Breaking News

Daily Archives: November 29, 2015

జ్యోతిబాఫూలే నిజమైన మహాత్ముడు

- ఎమ్మెల్యే బాజిరెడ్డి డిచ్‌పల్లి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత, బహుజనుల, స్త్రీల చదువు కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే నిజమైన మహాత్ముడని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. చదువుకు దూరమైన కోట్లాది ప్రజలకు చదువు హక్కు కల్పించిన గొప్ప మానవతా వాది ఫూలే అన్నారు. శనివారం మహాత్మా ఫూలే 125వ వర్ధంతి సభను బిసి వెల్పేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పెద్దోళ్ల శ్రీనివాస్‌ ఆద్వర్యంలో యూనివర్సిటీ కళాశాల సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ ...

Read More »

మెస్‌ బకాయిలు మాపీ చేయాలని ఎమ్మెల్యేను కోరిన విద్యార్థులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివిలో దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల పెండింగ్‌ మెస్‌ బకాయిలను రద్దు చేసేలాప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెయులోని విద్యార్థి సంఘాల నాయకులు రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెస్‌ బకాయిలు రద్దు చేసిన ప్రభుత్వం తెయు విద్యార్థుల మెస్‌ బకాయిలు కూడా రద్దు చేయాలని కోరారు. విద్యార్తి సంఘాల నాయకులు పుప్పాలరవి, శ్రీకాంత్‌, మహేశ్‌, బాలాజీ, సంతోష్‌, రమణ తదితరులున్నారు.

Read More »

రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు-నివారణ మార్గాలు

ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. హైదరాబాద్, నవంబర్ 22 : ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ...

Read More »