Breaking News

29న కవిత్వ కళా శిబిరం – కవిసమ్మేళనం

 

కామారెడ్డి, నవంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో ఈనెల 29న కవిత్వ కళా శిబిరం – కవిసమ్మేళనం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. తెలుగు కవిత్వం – వస్తు వైవిధ్యంపై డాక్టర్‌ నాళేశ్వరం శంకరం ప్రసంగిస్తారన్నారు. వచన కవిత – విభిన్న రూపాలపై డాక్టర్‌ నారాయణశర్మ, కవిత్వంలో పద్య, గేయ ఛందస్సుపై డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ ప్రసంగిస్తారని తెలిపారు. కవి సమ్మేళనంలో ఘనపురం దేవేందర్‌, డాక్టర్‌ వి.త్రివేణి పాల్గొంటారన్నారు. పదిజిల్లాలలోని కవులు, కవయిత్రులు శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

Check Also

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు ...

Comment on the article