Breaking News

Daily Archives: December 1, 2015

Kamareddy TMU Aswadha reddyఆర్టీసి అభివృద్ది, కార్మికుల సంక్షేమమే ధ్యేయం

  టిఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థారెడ్డి కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసి అభివృద్ది, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పనిచేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థారెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి ఆర్టీసి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆవిర్భవించిందన్నారు. 44 శాతం ఫిట్‌మెంట్‌ సాధించిన ఘనత టిఎంయుదేనని చెప్పారు. గత పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పలు ...

Read More »

సానిటరీ ఎస్‌ఐకి సన్మానం

  కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీకి సానిటరీ ఎస్‌ఐగా బదిలీపై వచ్చిన వెంకటేశ్వర్లును డెయిలీ మార్కెట్‌ వెజిటెబుల్‌ రిటైల్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిన వెంకటేశ్వర్లు ఉత్తమ సేవలందించారన్నారు. సుమారు ఐదేళ్ళుగా సానిటరీ ఎస్‌ఐ లేక పట్టణంలో పారిశుద్యం లోపించిందని, ఈ నేపథ్యంలో తిరిగి వెంకటేశ్వర్లు సానిటరీ ఎస్‌ఐగా పట్టణానికి రావడం ఆనందంగా ఉందన్నారు. సానిటరీ ఎస్‌ఐని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాన్ని ...

Read More »

తహసీల్‌ కార్యాలయంలో విచారణ చేపట్టిన అదనపు సంయుక్త కలెక్టర్‌

  కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ రాజారాం మంగళవారం విచారణ చేపట్టారు. పలు పట్టా పాసుపుస్తకాలకు సంబంధించిన రికార్డులను, పహాణీలను, భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఓ భూ వివాదానికి సంబంధించి పట్టణానికి చెందిన మోనాబాయి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై అడిషనల్‌ జేసి రాజారాం విచారణ జరిపారు. పట్టణ శివారులోని 45/4 సర్వేనెంబరులో బాగుబాయి పేరుతో ఎకరం 20 గుంటల స్థలం ఉంది. బాగుబాయి మృతి చెందడంతో ...

Read More »

సైన్స్‌ పరిశోధనాశాలలు గొప్పగా ఉండాలి

  – రిజిస్ట్రార్‌ లింబాద్రి డిచ్‌పల్లి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివికి త్వరలోనే న్యాక్‌ బృందం పరిశీలనకు రానున్నందున సైన్స్‌ పరిశోధనాంశాలు గొప్పగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. న్యాక్‌ పరిశీలనా బృందంలో పేరున్న సైన్స్‌ ప్రొఫెసర్లు కూడా వస్తున్నారని, పరిశోదనాశాలలు అన్నిరకాలుగా కెమికల్స్‌, ఇతర పరికరాలతో సిద్దంగా ఉండాలని ఆయన వివిధ సైన్స్‌ విభాగాలను ఆదేశించారు. మంగళవారం రిజిస్ట్రార్‌ బయోటెక్నాలజి, బోటని, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ తదితర విభాగాధిపతులు, ఇతర అధ్యాపకులతో సమీక్షలు నిర్వహించారు. ...

Read More »

తెవివిలో ఎయిడ్స్‌ నిర్మూలన ర్యాలీ

  డిచ్‌పల్లి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌ఐవి ఎయిడ్స్‌ను అరికడదామని, ఎయిడ్స్‌లేని సమాజాన్ని నిర్మించాలని నినాదాలు చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు మంగళవారం ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్‌ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ చేపట్టినట్టు కో ఆర్డినేటర్లు పేర్కొన్నారు. ర్యాలీని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కనకయ్య జెండా ఊపి ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు ఆరతి, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ లావణ్య, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ. లక్ష మంజూరు

