Breaking News

Monthly Archives: September 2015

అడుగంటుతున్న జలాలు -ఎండుతున్న పంటలు

  బాన్సువాడ, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరి సాగుచేస్తున్న రైతులకు నీటి కొరత వేధిస్తుంది. సమయానికి నీరందక పంటలు ఎండి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోధన్‌ ప్రాంతంలో గొట్టపు బావుల ఆధారంగా రైతులు వరిపంట సాగుచేశారు. నిజాంసాగర్‌ ఆయకట్టుతోపాటు ఆయకట్టేతర భూముల్లో భూగర్భ జలాలను నమ్ముకొని రైతులు వరిసాగుచేశారు. ఈయేడు వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అంతకంతకు అడుగంటిపోతున్నాయి. దీనికి తోడు ఎండలు మండుతుండడంతో భూములు తడారిపోతూ నెర్రెలువారుతున్నాయి. ప్రస్తుతం ...

Read More »

ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై కమీషన్‌ సమీక్ష

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింల సామాజిక, ఆర్థిక విద్యా స్థితిగతులపై విచారించేందుకు ఏర్పడిన కమీషన్‌ ఛైర్మన్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జి.సుధీర్‌ను ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై, వారి అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంత మంది ప్రభుత్వం నుంచి లబ్దిపొందుచున్నారు, ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో, ఇంకా వారికై ఏమేమి వసతులు కల్పించాలనే అంశాలపై ...

Read More »

ఆర్మూర్ MLA జీవన్ రెడ్డి గారిని కలిసిన కొండూర్ గ్రామ మాజీ సర్పంచ్

ఆర్మూర్ నియోజక ప్రజలు MLA జీవన్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి తమ ఆలూర్ గ్రామానికి లింక్ రోడ్డు మంజూరు చేయాలనీ ఆలూర్ గ్రామా ప్రజలు మరియు నందిపేట్ మండల ch. కొండూర్ గ్రామానికి లింక్ రోడ్డు కావాలని ch. కొండూర్ గ్రామ మాజీ సర్పంచ్ రాజు కోరారు.  MLA ను కలిసిన వారిలో నాయకులు కొండూర్ భూమేశ్, దొంకేశ్వర్ రఫీ ఉన్నారు.

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సంబంధిత వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మోతిబిందు గల వారికి బోధన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసినట్టు కంటి వైద్య నిపుణులు సంపత్‌ తెలిపారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని మండల ...

Read More »

రబీలో 31,960 క్వింటాళ్ళ విత్తనాల పంపిణీ

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రబీ సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా సూచించారు. మంగళవారం నిజామాబాద్‌ మార్కెటు యార్డులో రైతులకు శనగ విత్తనాలను కలెక్టర్‌ పంపిణీ చేశారు. విత్తనాలకు 33 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. సబ్సిడీపై అందజేసే విత్తనాలను జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో శనగ24 వేల క్వింటాళ్ళు, మొక్కజొన్న 6 ...

Read More »

రూ. 2,95,730 లతో గ్రంథాలయాల్లో కంప్యూటర్లు

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజారాం మోహన్‌ రాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌ కలకత్తా నుంచి రూ.2,95,730 లతో నూతన కంప్యూటర్ల కొనుగోలుకు అనుమతి లభించిందని నిజామాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డి. శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో బిబిపేట్‌, నందిపేట్‌, సిరికొండ గ్రంథాలయాలు అద్దె భవనంలో కొనసాగుతున్నందున వాటికి అద్దె పెంపకంపై తీర్మానించడం జరిగిందన్నారు. జిల్లాలోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి, 4 మునిసిపాలిటీల్లో నెలకొల్పబడిన ...

Read More »

గుండె జబ్బుల నివారణకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవులు గుండె జబ్బులకు గురికాకుండా ఉండడానికి వారి అలవాట్లను, వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరమెంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా సూచించారు. మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ గుండె దినోత్సవ సందర్బంగా కార్డియాలజిస్టు ప్రగతి ఆసుపత్రి సంస్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ దేశాలు మన దేశాన్ని గుండె జబ్బులకు నిలయంగా వర్ణించడం జరిగిందని, ఈ ప్రమాద స్తాయి ...

Read More »

అక్టోబరు 19న కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎన్జీవోస్‌ కాలనీ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలను అక్టోబరు 19న నిర్వహిస్తున్నట్టు సొసైటీ ఎన్నికల అధికారి కృష్ణయ్య తెలిపారు. ఎన్నికల్లో హౌజింగ్‌ సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే పోటీకి అర్హులని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసేవారు అక్టోబరు 14న నామినేషన్లు వేయాలని సూచించారు. 16న స్క్రూటిని నిర్వహించి 19న ఎన్నికలు, అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు.

Read More »

ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణకై ఉద్యమించండి

  – ఛలో అసెంబ్లీ పోస్టర్ల ఆవిష్కరణ కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణకై ప్రజాస్వామిక వాదులందరు ఉద్యమించాలని, ఇందులో భాగంగా సెప్టెంబరు 30న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఆజాద్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన గోడప్రతులను మంగళవారం కామారెడ్డలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ కన్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి వచ్చాక నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయిస్తున్నారని, ఎన్‌కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలేనని ...

Read More »

వైశ్యులపై ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి మోడి ముద్ర యోజన రేడియో ప్రకటనలో భాగంగా వైశ్య కులాన్ని కించపరిచే వ్యాఖ్యలను నిరసిస్తూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వైశ్యులు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు . అనంతరం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడి వైశ్యులను కించపరిచేవిధంగా రైతు సంపాదన అంతా కోమటోడి వడ్డీకే సరిపోతుందని రేడియోలో ప్రకటన చేయడం తమ కులాన్ని ...

