Breaking News

Daily Archives: November 2, 2015

టెక్నోజియాన్‌ 15 లో కామారెడ్డి విద్యార్థికి ప్రథమ బహుమతి

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఐటి వరంగల్‌ ప్రతిస్టాత్మకంగా మూడురోజులు టెక్నోజియాన్‌ – 15 నిర్వహించి పలితాలు ప్రకటించారు. కోవర్‌ మామియా (నేలపై, నీటిలో నడిచే వాహనం) తయారుచేసి ప్రదర్శించినందుకుగాను కామారెడ్డికి చెందిన సిహెచ్‌.సామ్రాట్‌ కౌటిల్య టీంకు ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కౌటిల్య సారద్యంలో అతని బృందం అసద్‌, పృథ్వీ, వినీత్‌, శ్రీహితలకు ప్రథమ బహుమతిగా రూ.8 వేలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఎన్‌ఐటి వరంగల్‌వారు బహుకరించారు. పంచాయతీరాజ్‌, ఐటిశాఖ మంత్రి ...

Read More »

పేదలందరికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ళు ఇవ్వాలి

  – సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలందరికి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండివెంకట్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన డివిజన్‌ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని పక్కదారి పట్టించేందుకు స్తానిక ప్రజాప్రతినిధులు కుట్ర చేసే ప్రమాదముందని, సిపిఎం ఆధ్వర్యంలో సొంతిల్లులేని నిజమైన పేదలకు పార్టీలకు ...

Read More »

ప్రభుత్వ అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ అనుమతిలేకుండా నడుస్తున్న కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం టిజివిపి నాయకులు కామారెడ్డి ఉపవిద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో కామారెడ్డి ప్రాంతంలో అనేక పేర్లతో పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయన్నారు. వాటిల్లో కనీస సదుపాయాలు లేవని, ఫీజులు దండుకుంటున్నారని చెప్పారు. అధిక ఫీజులను అరికట్టి సదుపాయాలు కల్పించేలా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో టిజివిపి ...

Read More »

విజ్ఞానంతో మూఢనమ్మకాలను నివారించవచ్చు

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజ్ఞానం వల్ల సమాజంలో మూఢనమ్మకాలను నివారించవచ్చని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర రిసోర్సు పర్సన్‌ మనోహర్‌రావు అన్నారు. దేవునిపల్లిలోని శ్రీసాయిసుధ విద్యాలయంలో విద్యార్థులకు ఇంద్రజాలం ప్రదర్శించి మూఢనమ్మకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రజాలం అంటే ఇతరుల జ్ఞానేంద్రియాలతో ఆడుకోవడమని చెప్పారు. దేశం అభివృద్ది చెందినప్పటికి మూఢనమ్మకాలను ప్రజలు అనుసరిస్తున్నారన్నారు. నవసమాజ నిర్మాణం కావాలంటే అందరు విజ్ఞానవంతులు కావాలని సూచించారు. అనంతరం పలు ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులచే కొన్ని ప్రదర్శనలు ...

Read More »

ఎంవిఐతో వినియోగదారుల ఆందోళన

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌తో సోమవారం వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం ఉదయాన్నే వినియోగదారులు వెళ్ళి దాడికి దిగారు. కార్యాలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఎంవిఐతోవాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా లావాదేవీలు జరగడం లేదని, మధ్యాహ్నం 2 గంటలకు కార్యాలయాన్ని మూసివేసి వెళ్లిపోతే తమ నిరీక్షణకు ఫలితం ఏంటని నిలదీశారు. శనివారం నుంచి విద్యుత్‌ ...

Read More »

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం

  కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 62 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయమని, సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని ఆశ వర్కర్లు హెచ్చరించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ఆశల సమ్మె సోమవారం నాటికి 62 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచాక మాట దాటవేయడం సమంజసం కాదన్నారు. తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయనుకుంటే మరింత దుర్బరంగా ...

Read More »

నేడు జిపిల ఆడిట్‌

  ఆర్మూర్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గ్రామ పంచాయతీల్లో జమ ఖర్చుల వివరాలను సోమవారం ఆడిట్‌ జరుగిందని ఎంపిడివో లింగయ్య తెలిపారు. ఈ ఆడిట్‌ను ఆడిటర్‌ చంద్రలేఖ నిర్వహించారు. గ్రామాల కార్యదర్శులు సంబంధిత రికార్డులకు కార్యాలయానికి తీసుకొచ్చి వివరాలు సమర్పించారు.

