Breaking News

Daily Archives: September 22, 2015

బతుకమ్మ ఆటతో ఆశ వర్కర్ల నిరసన

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశావర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రోడ్డుపై బతుకమ్మ ఆడుతూ మంగళవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని దర్నాచౌక్‌లో తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 21 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. నిరసనలో భాగంగా ఆశావర్కర్లు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకూడా లేదని ఆరోపించారు. కనీస వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సమస్యలన్ని సాధించేంత వరకు తమ నిరసన ...

Read More »

స్మార్ట్‌ సిటీగా నిజామాబాద్‌

  – ఎమ్మెల్యే గణేష్‌ గుప్త నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర అభివృద్దే తమ ధ్యేయమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని కాలనీ సమస్యల పరిష్కారానికై పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 16వ డివిజన్‌ గాయత్రీనగర్‌లో 25లక్షల 70వేల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాన చేశారు. అదే విధంగా అర్సపల్లిలోని బీటిరోడ్డు, పౌండింగ్‌ స్టోన్‌, సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు, ...

Read More »

బతుకమ్మ ఆడిన ఆశ వర్కర్లు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలను పరిస్కరించాలని కోరుతూ గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారతి, దివ్య, శైలజ,రాణి తదితరులున్నారు.

Read More »

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా పండగలు జరుపుకొని సామరస్యంగా ఉండాలని బోధన్‌ రూరల్‌ సిఐ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గణపతి మండపాల వద్ద పేకాట, మద్యం సేవించినట్టయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిజెలకు బదులుగా భజనలతో శాంతియుతంగా నిమజ్జనం చేయాలని, ముందుగా యువత ...

Read More »

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కల్యాపూర్‌ గ్రామానికి చెందిన ఐతి సాయన్న (55) అప్పుల బాధ భరించలేక సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో అందరు నిద్రించిన సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బోదన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు రెంజల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో రైతు ...

Read More »

రెంజల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో 20 శాతం మాత్రమే పంట సాగుచేశారని, 80 శాతం మంది రైతులు పంటలు వేసుకోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సభ సజావుగా సాగుతూ పలు శాఖలపై చర్చించారు. వైద్యశాఖలో మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ...

Read More »

శిక్షణకు హైదరాబాద్‌కు జూనియర్‌ అసిస్టెంట్లు .

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందించేందుకు హైదరాబాదులోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్లకు 4 వారాల శిక్షణ ఇప్పించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రానా ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌, జిల్లా ఎంపిక కమిటీల రిక్రూట్‌మెంట్‌ లేదా కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన జూనియర్‌ అసిస్టెంట్లకు రెసిడెన్షియల్‌ కోర్సుగా ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. అయితే మూడు సంవత్సరాలలోపు ఉన్న సర్వీసు ఉన్నజూనియర్‌ అసిస్టెంట్లకే ...

Read More »

దుర్గా సేవాదళ్‌ గణేష్‌ వద్ద కుంకుమ పూజలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రాంమందిర్‌ రోడ్డులోగల దుర్గసేవాదళ్‌ గనేష్‌ మండపం వద్ద మంగళవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంక్యలో కుంకుమ పూజలో పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సేవాధళ్‌ అధ్యక్షులు నిఖిల్‌రావు, ప్రతినిధులు వినయ్‌, రాజేశ్‌, బైరయ్య, అనిల్‌రెడ్డి, తదితరులున్నారు.

Read More »

ఆర్యవైశ్య అధ్యక్షునికి కౌన్సిలర్ల సన్మానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కైలాష్‌ శ్రీనివాస్‌రావున మంగళవారం కామారెడ్డిలో మునిసిపల్‌ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్లు మోతె కృష్ణాగౌడ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, కైలాష్‌ లక్ష్మణ్‌, ముప్పారపు ఆనంద్‌, భూంరెడ్డి, అంజద్‌, ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, సునీత, యాదమ్మ, విజయ, పద్మ, లక్ష్మి, ప్రభాకర్‌ యాదవ్‌ తదితరులు శ్రీనివాస్‌రావును సన్మానించిన వారిలో ఉన్నారు.

Read More »

కలెక్టర్‌కు ఆశ వర్కర్ల వినతి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాకు మంగళవారం కామారెడ్డిలో ఆశ వర్కర్లు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు చేస్తున్నా ప్రబుత్వం నుంచితమకు గుర్తింపు లేకపోవడం సరికాదన్నారు. సమాజంలో పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు పెంచాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద భీమా, ...

