Breaking News

Daily Archives: December 3, 2015

ఆశ వర్కర్లకు ఆర్‌పిల మద్దతు

  కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ రిసోర్సు పర్సన్‌ ఉద్యోగులు గురువారం ఆశల దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆర్‌పిల సంఘం సిఐటియు అధ్యక్షురాలు సిద్దేశ్వరి మాట్లాడుతూ గత 93 రోజులుగా ఆశలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయమన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆశలను క్రమబద్దీకరించాలని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ యూనియన్‌ ప్రతినిధులు శైలజ, భారతి, అనిత, వరలక్ష్మి, ...

Read More »

నల్లగుంటలో తెల్లారిన బతుకు

  – గుంత తవ్వుతుండగా కార్మికుని మృతి కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాధన హాస్పిటల్‌ సమీపంలో గురువారం నల్ల గుంత తవ్వుతుండగా ఓ కార్మికుని బతుకు తెల్లారిపోయింది. నల్ల గుంత తవ్వుతుండగా మట్టికూలి కార్మికుడు మృతి చెందిన సంఘటన అందరిని కలిచివేసింది. వి వరాల్లోకి వెళితే… కామారెడ్డి బల్దియాలో వాటర్‌ సప్లై విభాగంలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్న అంగల స్వామి (43)తో పాటు ఆరుగురు కార్మికులు సాదన ఆసుపత్రి సమీపంలో గోదావరి పైప్‌లైన్‌ నల్ల ...

Read More »

యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

  కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో యువకులు చెడు వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వాహకులు బి.కె.ఉమారాణి, సచిన్‌లు అన్నారు. బ్రహ్మకుమారీల ఆద్వర్యంలో చేపడుతున్న వ్యసన ముక్తి జాగృతి యాత్రలో భాగంగా మునిసిపల్‌ కార్యాలయంలో చైతన్యపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 9 వేల సేవా కేంద్రాల్లో 140 దేశాల్లో నిస్వార్థసేవలు అందిస్తున్నామన్నారు. నా తెలంగాణ వ్యసన ముక్తి తెలంగాణ అనే ...

Read More »

అమరుల త్యాగాల ఫలం తెలంగాణ రాష్ట్రం

  కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరుల త్యాగా లపలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతిని కామరెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం, ఆత్మ గౌరవం కోసం చేసిన తెలంగాణ పోరాటం చిరస్మరణీయమన్నారు. 60 ఏళ్ల వివక్షకు చరమగీతం పాడుతూ ...

Read More »

రోడ్డు ప్రమాదాలను నివారించడం అందరి బాధ్యత

  -సిఐ కోటేశ్వర్‌రావు కామరెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ బాధ్యత వహించాలని కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో 44వ జాతీయ రహదారి అధికారులతోపాటు నవయుగ, జిఎంఆర్‌, గాయత్రీ షుగర్స్‌ యాజమాన్యంతో రోడ్డు భద్రత తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వారికి వివరించారు. వారి వారి కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ...

Read More »

సదాశివనగర్‌లో వికలాంగుల క్రీడలు

  సదాశివనగర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో వికలాంగులకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించినట్టు ఎపిఎం సాయిలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. అంగవైకల్యం దేనికి అడ్డురాదని, మనోధైర్యం ఉంటే అనేక మార్గాలున్నాయని తెలిపారు. రోజువారి దినపత్రికల్లో వికలాంగులు సాధిస్తున్న విజయాలను తెలుసుకొని ధైర్యంగా నిరంతర జీవనం సాగించాలని వారు తెలిపారు. కార్యక్రమంలో సిసిలు ఆంజనేయులు, ప్రవీణ్‌, సమాఖ్య అధ్యక్షురాళ్ళు రేణుక, శోభ, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పి. ...

Read More »

కాళభైరవస్వామికి వైభవంగా డోలారోహణం

  సదాశివనగర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన శ్రీ కాళభైరవ స్వామి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. రామారెడ్డి బ్యాంకు నుంచి స్వామివారి బంగారు విగ్రహాన్ని పోలీసు బందోబస్తు నడుమ రామారెడ్డి ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మధ్యాహ్నం 3 గంటలకు డోలారోహణ కార్యక్రమం భక్తుల జయ జయధ్వానాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించినట్టు ఆలయ మేనేజర్‌ శ్రీరాం రవిందర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సురేందర్‌ తెలిపారు. ...

Read More »

ఘనంగా వికలాంగుల దినోత్సవం

  ఆర్మూర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు వికలాంగుల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ పాల్గొని పట్టణంలోని వికలాంగులకు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారిణి ఉదయశ్రీ, ఎంