Breaking News

Daily Archives: December 2, 2015

క్రమబద్దీకరణ చేసుకోకుంటే చర్యలు తప్పవు

  కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో అనధికారికంగా ఉన్న బిల్డింగ్‌లు, ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకోకుంటే చర్యలు తప్పవని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ తెలిపారు. బుధవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, లైసెన్సు సర్వేయర్లు, ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ జీవో జారీచేసిందన్నారు. బిఆర్‌ఎఫ్‌, ఎల్‌ఆర్‌ఎఫ్‌ కింద దరఖాస్తు చేసుకొని క్రమబద్దీకరించుకోవాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ...

Read More »

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డు హౌజింగ్‌ బోర్డు కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం వార్డు కౌన్సిలర్‌ రేణుక ప్రారంభించారు. ఎమ్మెల్యే నిదులు రూ. 8 లక్షలతో భూగర్భ మురికి కాలువల పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కాలనీ అభివృద్దికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రతినిదులు లింగం, రమేశ్‌, చంద్రశేఖర్‌, గీత, రాణి, ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కార్యాలయ పనివేళలు తప్పకుండా పాటించాలి

  నిజామాబాద్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ అదికారులు ప్రజలకు జవాబుదారి తనంతో పనిచేయాలని, కార్యాలయ పనివేళలు పాటించాలని, ఫిర్యాదులకు ఆస్కారంలేకుండా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ యోగితారాణా ఆదేశించారు. బుధవారం స్తానిక వీడియో కాన్ఫ్‌రెన్సు హాల్‌లో అన్ని మండలాలు, ఆర్డీవో కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని జేసితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సకాలంలో కార్యాలయ విదులకు హాజరు కావాలని, 10.30 గంటలకు హాజరు కావలసి ఉన్నా 15 ...

Read More »

జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

  కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగిఉన్న చెరుకు ట్రాక్టర్‌ను వెనకనుంచి మారుతి 800 ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్‌ గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో స్వల్ప గాయాలైనా ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

Read More »

ప్రయివేటు పాఠశాలల్ని పరిశీలించిన ప్రత్యేక బృందాలు

  బోదన్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో గుణాత్మక విద్యనుబోధించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రత్యేక బృందాలు పాఠశాలలను పరిశీలిస్తున్నాయి. బుధవారం బోధన్‌ పట్టణంలోని పాఠశాలలను పరిశీలించారు. నిర్మాణాత్మక మూల్యాంకనాలను, ప్రగతి పత్రాలు, నీటి సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక బృందాలతో జిల్లా విద్యాశాఖ తనికీలు చేస్తుంది. పట్టణంలోని విజయసాయి ఉన్నత పాఠశాలలో బుధవారం ఏరాజ్‌పల్లి ప్రధానోపాధ్యాయలు నాగయ్య ఆద్వర్యంలో పాఠశాలలో బోధనాంశాలను, బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ...

Read More »

శునకానికి అంత్యక్రియలు

  సదాశివనగర్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూడుంరి గి మనిషి పెంచుకున్న కుక్క చచ్చిపోతే అంత్యక్రియలు నిర్వహించిండు… ఎంత మానవత్వం… ఎంత మాయ…. గీనకు కుక్కమీదనే గింత ఆత్మీయత ఉంటే మనుషుల మీద ఇంకెంత ఉంటదో.. సరేగని ఏమయిందో సూద్దాం.. మండల కేంద్రానికి చెందిన ఉప్పల సుధాకర్‌ ఇంట్ల పదేళ్ళ సంది కుక్కను పెంచుకుంటున్నడు. ఏమయిందో ఏమో గని రెండ్రోజుల సంది కుక్కకు జబ్బు అచ్చిందని దవాఖానకు తీసుకపోయి చికిత్స చేయించిండు. అయినా జబ్బు నయం కాలే. పాపం ...

Read More »

షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలి

  బోధన్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంఘాల ఆధ్వర్యంలోబోధన్‌ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పిడిఎస్‌యు కార్యకర్తలు బుధవారం నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌చేస్తూ దీక్షలు చేపట్టారు. పిడిఎస్‌యు కార్యకర్తలకు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నాగేశ్‌ పూలమాలలువేసి దీక్షలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. చెరుకు రైతులు తెరాస ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని చెరుకు సాగుచేశారన్నారు. ఇతర ...

Read More »

నేడు కాళభైరవుని జయంతి

  సదాశివనగర్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇసన్నపల్లి, రామారెడ్డి శ్రీకాళభైరవస్వామి జయంతి వేడుకలు గురువారం జరపనున్నట్టు ఆలయ మేనేజర్‌ శ్రీరాం రవిందర్‌ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారికి డోలారోహణం (తొట్లె) నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాత్రి 2 గంటలకు రథోత్సవం జరపనున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి వేడుకలు విజయవంతం చేయాలని వారు కోరారు. ఇరుగ్రామాల సర్పంచ్‌లు మణ్మెమ్మ గంగాధర్‌, శైలజ శ్రీనివాస్‌, ఎంపిటిసిలు యాదగిరి, లత తదితరులున్నారు.

Read More »

వచ్చే సీజన్‌కైనా చెరుకు సాగుచేయాలని ప్రోత్సహించాలి

  బోధన్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం నిజాంషుగర్‌ ఫ్యాక్టరీపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్‌చేస్తూ చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే బోధన్‌ చక్కర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రస్తుతం ఫ్యాక్టరీపై తప్పుడు నిర్ణయాలు చేపట్టడంతో రైతులు, కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఉండగా ఇతర ప్రయివేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ...

Read More »