Breaking News

Daily Archives: November 14, 2015

ఎముకల ఫ్యాక్టరీని తొలగించాలి

  నవీపేట, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎముకల నుంచి నూనె తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జంతు కళేబరాలతో కల్తీకల్లు తయారుచేసి ఆయా హోటళ్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, దాని ద్వారా తయారుచేసిన పదార్థాలు తింటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నవీపేట మండలం తుంగిని గ్రామ శివారులో రాత్రి 10 దాటిన తర్వాత పెద్ద ఎత్తున జంతు కళేబరాలు, ఎముకలు తరలించి నూనె తయారుచేస్తున్న విషయం ఇటీవలే బయటపడింది. ఈ విషయమై స్పందించిన ...

Read More »

యువతి అదృశ్యం

  ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామానికి చెందిన కచ్చకాయల రాజేందర్‌ కూతురు రమ్య (19) శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిందని ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోస్‌కుమార్‌ శనివారం తెలిపారు. తండ్రి రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి కథనం ప్రకారం శుక్రవారం ఉదయం తన మేనత్త వద్దకు వెళుతున్నానని చెప్పిందని, మేనత్త వద్ద విచారించగా రమ్య అక్కడికి వెళ్లలేదని తెలిసిందని, ఇతర బంధువులను విచారించినా ...

Read More »

ఘనంగా బాలల దినోత్సవం

  ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని అన్ని పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్తులు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి. పిల్లలు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. పట్టణంలోని విజయ్‌ పబ్లిక్‌ స్కూల్‌, రాంమందిర్‌ పాఠశాలలో విద్యార్థులు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసంగాలు చేశారు.

Read More »

కార్తీక మాస శుభారంభ శుభాకాంక్షలు

సూర్యోదయoలోగా స్నానాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు.. ఈ నెలంతా ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం కానున్నాయి.ఈరోజు నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానుండగా, అంతటా ఆధ్మాతిక శోభ అలుము కోనున్నది. కాలాన్ని బట్టి మనుషుల్లో వచ్చే కొన్ని రుగ్మతలను పారదోలేందుకు పలు ఆచారాలను పూర్వీకులు ప్రవేశపెట్టారని ప్రముఖ పండితులు సెలవిస్తున్నందున ఆధ్యాత్మికం వెనుక ఆరోగ్యానికి కార్తీక మాసం ప్రతీకలా నిలుస్తున్నది. దీపావళి తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ♦స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి ▬ ...

Read More »

మంచి నేల.. మంచి నీరు..!

భూమికి నీరు వ ర్షం ద్వారా అందుతుంది. అయితే, పడిన వానలో కొంత మాత్రమే మొక్కలకు ఉపయోగపడి మిగిలింది రకరకాలుగా పోతుంది. భూమి మీద పడిన మొత్తం వర్షాన్ని ‘అసలు వర్షపాతం’ అంటాం. ఉపరితల ప్రవాహం ద్వారా, ఆవిరి కావటం ద్వారా నష్టపోయింది పోగా, భూమిలో నిల్వ ఉండి మొక్కలకు అందుబాటులో ఉండే వర్షపు నీటిని ‘ఉపయోగపడే వర్షపు నీరు’ అంటాం. ఇదే మొక్కలకు, జంతువులకు, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వర్షపు నీటి ఉపయోగాన్ని వాన పడే తీరు, నేల రకం, నేలను మొక్కలు ఎంత ...

Read More »