Breaking News

Daily Archives: November 30, 2015

మునిసిపల్‌ పాలకవర్గ సమావేశం వాయిదా

  కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన నిర్వహించిన మునిసిపల్‌ పాలకవర్గ ప్రతినిధుల సమావేశం రద్దయింది. సమావేశం ప్రారంభం కాగానే అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సమావేశం నిర్వహించరాదనే అంశాన్ని ఛైర్‌పర్సన్‌ దృస్టికి తెచ్చారు. దీంతో పూర్తి కోరం ఉన్నప్పటికి ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించలేమని వాయిదా వేస్తున్నట్టు ఛైర్‌పర్సన్‌ ప్రకటించారు. దీంతో సమావేశం వాయిదా పడింది. పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో సమావేశం నిర్వహించి తగు ...

Read More »

పిడిఎస్‌యు ఆద్వర్యంలో సిఎం దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఎదుట సోమవారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో సిఎం దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఆజాద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యనందిస్తామని చెప్పి ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇటీవల రాక్‌వెల్‌ కార్పొరేట్‌ ఇంటర్నేషనల్‌ స్కూలును ప్రారంభించిన ముఖ్యమంత్రి కార్పొరేట్‌ యాజమాన్యాల మీద ఉన్న ప్రేమ పేద విద్యార్థులపై లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ...

Read More »

టెండరు విధానం అమలు చేయొద్దు

  కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుల వ్యవస్థకు సంబంధించి టెండరు విధానాన్ని అమలు చేసే ఆలోచన మానుకోవాలని కార్మికులు సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 2007 కంటే ముందు టెండరు విధానం వల్ల కార్మికులు శ్రమదోపిడి, వేధింపులకు గురయ్యారన్నారు. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలతో అవినీతి కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయించుకున్నామన్నారు. 2007 ...

Read More »

సరైన రెజ్యుమే కీలకం

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్రమైన, సరైన బయోడేటా కలిగి ఉండడం ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి విద్యార్థులకు సూచించారు. సౌత్‌ క్యాంపస్‌ భిక్కనూరులో సోషల్‌ వర్క్‌ విభాగం ఆధ్వర్యంలో రెజ్యుమ్‌ రైటింగ్‌, ఇంటర్వ్యూ మెళకువలు అనే అంశంపై దేశ్‌పాండే ఫౌండేషన్‌తో సంయుక్తంగా సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ సరైన విధంగా ఉద్యోగాల అర్హతలకనుగుణంగా బయోడేటా తయారుచేసుకోవడం ప్రధానాంశమని అన్నారు. అభ్యర్థి, ...

Read More »

అంగన్‌వాడి సమాచారాన్ని ఆన్‌లైన్లో పొందుపరచాలి

  బీర్కూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల అంగన్‌వాడి సెంటర్ల సమాచారాన్ని ఆన్‌లైన్లో పొందుపరచాలని సూపర్‌వైజర్‌ వాణి అన్నారు. మండల కేంద్రంలోని హరిజనవాడ అంగన్‌వాడి సెంటరులో సోమవారం కార్యకర్తలతో సమావేవమయ్యారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ అంగన్‌వాడిలో గల చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆధార్‌ నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు, తదితర వివరాలు వెంటనే అందజేయాలని, ఇట్టి సమాచారాన్ని జిల్లా అధికారుల ఆదేశం మేరకు ఆన్‌లైన్లో క్రోడీకరించడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడిలకు వచ్చే చిన్నారులు, బాలింతల సమస్యలపై ఎప్పటికప్పుడు ...

Read More »

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

  బీర్కూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఎర్గట్ల గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని బీర్కూర్‌ మండల అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షులు బంగారు మైశయ్య డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టి దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా మైశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్‌ విగ్రహాలకు భద్రత కరువైందని వాపోయారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి ...

Read More »

కల్లు విక్రయ దారుల బైండోవర్‌

  బీర్కూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల కల్లు విక్రయ దారులను ఎక్సైజ్‌ ఎస్‌ఐ నరేంద్రనాథ్‌ ఆద్వర్యంలో సోమవారం డిప్యూటి తహసీల్దార్‌ వరప్రసాద్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా నరేంద్రనాథ్‌ మాట్లాడుతూ ల్లు దుకాణం దారులు దుకాణానికి తప్పకుండా ప్రభుత్వ అనుమతి పొందాలన్నారు. తయారు చేసే కల్లులో మత్తు పదార్థాలు వాడరాదని సూచించారు. ఎక్సైజ్‌ దాడుల్లో కల్లు షాంపుల్‌లో మత్తు పదార్తాలు ఉన్నట్టు తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కల్లు ...

Read More »

ఇందూరు గొప్ప చారిత్రాత్మక జిల్లా

  – జితేంద్ర బాబు డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా క్రీస్తు పూర్వం నుంచి ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతమని ప్రఖ్యాత చరిత్రకారుడు కుర్రా జితేందర్‌ అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం చరిత్ర పరిశోదకులకు ఒక విజ్ఞానగని వంటిదని ఆయన అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ చాంబర్‌లో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి, ఓరియెంటల్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జైకిషన్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మానవ జాతి చరిత్రలో బరిసెలు, ఈటెలు, ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 15 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 15 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

నిజాం షుగర్స్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలి

  బోధన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం పట్టణంలోని నిజాం షుగర్‌ కర్మాగారంపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలని పివైఎల్‌ బోధన్‌ మండల కో కన్వీనర్‌ ఆవుల విజయ్‌ డిమాండ్‌ చేశారు. బోధన్‌ ప్రజాసంఘాల ఆద్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తా వద్దగల అమరవీరుల స్థూపం వద్ద దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని పివైఎల్‌ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నీరుగారుస్తున్నారన్నారు. ఫ్యాక్టరీని స్వాధీనం ...

Read More »

91 రోజుకు చేరిన ఆశల సమ్మె

  డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె సోమవారంతో 91 రోజుకు చేరుకుంది. ఈ మేరకు మండలంలోని తహసీల్‌ కార్యాలయం ముందు కెటిల్‌ చేత్తో పట్టుకొని చాయిలు అమ్ముకుంటూ ఆశ వర్కర్లు వినూత్నంగానిరసన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా సమ్మె చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదని, అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ...

Read More »

తెరాస రైతు ప్రభుత్వం

  బోధన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడంతో బోధన్‌ పట్టణంలో తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు బుద్ద రాజేశ్వర్‌ మాట్లాడుతూ మండలంలోని అన్నిగ్రామాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినందుకు స్థానిక ఎమ్మెల్యే షకీల్‌కు, సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రైతుకు పరిహారం అందేవిధంగా చూస్తామన్నారు. తెరాస ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ...

Read More »