Read More »

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తెరాస అక్రమ అరెస్టులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తమ హక్కుల కోసం ప్రభుత్వంపై నిరసన తెలిపితే అక్రమ అరెస్టులు చేయడం గర్హణీయమని సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం అన్నారు. విద్యార్థుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి కలెక్టర్‌కు విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వెళ్తుండగా రైల్వేస్టేషన్‌లో సిఐటియు నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, ఉద్యమం మరింత బలపడుతుందే తప్ప తగ్గదని హెచ్చరించారు. కెసిఆర్‌కు తగిన బుద్ది ...

Read More »

అంబేడ్కర్‌ విగ్రహానికి ఆశ వర్కర్ల వినతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిఐటియు ప్రతినిధులు కె.రాజనర్సు మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో కల్పించిన కనీస వేతనాల చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. కెసిఆర్‌ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులందరిని పర్మనెంటు చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచాక వారిని పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. ఆశలను రెగ్యులర్‌చేయాలని, 15 వేల ...

Read More »

అక్టోబరు 1న తెవివిలో నిపుణుల ప్రసంగాలు

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 1వ తేది గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండు ప్రసంగ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు టిఎస్‌పిఎస్‌సి సిలబస్‌ కమిటీ సభ్యులు ఆచార్య సత్యనారాయణ, ప్రముఖ న్యాయశాఖ నిపుణులు జిబి .రెడ్డి కార్యక్రమంలో ప్రసంగిస్తారని రిజిస్ట్రార్‌ తెలిపారు.

Read More »

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం ప్రాంగణ నియామకాలు

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో తెలంగాణ యూనివర్సిటీలో డ్రగ్స్‌పై లిమిటెడ్‌ కంపెనీ వారు ప్రాంగణ నియామకాలు నిర్వహించడం జరిగింది. మొత్తం వివిధ కళాశాలల నుంచివచ్చిన విద్యార్థులు నియామకాల్లో భాగంగా నిర్వహించిన రాత పరీక్షలకు హాజరై 18 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. వీరికి ఇంటర్వ్యూలను నిర్వహించారు. వీటిలో విద్యార్థులకు నియామక పత్రాలను త్వరలో అందిస్తామని హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రాంగణ నియామక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్‌ ఆచార్య ...

Read More »

తెవివిలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ ప్రవీణాబాయి ఆద్వర్యంలో నిర్వహించిన ఆర్ట్స్‌ కాలేజీ వద్ద పరిసరాలను వాలంటీర్లు పరిశుభ్రం చేశారు. కళాశాల చుట్టుపక్కల ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి అనంతరం వాలంటీర్లు కాలేజీ ఆవరణలో చెత్త, చెదారాన్ని ఎత్తివేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు రాజ్‌కుమార్‌, లింబాద్రి, రఘునాథ్‌, నిశాంత్‌, చంద్రకాంత్‌, కృష్ణకాంత్‌, స్వర్ణ, రజిత తదితరులు పాల్గొన్నారు.

Read More »

రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాలి

  – జిల్లా కలెక్టర్‌ పిలుపు నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుక కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలభారత రైతు జాగృతి యాత్ర సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు కూడా ఒక మానవ మాత్రుడేనని, అందరికి వలే ఒత్తిడి ప్రభావం అతనిపై ఉంటుందని, ఆ ఒత్తిడిని తట్టుకొని నిలదొక్కుకునేందుకు ...

Read More »

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌ కల్చరల్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూరు చెరువులో ఈనెల 27న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం సాయంత్రం మల్కాపూరు చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను అధికారులతోకలిసి కలెక్టర్‌ పరిశీలించారు. మూడు అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను మల్కాపూర్‌ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి నిమజ్జనం ప్రదేశానికి వాహనాల రాకపోకలకు విడివిడిగా తాత్కాలిక రోడ్డును ఏర్పాటు ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 9వ వార్డు అయ్యప్ప నగర్‌లో శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2 లక్షలతో కల్వర్టు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కాంట్ట్రార్లు సైతం పనులను నాణ్యతతోచేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ మోహన్‌, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్లు ...

Read More »

గణేష్‌ నిమజ్జన యాత్రకు ఏర్పాట్లు పూర్తి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు శనివారం నిమజ్జనానికి తరలనున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసు, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు పూర్తి చేశారు. కామారెడ్డి మండలం టేక్రియాల చెరువులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. చెరువు వద్ద ఏర్పాట్లను కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, సిఐ శ్రీనివాసులు పరిశీలించారు. కామారెడ్డిలో నిమజ్జన శోభాయాత్రను ప్రతియేడు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు 24 గంటల పాటు శోభాయాత్ర ఎక్కడా లేనివిధంగా ...

Read More »

కృష్ణానంద స్వామీజీకి సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నవరాత్రులను పురస్కరించుకొని కామారెడ్డి గంజ్‌లో 9 రోజుల పాటు గణపతి గీతా మహాత్మ్యాన్ని ప్రబోధించిన కృష్ణానంద స్వామిని గంజ్‌ వర్తక సంఘం ప్రతినిధులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు ప్రథమ పూజనీయుడని, ఏదేవుని పూజించినా ముందుగా గణపతికి పూజ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు డి.లక్ష్మిపతి, పిప్పిరి శ్రీనివాస్‌, రమణారావు, వెంకటరాజులు, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »