Breaking News

టూటా ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

 

డిచ్‌పల్లి, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు తెయు కళాశాల సెమినార్‌ హాల్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల మేళవింపు అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం సోదరభావం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. దీపావళి పండగ వెలుగుల పండగ అని మన జీవితాల్లోంచి చీకట్లు పారద్రోలడానికి అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీపావళి వేడుకలు నిర్వహించిన టూటా కార్యవర్గాన్ని అభినందిస్తూ, అధ్యాపకులు త్వరలో నాక్‌ బృందం రానున్నందున సహకరించాలని కోరారు. టూటా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ జాయింట్‌ సెక్రెటరీలు లక్ష్మణచక్రవర్తి, నందిని, ట్రెజరర్‌ డాక్టర్‌ కె.సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article