Breaking News

Daily Archives: November 3, 2015

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

  రెంజల్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ప్రత్యేక అధికారి వాజిద్‌ హుస్సేన్‌ ఆకస్మికంగా తనికీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పు పథకంలో భాగంగా కలెక్టర్‌ ఆదేశానుసారం తనిఖీ చేపట్టినట్టు ఆయన అన్నారు. రోగులకు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకుఅందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి నస్రీన్‌ ఫాతిమా, ఆయన వెంట ఎంపిడివో చంద్రశేకర్‌, ఆరోగ్య సిబ్బంది తదితరులున్నారు.

Read More »

విద్యార్థుల జీవితానికి పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివిలో సెంట్రల్‌ టైబ్రరీ మరియు డిపార్ట్‌మెంటల్‌ లైబ్రరీకి ప్రొఫెసర్‌ జె.మల్లయ్య, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌వారు దాదాపు 300 కాపీలు బహుమతిగా ఇచ్చారు. తెవివిలో జరిగిన ఓ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి పుస్తకాలను స్వీకరించారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ పుస్తకాలు విద్యార్థుల జీవితంలో చాలా విలువైందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాలను ఎంఎ ఇంగ్లీష్‌ విద్యార్తులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జె.మల్లయ్యకు ...

Read More »

కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలని మునిసిపల్‌ పాలకవర్గ ప్రతినిదులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలని కౌన్సిల్‌ తీర్మానం చేసినప్పటికి మూడునెలలకోసారి సమావేశం నిర్వహించడం వల్ల పట్టణంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభించడం లేదన్నారు. మంచినీటి సమస్య, పారిశుద్యం, అభివృద్ది పనుల్లో నాణ్యత లోపం తదితర ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయన్నారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌, అధికారులు కమీషన్లు పంచుకుంటూ పట్టణ ...

Read More »

9న ఛలో నిజామాబాద్‌ పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌టి ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న ఛలో నిజామాబాద్‌ బహిరంగ సభకు సంబందించిన గోడప్రతులను నాయకులు కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంఆర్‌పిఎస్‌టి రాష్ట్ర కార్యదర్శి బలరాం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మణ్‌ మాట్లాడుతూ డప్పుకొట్టే ప్రతి మాదిగకు, చెప్పులు కుట్టే చర్మకారులకు 2 వేల పింఛన్లు సాధించుకోవడమే లక్ష్యంగా ఉద్యమిస్తున్నామన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రిని కలిసి సమస్యలు విన్నవించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పేరిట ఇతర సామాజిక ...

Read More »

మంజీరా కళాశాలలో స్వాగత హంగామా

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని మంజీర డిగ్రీ కళాశాలలో సైన్స్‌ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. విద్యార్తినిలు గోపికమ్మ చాలునులేమ్మా… నేనొక్కడినే అంటూ స్టెప్పులు వేసి అలరించారు. విద్యార్థులు పలు గేయాలపై నృత్యాలు చేసి, నాటకాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మంజీరా విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ వారికి వారే పోటీపడుతున్నారని ప్రశంసించారు. తమ విద్యార్తులు ఎన్నో విజయాలు, ఉద్యోగాలను సాధించారని ...

Read More »

ఆశల ఆర్డీవో కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం

  – 400 మహిళా కార్యకర్తల అరెస్టు కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆశల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు 400లకుపైగా మహిళా కార్యకర్తలను, ఆశలను సిఐటియు నాయకులను అరెస్టు చేసి అనంతరం సొంతపూచికత్తుపై విడుద లచేశారు. సిఎస్‌ఐ మైదానం నుంచి భారీ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ...

Read More »

ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచే ప్రయత్నం చేస్తున్నాం

  కేంద్ర గ్రామీణాభివృద్ది సంయుక్త కార్యదర్శి అపరంజిత సారంగి కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనిదినాలను వంద నుంచి 150 రోజులకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృస్టికి తేనున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది సంయుక్త కార్యదర్శి అపరంజిత సారంగి తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలోని తాడ్వాయి, కామారెడ్డి, మాచారెడ్డి మండలంలో సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలోని కేంద్ర బృందం మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరు తెన్నులను పరిశీలించారు. చేపట్టిన పనులను తనిఖీచేసి, ఉపాధి ...

Read More »

ఆడియో ఫంక్షన్లో బూతు మాటలు మాట్లాడిన అలీకి బహిరంగ లేఖ.! సరైన సూచన కూడా ఉంది!!

(3 Nov) ప్రియమైన అలీ గారికి. నమస్కరించి రాయునది. నా పేరు చంటి ఎందుకో సినిమాలంటే నాకు ఎక్కడా లేని పిచ్చి. బ్లాక్ అండ్ వైట్, కలర్, HD,ఆఖరికి 3D అంటూ అన్నీ సినిమాలను చూసుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ వస్తున్న సినిమా పిచ్చోడిని.గతంలో లేకుండే ఈ టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్కులు , ఆకరికి ఆడియో ఫంక్షన్లు. సరే జనాన్ని ఆకట్టుకోడానికో, ఓపెనింగ్స్ పెంచుకోడానికో,ఈ మద్య దర్శక నిర్మాతలందరూ ప్రతి దాన్ని ఓ వేడుకగా చేస్తున్నారు. సరే మంచిది కానీ నాదొక చిన్న విన్నపం.. ...

Read More »

ప్రముఖ హాస్యనటుడు కొండవలస కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండవలస పంజగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలో చికిశ్చ పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. కొండవలస వయస్సు 69 ఏళ్లు. ‘అయితే ఓకే’.. అంటూ తన విలక్షణమైన స్వరంతో హాస్యాన్ని పండించిన కొండవలస 2002లో వచ్చిన ‘ఔను వాళ్లు ఇష్టపడ్డారు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. దాదాపు 300 సినిమాల్లో కొండవలస నటించారు. శ్రీకాకుళంలో 1946 లో జన్మించిన కొండవలసకు నాటకరంగంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన దాదాపు 1000 ...

Read More »