  రెంజల్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతులకు సిడిసి నిధుల ద్వారా రూ. లక్ష మంజూరైనట్టు పంచాయతీ రాజ్‌ డిప్యూటి ఇవో ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం మద్యాహ్నం ఆయన స్తానిక వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలోని థియేటర్‌, తాగునీటి మరమ్మతులకు ఉపయోగిస్తున్నట్టు వివరించారు. ఈ పనులను త్వరితగతిన చేపట్టిన పనులు పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట డాక్టర్‌ నస్రీన్‌ ఫాతిమా, నాయకులు మైని మోహన్‌,మౌలానా, రఫీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కాదు

  – ఎస్‌ఐ రవికుమార్‌ రెంజల్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్గాం గ్రామంలో ఆత్మహత్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవికుమార్‌ మాట్లాడుతూ ప్రజలు వివిధ రకాల ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఏ యితర ఇబ్బందుల వల్ల ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. 2500 జీవుల్లో మానవ జన్మ ఒక్కటే ఉత్కృష్టమైందని, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడే తీసుకోవాలని, అంతేగాని క్షణాల్లో వచ్చే ఆవేశాలతో నిండు జీవితాన్ని గాల్లో కలిపి, ...

Read More »

కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

  నందిపేట, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ శాఖ రుణాల కోసం అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని నందిపేట ఎంపిడివో నాగవర్ధన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఎస్సీ విభాగంలో 94 యూనిట్లు, బిసి విభాగంలో 37 యూనిట్లు, ఎస్టీ విభాగంలో 7 యూనిట్లు, మైనార్టీ విభాగానికి ఇంకా నిధులు కేటాయించలేదని, త్వరలోనే ప్రభుత్వం నుంచి వివరాలు అందుతాయని పేర్కొన్నారు. అభ్యర్తులు కుల, నివాస, ఆదాయ దృవీకరణ పత్రాలతో, ఇంటి పన్ను బిల్లులు దరఖాస్తుతో జతచేసి ...

Read More »

గొర్రెల దొంగలపై చర్యలు తీసుకోవాలి

  నందిపేట, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌ బయట గొర్రె కాపరుల సంఘం ఆధ్వర్యంలో గొర్రెల దొంగలను అరెస్టు చేయాలని కోరుతూ మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. మేత కోసం తీసుకెళ్లిన తమ గొర్రెలను గురడి కాపు కులస్తులు దొంగిలించారని, వారిపై చర్యలు తీసుకోవాలని నందిపేట మండలంలోని గంగాసారం గ్రామ యాదవ కులస్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో, మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. అయినా ఇంతవరకు దోషులను అరెస్టు ...

Read More »

దీక్షలు చేపట్టిన రైతుకూలీ సంఘం

  బోధన్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం చక్కర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నాటికి దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఏఐకెఎంఎస్‌ ఉపాధ్యక్షుడు పోశెట్టి దీక్షలో కూర్చున్నవారికి పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్‌ చక్కర కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని ప్రస్తుత క్రషింగ్‌ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం అధికారంలోకి ...

Read More »

ఘనంగా ఈశ్వరీబాయి 97వ జయంతి

  బోధన్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని లక్ష్మి అపార్టుమెంట్‌లో మంగళవారం పట్టణ అక్కినేని యువజన సంఘం ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు గంగాప్రసాదప్ప మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వీరవనిత ఈశ్వరీబాయి అన్నారు. నేటి స్త్రీ జాతికి, యువతకు ఆమె ఆదర్శప్రాయురాలు అని కొనియాడారు. కార్యక్రమంలో ఉమేశ్‌ షిండే, కింగ్‌ కైలాసప్ప, సిద్ద సాయారెడ్డి, సుధాకర్‌, రాజారాం, ...

Read More »

శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రత విశిష్ఠత

పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో…, వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశలప్రశ్నలు జరిగాక.., ‘కృష్ణా..మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కస్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచు’ అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ ఆచరించండి’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు ‘కృష్ణా..అనంతుడంటే ఎవరు? ...

Read More »

అనుష్క‌కి రాజ‌మౌళి టార్చ‌ర్‌!

