Breaking News

Daily Archives: November 1, 2015

ఉచితంగా ఐడియా సిమ్‌కార్డులు

  700 కార్డులు అందజేసి రికార్డు సృష్టించిన వెంకటసాయి కమ్యూనికేషన్స్‌ మెదక్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలోని వెంకటసాయి కమ్యూనికేషన్స్‌ దుకాణం ఆదివారం రికార్డు సృస్టించింది. వివరాల్లోకి వెళితే ఐడియా కంపెనీవారు దీపావళి పండగను పురస్కరించుకొని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చారు. ఐడియా టు ఐడియా 10 పైసలు అలాగే మిగతా నెట్‌వర్క్‌లకు 30 పైసలు నిమిషానికి ఇలా 90 రోజుల వరకు ఆఫర్‌ఇస్తు సిమ్‌కార్డు ఉచితంగా అందజేయడంతో వినియోగదారులు బారులుతీరి సిమ్‌కార్డులు పొందారు. ...

Read More »

ఘనంగా ఎంపి బిబి పాటిల్‌ జన్మదిన వేడుకలు

  గాంధారి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం జహీరాబాద్‌ ఎంపి బిబి పాటిల్‌ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి తానాజీరావు విద్యార్థులతో కలిసి భారీ కేక్‌కట్‌ చేశారు. ఎంపికి విద్యార్థినిలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినిలకు జడ్పిటిసి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానాజీరావు మాట్లాడుతూ ఎంపి పాటిల్‌ రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటూ, మరిన్ని ఉన్నత ...

Read More »

యంచలో స్వర్ణలక్ష్మిదేవి యాగం

  నవీపేట, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలంలోని యంచ గ్రామంలో స్వర్ణలక్ష్మిదేవి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాగానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య యాగంలో ఆహుతులు సమర్పించారు. దీంతో యంచలో పండగ వాతావరణం నెలకొంది. లోక కళ్యాణం కోసం, రాబోయే కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.

Read More »

ఘనంగా బోనాల పండగ

  రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఘనంగా బోనాలు పండగ నిర్వహించారు. గ్రామస్తులు అందరు కలిసి ఐకమత్యంగా మట్టితోచేసిన కుండలను అందంగా అలంకరించి భక్తిశ్రద్దలతో అమ్మవారికి సమర్పించారు. నెత్తిపై బోనాలు ఎత్తుకొని గ్రామదేవతలకు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Read More »

తాడ్‌బిలోలిలో ఒకరికి డెంగ్యూ

  రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన సమీర్‌ అనే యువకుడికి డెంగ్యూ వ్యాధి సోకడంతో నిజామాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్తితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో నాందేడ్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. కాగా నిజామాబాద్‌ వైద్యులు డెంగ్యూ ఉందని నిర్దారించారు. గ్రామంలో ఒకపక్క మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద ఎక్కువైనా కూడా సర్పంచ్‌ పట్టించుకోకపోవడంతో, ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంతో డెంగ్యూ వంటి వ్యాధులు ...

Read More »

నీలాలో నీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు

  రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గ్రామ సమస్యలను సర్పంచ్‌ దృష్టికి తీసుకొచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో నిజామాబాద్‌ – ధర్మాబాద్‌ రహదారిపై ఆదివారం రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు బైఠాయించడంతో ట్రాపిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రవికుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు తాగునీటిసమస్యపై సర్పంచ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో గ్రామస్తులు నసీర్‌, భూమన్న, సంతోష్‌, గంగాధర్‌తో పాటు ...

Read More »

మున్నూరుకాపు సంఘంవారి ప్రత్యేక బోనాలు

  నిజామాబాద్‌ కల్చరల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణంగా ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలిసిందే. కానీ నిజామాబాద్‌ నగరంలోని మున్నూరు కాపు సంఘం శివాజీనగర్‌ తర్ప, అశోక్‌వీధి తర్పలకు చెందిన సభ్యులు ప్రతియేడు అశ్వయుజ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఆదివారం స్థానిక పోతలింగయ్య గుడి వద్ద బోనాలు సమర్పించారు. అంతకుముందు అందంగా అలంకరించిన బోనాలను ముత్తైదువలు పట్టుచీరలు ధరించి చక్కగా నెత్తినెత్తుకొని శక్తిశ్రద్దలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో ...

Read More »

5వ టౌన్‌ ఎస్‌ఐ సైదయ్యతో నిజామాబాద్‌ న్యూస్‌ ముఖాముఖి

  – అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా సహజీవనం సాగించాలి – నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు నిజామాబాద్‌ సెంట్రల్‌ డెస్క్‌ నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రత్యేక అనుబంధంగా నిజామాబాద్‌ న్యూస్‌ నగరంలోని 5వ టౌన్‌ ఎస్‌ఐ సైదయ్యతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ చెప్పిన అంశాలు సంక్షిప్తంగా మీ కోసం…. నిజామాబాద్‌ న్యూస్‌ : 5వ టౌన్‌ పరిధిలో నేరాలను నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్‌ఐ : స్టేషన్‌ పరిధిలో సబ్‌ కంట్రోల్‌ ...

Read More »

వారిపై జోకులను బ్యాన్ చేయండి..!

నవ్వడం ఒక భోగం… నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు. అయితే ఆ నవ్వుల పువ్వులు విరిసేందుకు హాస్యాన్ని పండించేవారూ, ఆస్వాదించేవారూ కూడ అవసరమే. స్పాంటేనియస్ గా పుట్టే హాస్యం… ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కానీ హాస్యానికి వస్తువు ఏమిటి అనేది ఎంచుకోవడం మాత్రం ఒక్కోసారి కష్టంగానే మారుతుంది. ముఖ్యంగా నలుగురు కలిసినప్పుడు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంలో భాగంగా ఏదో ఒక జోక్ చెప్పుకుని నవ్వుకుంటుంటారు. అందులో ఒక్కటైనా సర్దార్జీలపై ఉంటుండటం షరా మామూలుగా కనిపిస్తుంది. అయితే ఆ ...

Read More »