Read More »

గణనాథునికి విశేష పూలతో అలంకరణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్‌లోగల రామసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషునికి మంగళవారం పుష్పాలంకరణ చేశారు. 25 అడుగుల ఎత్తుగల భారీ గణనాథునికి వివిధ రకాల పూలతో అలంకరించారు. విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రామసేన అధ్యక్షుడు శ్రీకాంత్‌, భక్తులు పాల్గొన్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో కుంకుమ పూజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం వినాయక ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద మంగలవారం మహిళలుభక్తి శ్రద్దలతో కుంకు మ పూజలో పాల్గొన్నారు. గణేష్‌ మండపం వద్ద సామూహిక కుంకుమపూజలో అధిక సంఖ్యలో బక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు రాజమణి, పట్టణ యువజన సంఘం నాయకులు లక్ష్మణ్‌, ప్రసాద్‌, నవీన్‌, ప్రతినిధులు రాజేశ్వర్‌, రాజయ్య, కిషన్‌, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

యువజన సమాఖ్య గణేష్‌ వద్ద అన్నదానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్ద మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి యేటా స్టేషన్‌లో యువజన సమాఖ్య ఆద్వర్యంలో భారీ గణనాయకుని ఏర్పాటు చేస్తారు. అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అన్నదానం చేసినట్టు సమాఖ్య అధ్యక్షుడు రవిందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టణంలోని షేర్‌ గల్లీలోగల యువసేన షేర్‌ ఫెడరేషన్‌ గణేష్‌ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండపాల ...

Read More »

భారతదేశానికి వేల సంవత్సరాల అపూర్వ చరిత్ర ఉంది

  – ప్రొపెసర్‌ నారాయణరావు డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ చరిత్ర మహోన్నతమైంది. మనది వేల ఏళ్ళ చరిత్ర. మన చారిత్రక వారసత్వ సంపద ఎన్నటికీ చెరగనిది అని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌ సభ్యులు ప్రొఫెసర్‌ నారాయణరావు అన్నారు. మంగళవారం భారతీయ చరిత్ర, సంస్కృతి అనే అంశంపై తెలంగాణ యూనివర్సిటీ కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌లో ప్రధాన ప్రసంగం చేశారు. మన దేశ చరిత్రను బ్రిటిషర్లు వక్రీకరించారని, మన చరిత్రను మనం సరైన ...

Read More »

తెవివిలో విజయవంతంగా క్రాస్‌ కంట్రీ పరుగు పోటీలు

  డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 4 కి.మీ. క్రాస్‌ కంట్రీ పరుగు పోటీలు విజయవంతంగా ముగిశాయి. వర్సిటీ చరిత్రలో మొదటి సారిగా అంతర్‌ కళాశాలల క్రాస్‌ కంట్రీ పోటీలను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మమతలు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లోఉత్సాహంగా పాల్గొన్నారు. వర్సిటీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నుంచి బయట ఎంట్రెన్సు గేట్ల ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధుల రూ. 2 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

Read More »

మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లిమ్రా మిలాప్‌ పీస్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వినియోగించుకోకుండా ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సొసైటీ ప్రతినిధులు ...

Read More »

మానసిక వ్యాధితో యువకుని ఆత్మహత్య

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీకి చెందిన దత్తాత్రి అనే యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతూ సోమవారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దత్తాత్రి 10వ తరగతి వరకు చదివి ఫెయిల్‌అయ్యాడు. ఇంకా వివాహం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా మానసిక వ్యాదితో బాధపడుతున్న దత్తాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Read More »

అంబరాన్నంటిన సాందీపని వినాయక నిమజ్జన సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన వినాయకుని సోమవారం నిమజ్జనంచేశారు. ఈసందర్బంగా విద్యార్తులు నిమజ్జన శోభాయాత్రలో విద్యార్థిని, విద్యార్తులు దాండియా నృత్యాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. గణపతి బొప్పా మోరియా అంటూ కేరింతలు కొడుతూ నిమజ్జనానికి తరలారు. కళాశాలలో లడ్డూవేలంపాట నిర్వహించగా బిఎస్సీ విద్యార్తులు రూ. 6200 లడ్డూ తీసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సిఇవోహరిస్మరణ్‌రెడ్డి, డైరెక్టర్‌ బాలాజీరావు, ప్రిన్సిపాళ్ళు ప్రవీణ్‌కుమార్‌, సాయిబాబా, అధ్యాపకులు రాజు, మనోజ్‌, బాలనర్సు, సంపత్‌కుమార్‌, శ్యాం, ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 30వ వార్డు వివేకానంద కాలనీలో మురికికాల్వల నిర్మాణం పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13వ ఆర్థికసంఘం నిధులు రూ. 5 లక్షలతో మురికికాల్వల నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన మురికికాలువలు చెడిపోవడంతో అదే స్థానంలో నూతనంగా కాలువలు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ విజయ, కౌన్సిలర్లు అరికెల ప్రభాకర్‌యాదవ్‌, ఆనంద్‌, రవి, ...

Read More »