Read More »

నేడు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం

  ఆర్మూర్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి, దేగాం, గ్రామాల్లో స్వచ్చభారత్‌లో బాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆ గ్రామ సర్పంచ్‌లు రవిగౌడ్‌, బ్యాంకు గణేష్‌లు తెలిపారు. ఉదయం 11 గంటలకు రెండు గ్రామాల్లో గుర్తించిన లబ్దిదారులకు మరుగుదొడ్ల నిర్మాణం అవుతాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి హాజరవుతున్నారని ఆయన తెలిపారు.

Read More »

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

  ఆర్మూర్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో సోమవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంఇవో రాజగంగారాం తెలిపారు. మండలంలోని కంటి సమస్యలున్న విద్యార్థులను ఉపాధ్యాయులు, ఐఇఆర్‌టిలు సుధ, కిషన్‌ గుర్తించి వైద్య శిబిరానికి పంపించాలని పేర్కొన్నారు. హెల్త్‌ సెంటరులో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా కళ్లజోల్లు అందించడం, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు.

Read More »

స్వీయ క్రమశిక్షణ ముఖ్యం

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ను సోమవారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సందర్శించారు. వివిధ విభాగాలలో తరగతులు జరుగుతున్న గదులకు వెళ్ళి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి తరగతి గదిని, స్టాఫ్‌ రూంలను, నాన్‌టీచింగ్‌, టీచింగ్‌ సిబ్బంది హాజరు పట్టికలను పరీక్షించారు. తర్వాత అధ్యాపకులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సిబ్బంది అందరూ స్వీయ క్రమశిక్షణతో ...

Read More »

పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌ రూరల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన పరిశ్రమల వివరాలు సేకరించి తిరిగి ప్రారంభించడానికి అవకాశం ఉన్న వాటికి ఆర్థిక సహాయం అందించి ఉపాది కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అధికారులకు సూచించారు. సోమవారం టిఎస్‌- ఐపాస్‌ పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ చాంబరులో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పలు ఇబ్బందుల వల్ల పనిచేయని పరిశ్రమలను కారణాలు తెలసుకొని తిరిగి ...

Read More »

వందమంది అనాథపిల్లలకు ఆశ్రయం కల్పిస్తాం

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా డిచ్‌పల్లి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వందమంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. సోమవారం మండలంలోని తహసీల్‌ కార్యాలయం వెనక ఉన్న పోలీసు క్వాటర్‌లను మరమ్మతుల పనులను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్‌ అదికారులతో మాట్లాడారు. గతంలో బాల కార్మికుల పాఠశాల కొనసాగిందని, ప్రస్తుతం అనాథ పిల్లల కొరకు మరమ్మతులు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అనాథ పిల్లల కోసం విద్య, వైద్యం, భోజనం తదితర సదుపాయాలు ...

Read More »

బయోమెట్రిక్‌తో ఉద్యోగుల సమయపాలన సులభతరం

  నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగులు హాజరుకు బయోమెట్రిక్‌ విధానం ద్వారా కార్యాలయాలకు పనులకై వచ్చే ప్రజలకు ఉద్యోగులు సేవలు అందించడానికి అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉద్యోగుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్‌ విదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విధానం ద్వారా ఉద్యోగులు ఏ సమయంలో కార్యాలయానికి హాజరైంది తెలుస్తుందని, అందువల్ల నిర్ణీత కార్యాలయ సమయానికి ఉద్యోగులందరు హాజరు కావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. తాద్వారా ...

Read More »

ఆలోచించాల్సిన విషయమే

……………….. నిజమే! మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని ప్రోత్సహిస్తున్నది. గోమాంసం తిన్న వాడిని రాళ్లతో కొట్టటం దుర్మార్గం అన్నారు. సురేంద్ర కులకర్ణి ముఖాన నల్లసిరా పోయటం తప్పు- ఇది భారత ప్రజాస్వామ్యం ముఖాన పూసిన నల్లరంగు అన్నారు- ఈ విషయాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. భావప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి?? ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రకటించడం. సృష్టికి మూలం కార్యాకారణ సంబంధం అన్నాడు. ఆదిశంకరుడు మాయావాదం ప్రతిపాదించాడు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదిస్తే దానికి స్టీఫెన్ హాకిన్స్ సవరణలు చేశాడు. ఇదంతా భావ ప్రకటనాస్వేచ్ఛ ...

Read More »