Breaking News

Daily Archives: November 15, 2015

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము. 1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి. 2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు ...

Read More »

భ్రూణ హత్యలు నివారించండి

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భ్రూణ హత్యలు నివారించండి, ఆడపిల్లలను గర్భంలోనే తుంచి వేసే దురాచారానికి స్వస్తి పలకాలని చిన్నారులు నిర్వహించిన ప్లాష్‌ మాబ్‌ పలువురిని ఆకట్టుకుంది. శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. అందరిలాగా కాకుండా వినూత్నంగా ఆలోచించి సమాజంలో జరుగుతున్న భ్రూణహత్యలపై తమ గొంతు వినిపించారు. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ నినాదంతో సుప్రియా డ్యాన్సు అకాడమీ కామారెడ్డి వారు బాలల దినోత్సవం రోజు కామారెడ్డి రైల్వేస్టేషన్‌ ఆవరణలో ‘మ్లాఫ్‌ మాబ్‌’ డ్యాన్స్‌ ...

Read More »

భిక్కనూరు ఎస్‌ఐ తన వైఖరి మార్చుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు ఎస్‌ఐ రాంబాబు తన వైఖరి మార్చుకోవాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ అన్నారు. ఎస్‌ఐ రాంబాబు ప్రజా సమస్యలపై, కార్మిక సమస్యలపై ఆందోలన చేస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలు కక్ష పూరితంగానే చేస్తున్నారని ఆరోపించారు. చీకటి దందాలు, సెటిల్‌మెంట్లు, సివిల్‌ తగాదాల్లో ఎస్‌ఐ జోక్యంపై తనవైఖరి మార్చుకోకుంటే తాడ్వాయిలో జరిగిన మాదిరిగా ప్రజలే బుద్దిచెపుతారని అన్నారు. ఎస్‌ఐపై ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతలపై ...

Read More »

తహసీల్దార్‌ నిర్వాకం వల్ల 1422 ఓట్ల గల్లంతు

  – సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పరిధిలోని 24వ వార్డులో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 3122 ఓట్లు ఉండగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తహసీల్దార్‌ నిర్వాకం వల్ల 1422 ఓట్లు తొలగించారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తుగా మారి కనీస విచారణ లేకుండా ఎలక్షన్‌ కమీషన్‌ను తప్పుదోవ పట్టిస్తూ ఒక్క 24వ వార్డులోనే 1422 ఓట్లు ...

Read More »

ఆర్చరీ జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని సాందీపని జూనియర్‌ కళాశాలకు చెందిన సి.హెచ్‌.ఉదయ చంద్ర అండర్‌- 19 విభాగంలో రెండోస్థానంలో సిల్వర్‌ మెడల్‌ సాధించి ఆర్చరీ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. కరీంనగర్‌లో స్కూల్‌జోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆద్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఉదయచంద్ర సిల్వర్‌ మెడల్‌ సాధించి జార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థిని ప్రిన్సిపాల్‌ బాలాజీరావు, సిబ్బంది సన్మానించారు. మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు.

Read More »

ఆశ వర్కర్ల దర్నా, మానవహారం

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జాతీయ రహదారిపై నిజాంసాగర్‌ చౌరస్తాలో ఆదివారం ఆశ వర్కర్లు ధర్నా, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 74 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. మంత్రి హరీష్‌రావు సమ్మె విరమించి చర్చకు రావాలనడం హాస్యాస్పదమన్నారు. 104, 108 సిబ్బంది, విఆర్‌ఏలు సమ్మె విరమిస్తే ప్రభుత్వం వారితో కనీసం చర్చలు కూడా జరపలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ...

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉపాధ్యాయుని మృతి

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని వీక్లిమార్కెట్‌ ప్రాంతంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కామారెడ్డి పట్టణానికి చెందిన రాజేంద్రకుమార్‌ (35) లింగంపేట మండలం భవానిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి వీక్లిమార్కెట్‌ గుండా వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్టు చెప్పారు. కేసు నమోదు ...

Read More »

మంజీరను కొల్లగొడుతున్న ఇసుకాసురులు

  బాన్సువాడ, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. బోధన్‌ డివిజన్‌లో మంజీర పరివాహక ప్రాంత గ్రామాలకు చెందిన కొందరు ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ కాసులు దండుకుంటున్నారు. మంజీరతోపాటు పరిసరాల్లోని ఇతర పరివాహక ప్రాంతాలనుంచి ఇసుక తరలిస్తున్నారు. ప్రభుత్వ పరంగా అనుమతులు లేనప్పటికి రాత్రుల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను గమ్యస్తానాలకు చేరుస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇసుకకు డిమాండ్‌ ఏర్పడింది. పట్టణ ...

Read More »

ఆయుర్వేదం పరంగా వెంట్రుకలు రాలకుండా ఉండడానికి మార్గం

  1. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించి కొంచెం సేపయినతరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. 2. మందార పువ్వులను కొబ్బరినూనె లేక నువ్వుల నూనెలో వేసి కాచి ఆనూనెను వెంట్రుకలకు పట్టించి 1 గంట తరువాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. 3.మందార ఆకులను మెత్తగా నూరి తలకు బాగా పట్టించి కొంచెముసేపు ఆగి తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఊడదు. 4. ఉసిరిక రసం ...

