పాటతో తెలంగాణ బ్రతుకులకు భద్రత

 

– ప్రొఫెసర్‌ తిరుమల్‌ రావు

కామారెడ్డి, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందని తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ బతుకులకు భద్రత కావాలని అది పాట ద్వారా సాధ్యపడుతుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల్‌రావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్‌బిఇడి కళాశాలలో శుక్రవారం సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ రచించిన ‘పాటకు సలాం’ ఆడియో సిడిని తిరుమల్‌రావు ఆవిష్కరించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ సామాజిక గేయాలు ఉన్న పాటకు సలాం సిడి శ్రోతల ద్వారా మంచి ఆదరణ లభిస్తుందని, ప్రజాదరణ పొందుతుందని అన్నారు. గఫూర్‌ శిక్షక్‌ సామాజిక గీతాలు, ప్రజల సమస్యల పట్ల అద్భుతమైన రచనలు చేస్తారని, ఇలాంటి రచనల ద్వారా ముందుకు సాగాలన్నారు. కవులు ప్రజా సమస్యలు వెలుగులోకి తేవాలని చెప్పారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిదులు సి.హెచ్‌.మధు, ఎస్‌.కె.రషీద్‌, శంకర్‌, లచ్చయ్య, సుమిత్రానంద్‌, సూరారం శంకర్‌ తదితరులున్నారు.

Check Also

బియ్యం పంపిణీ ముమ్మరం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాల‌ని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *