Breaking News

Daily Archives: November 7, 2015

గల్ఫ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించండి

– కేంద్రానికి కేటీఆర్‌ వినతి – ఉత్తమ రాష్ట్ర అవార్డు అందుకున్న మంత్రి ఢిల్లీ నవంబర్‌6 గల్ఫ్‌ బాధితులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగశాఖాధికారులను కోరినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ నేడు కలిశారు. ఈ భేటీలో ఎంపీ వినోద్‌, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్‌లు పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. గల్ఫ్‌ బాధితుల కష్టాలను కేంద్ర విదేశాంగశాఖ దృష్టికి తీసుకువెళ్లాం. గల్ఫ్‌లో తెలంగాణవాసులు ఇబ్బంది పడుతున్నరు. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాం. ...

Read More »

కుర్నాపల్లిలో ఎంపి కవిత పల్లె నిద్ర

  ఎడపల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో శనివారం ఎంపి కవిత పల్లెనిద్ర చేశారు. మన ఊరు – మన ఎంపి కార్యక్రమంలో భాగంగా జైతాపూర్‌ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం కుర్నాపల్లి గ్రామానికి పల్లెనిద్ర కోసం బయల్దేరివెళ్లారు. అక్కడి ప్రజలు , తెరాస నాయకులు ఎంపికి ఘన స్వాగతం పలికారు. ముందుగా నూతనంగా ప్రతిష్టించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎంపి ఆవిష్కరించగా, నాలుగు లక్షల ఎంపి నిదులతో నిర్మించనున్న గౌడకులస్తుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి ...

Read More »

రెండేళ్లలో ఇంటింటికి శుద్దిచేసిన తాగునీరు

  – ఎంపి కవిత ఎడపల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు సంవత్సరాల్లో వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ఇంటింటికి శుద్ది చేసిన తాగునీరు అందిస్తామని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలంలోని జైతాపూర్‌, కుర్నాపల్లి గ్రామాల్లో పర్యటించారు. మన ఊరు – మన ఎంపి కార్యక్రమంలో భాగంగా ముందుగా జైతాపూర్‌ గ్రామాన్ని సందర్శించి వీధుల్లో పర్యటించి స్తానిక సమస్యలు ప్రత్యక్షంగా చూసి, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలతో ముఖాముఖి ...

Read More »

కెమిస్ట్రి ప్రయోగశాలల ప్రారంభం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఒకేరోజు రెండు క్యాంపస్‌లలో మొత్తం నాలుగు రసాయనశాస్త్ర ప్రయోగశాలలు ప్రారంభించారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ సి.పార్ధసారథి, ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లారెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి చేతుల మీదుగా ల్యాబులు ప్రారంభించారు. మొదట బిక్కనూరులోని సౌత్‌ క్యాంపస్‌లో రెండు ల్యాబులు, తర్వాత డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌లో మరో రెండు ల్యాబులు సైన్స్‌డీన్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు, ఇతర సైన్స్‌ ఫ్యాకల్టీ సభ్యుల ...

Read More »

పాఠశాలపై నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌వోకు వినతి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పలు పాఠశాలల్లో రాత్రివేళ దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై నిఘా ఉంచి తగు చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎస్‌హెచ్‌వోకు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సందీప్‌ కుమార్‌, పట్టణ ఇన్‌చార్జి ఆజాంలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, సామగ్రి చోరీ అవుతున్నాయని చెప్పారు. వీటితోపాటు పాఠశాల ఆవరణలో మద్యం సేవించడం, పేకాటలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని దృస్టికి తెచ్చారు. ...

Read More »

ఘనంగా ధన్వంతరి జయంతి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శనివారం తెలంగాణ పిఎంపి అసోసియేషణ్‌ ఆద్వర్యంలో వైద్య మూలపురుషుడు ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజలు అనేక రోగాల బారిన పడగా దాన్ని చూసి ధన్వంతరి భగవానుడు ప్రత్యేక ఆయుర్వేద మందులను కనుగొని ప్రజలను రోగాల నుంచి విముక్తులను చేశారన్నారు. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని పరిచయం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పిఎంపి డివిజన్‌ ...

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 20వ వార్డులో శనివారం మురికి కాలువల నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో కాలు వనిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు అంజద్‌, భూంరెడ్డి, సంగి మోహన్‌, ఏఇ గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు సంజీవ్‌, రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సారిక కుటుంబానికి న్యాయం చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అత్తగారి కుటుంబం చేతిలో దారుణ హత్యకు గురైందని, వారి కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శనాచారి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి వెళ్ళి సారిక తల్లిదండ్రులు శ్రీనివాసచారి, లలితలను పరామర్శించి వారిబాధలు తెలుసుకున్నట్టు చెప్పారు. వరంగల్లులో మాజీ ...

Read More »

స్త్రీ శక్తి దివస్‌ సందర్బంగా ఆటల పోటీలు

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ శక్తి దివస్‌ను పురస్కరించుకొని శనివారం డిగ్రీ కళాశాల విద్యార్తినిలకు ఏబివిపి ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు. గత రెండ్రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు శనివారంతో ముగిసినట్టు ఏబివిపి మహిళా కో కన్వీనర్‌ రాంపురం రమ్య తెలిపారు. ముగింపు ఆటకు ముఖ్య అతిథిగా ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.ఎన్‌.గిరి హాజరయ్యారు. విద్యార్థినిలకు ఝాన్సీలక్ష్మిబాయి గురించి వివరించి, ప్రతి స్త్రీ ధైర్యసాహసాలు కలిగి ఉండాలన్నారు. అమ్మాయి చదువు అవనికి వెలుగు అన్నట్టుగా మహిళలు అన్ని ...

Read More »