Read More »

ఆయుర్వేదం ప్రకారం జ్ఞాపకశక్తిని పెంచే ఫలము ఏమిటో తెలుసా

తరచుగా దానిమ్మ పళ్లను తీసుకునేవారిలో మతిమరుపు సమస్య తలెత్తదు. చక్కని జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. చర్మ సౌందర్యానికి కావలసిన మాయశ్చరైజర్‌గా దానిమ్మ నూనె ఉపయోగపడుతుంది. వాపులు, నొప్పులు పోగొట్టడానికి దానిమ్మ నూనెను విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ప్రస్తావించిన వాత, పిత్త, కఫ గుణాలను దానిమ్మ నియత్రిస్తుంది. దానిమ్మ వేరు, కాండాలలో రోగ నిరోధకశక్తిని పెంచే గుణాలున్నాయి. దానిమ్మ పువ్వులు దంతాలకు మేలు చేస్తాయి. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాక గుండె జబ్బులను నివారిస్తుంది. డయేరియా సమస్యతో బాధపడేవారు దానిమ్మ రసాన్ని ...

Read More »

వాస్తు ప్రకారం ఇంటి కోసం ఎటువంటి స్థలం కొనాలి?

  సూక్ష్మంగా , విపులంగా గల ఈ వాస్తు సలహాలను చదివి అవగాహన చేసుకోగలరు అని భావిస్తూ స్థలం కొనే వారి కోసం సలహాలు మొట్ట మొదటి సూచనగా మీరు కొనబోయే గృహమునకు ఈశాన్యం త్రెంపు లేకుండా చూసుకోవాలి గృహమునకు ఈశాన్య భాగం లో మెట్లు, దిబ్బలు, భారి భవంతులు, సెల్ ఫోన్ టవర్లు లాంటివి లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం లో తొలగించుకోడానికి వీలైన మెట్లు, దిబ్బలు లాంటివి తొలగించుకొని మాత్రమె గృహమును కొనడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ వీలు లేకపోతే గృహమును కొన్న ...

Read More »

ఒకే గూటి కిందికి గురుకులాలు!

హైదరాబాద్: పలు సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలను ఒకే గూటి కిందకు తీసుకురావడానికి పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. గురుకులాల ఏకీకరణపై పలు స్థాయిల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -పాఠశాల విద్యాశాఖకు పాలనాపగ్గాలు -ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు -8లక్షల మంది విద్యార్థులకు లబ్ధి -కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా చర్యలు -ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సానుకూలం ముఖ్యంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అన్ని గురుకులాలను ఒకే గొడుకు ...

Read More »

కుటుంభ కలహాలతో హత్య

కుటుంభ కలహాలతో భావమరిది అతని భార్యను అతి కిరాతకంగా గడ్డపారతో కొట్టి చంపటంతోపాటు ఇతర కుటుంభ సభ్యులను తీవ్రంగా గాయపర్చిన సంఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామంలో పీట్ల నర్సింలు అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావటం లేదని ఆమెను నరకటానికి ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకుంటున్న ఆమె కుటుంభ సభ్యులపై గడ్డపారతో దాడికి దిగాడు. దాడిలో నిందుతిని బావమరిది సాయిలు, చెల్లెలు రోజాలు అక్కడికి అక్కడే మరణించారు. నిందుతుని భార్య శివమ్మ, మరదలు ఒల్లెపు లళిత, అత్త ...

Read More »

హాట్సాఫ్ సూకీ

పాతిక సంవత్సరాల ఎడతెగని నిరీక్షణ..అసలు మైన్మార్‌లో ప్రజాస్వామ్యం మళ్లీ మొగ్గ తొడుగుతుందా అన్న ఆవేదన. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణతో పాటు మానవ హక్కులకు పట్టం కట్టాలని కంకణం కట్టుకున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌సాన్ సూకీ దేనికీ బెదరలేదు. సైనిక పాలకులు తనను జైల్లో పెట్టినా..మానసికంగా కుంగదీసేందుకు యత్నించినా మొక్కవోని ధీరోదాత్తతతోనే ఏళ్లతరబడి ఉద్యమాన్ని కొనసాగించారు. 1990 దశకం తొలినాళ్లలో జరిగిన ఎన్నికల్లో తన పార్టీ ఘన విజయం సాధించినా..తూచ్ అంటూ ఆ ఫలితాన్ని రద్దు చేసి సూకీని నిర్బంధించిన సైనిక పాలకులను ...

Read More »

నీటి ఎద్దడిని నివారించండి

  ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం వర్షాలు కురియకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి బోర్ల నుంచి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆర్మూర్‌ పట్టణమంతా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు మంచినీరు కోసం కిలోమీటర్లు ప్రయాణించి నీరు తెచ్చే పరిస్తితి దాపురించిందని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం ఇంటింటికి నల్లానీటి పథకం ఆలస్యం కావడంతో పట్టణంలో నీటి సమస్య మరింత పెరిగిపోయింది. మునిసిపల్‌ పాలకవర్గం నీటి ఎద్దడి నివారణకై ...

Read More »

పైకా క్రీడలను విజయవంతం చేయాలి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల స్థాయి పైకా క్రీడలను ఘనంగా నిర్వహించడానికి మండల పిఇడిలందరు కృషి చేయాలని ఎంపిడిఓ గోపాలకృష్ణ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పైకా క్రీడల నిర్వహణ కోసం పిఇడిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ నుంచి ఖిల్లా డిచ్‌పల్లి జడ్పిహెచ్‌ఎస్‌ మైదానంలో మండల పైకా క్రీడలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పైకా క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల ...

Read More »