోకి వెళితే నిజాంపేట్‌కు చెందిన షేక్‌ ఉబేద్‌ (24) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం తెల్లవారుజామున తన సొంతిల్లు నిజాంపేటకు కుటుంబ సభ్యులను చూసేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరాడు. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననుకున్న సమయంలోనే నిజాంపేటకు అతిస్వల్ప దూరంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ...

Read More »

ఉల్లిసాగుపై రైతుల ఆసక్తి

  బాన్సువాడ, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉల్లి ధర సామాన్యులను కంటతడిపెట్టిస్తుండగా మరోవైపు సాగుదారుల్లో ఆసక్తిని రేపుతుంది. రెండు మూడు నెలలుగా ఉల్లిధరలు చుక్కలనంటి సామాన్యులు కొనలేని పరిస్తితికి చేరింది. ప్రతికూల పరిస్థితుల వల్ల ఈయేడు ఉల్లిసాగు తగ్గడం ధరలను ప్రభావితం చేసింది. మూడునాలుగు నెలల క్రితం వరకు కిలో రూ. 25 నుంచి 30 ధర పలకగా క్రమేపి పెరుగుతూ ప్రస్తుతం వందకు చేరువయ్యింది. దీంతోసామాన్యులకు ఉల్లి తినడం ప్రియంగా మారింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు ...

Read More »

సంప్రదాయం.. సంస్కారం…

  నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుగాలు మారిన సంప్రదాయాలు మారలేదు…రోజులు మారినా, కాలం మారినా సంస్కారం వీడలేదు…పై చిత్రాన్ని చూస్తే ఇలా అనిపిస్తుంది కదూ. నడవడం నేర్చుకున్న మనవడిని ఓ తాతయ్య సంస్కారం, సంప్రదాయం నేర్పించడం కోసమని ఇలా వేషం వేయించాడు. శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం ఇలా వారి వారి సంప్రదాయాల ప్రకారం మంగళస్నానం ఆచరించిన ఇంట్లోని చిన్న వారిని జోలెకట్టి, పట్టు ధోవతి చుట్టి, నుదుట విభూతి ...

Read More »

డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

  – గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై హెల్త్‌ సూపర్‌వైజర్‌ మండిపాటు డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో డెంగ్యూ వ్యాధి సోకడానికి కారణాలను హెల్త్‌ సూపర్‌వైజర్‌ అఖిల్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం గ్రామంలోని అన్ని కాలనీల్లో పర్యటించి నీటి తొట్టిలను, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించగా పాతబడిన నీటి తొట్టిలలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పుట్టుకువచ్చి డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదముందని గ్రామ పంచాయతీ వారికి ...

Read More »