ఓ వైపు సైజ్ జీరో భారీ ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకొన్న బాధ‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అనుష్క‌కు.. మ‌రోవైపు నుంచి రాజ‌మౌళి టార్చ‌ర్ పెడుతున్నాడా??? స్వీటీని ఒక‌ర‌కంగా ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా???? అవున‌నే గుస‌గుస‌లాడుకొంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. సైజ్ జీరో త‌ర‌వాత బాహుబ‌లి 2 షూటింగ్‌లో జాయిన్ అవ్వాలి అనుష్క. అయితే.. స్వీటీ మాత్రం అందుకు సిద్దంగా లేదు. కార‌ణం.. సైజ్ జీరో కోసం పెరిగిన బ‌రువే.ఈ సినిమా కోసం దాదాపుగా 18 కిలోల బ‌రువు పెరిగింది. మ‌ళ్లీ త‌గ్గ‌డానికి నానా యాత‌న ప‌డుతోంది స్వీటీ. ఇప్ప‌టికి ...

Read More »

తీవ్రవాదంపై బహ్రెయిన్‌ పోరు ప్రశంసనీయం

పబ్లిక్‌ సెక్యూరిటీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ తారిక్‌ అల్‌ హసన్‌ ఈ రోజు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటికిజక్‌ స్టడీస్‌ (ఐఐఎస్‌ఎస్‌) చైర్మన్‌ ఫ్రాంకోసిస్‌ హీస్‌బర్గ్‌, మరియు ఐఐఎస్‌ఎస్‌ బహ్రెయిన్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌ జెన్‌కిన్స్‌లకు స్వాగతం పలికారు. ప్రపంచ శాంతి కోసం ఐఐఎస్‌ఎస్‌ యాక్టివ్‌ పార్టిసిపేషన్‌ని మేజర్‌ జనరల్‌ అల్‌ హాసన్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా బహ్రెయిన్‌ చేపడుతున్న చర్యల్ని ఐఐఎస్‌ఎస్‌ ప్రశంసించింది.

Read More »

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఆర్జీ-3 డివిజన్ జిఎం వెంకట రామయ్య సెంటినరికాలనీ, నవంబర్ 30: ఆర్జీ-3, అడ్రియాల డివిజన్లలో ఉద్యోగులంతా కలిసి క్వాలిటీతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని ఆర్జీ-3 డివిజిన్ జిఎం డాక్టర్ ఎంఎస్ వెంకట రామయ్య కోరారు. సెంటినరికాలనీలోని జిఎం కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. నవంబర్‌లో అడ్రియాల గనిలో 75 వేల టన్నుల లక్ష్యానికి 1.50 లక్షల టన్నులు సాధించడంతోపాటు 2015-16వ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1 మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి సాధించిందన్నారు. ఓసిపి-2లోని విస్తరణ ప్రాజెక్టు ద్వారా ...

Read More »

జాతీయ వాదానికి పరీక్షా సమయం

భగత్‌సింగ్ సుఖదేవ్ రాజగురు వంటి పంజాబు స్వాతంత్య్రవీరులకు ప్రేరణనిచ్చింది జాతీయవాదం. గురుగోవిందసింగ్, తేజబహదూర్ వంటి వారిని సృష్టించిన భూమి పంజాబ్. వేదవ్యాసునికి జన్మనిచ్చిన ప్రాంతం. పురుషోత్తముని కాలంనుండి విదేశీ దండయాత్రలకు ఎదురొడ్డి నిలిచిన వీరభూమి ఇది. నేడేమయింది?? అమరేందర్‌సింగ్ బ్రార్ కెనడా ఎందుకు వెళ్లినట్లు? అక్కడి సిక్కు యువకులను కలిసి పాకిస్తాన్ వలె ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటుచేసుకునే సమయం వచ్చింది- అని చెప్పటం నిజమేనా? దీన్ని రాహుల్‌గాంధీ సమర్ధిండని అంటున్నారు పంజాబు ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాద ల్- దీనితో రాహుల్‌గాంధీకి కోపం ...

Read More »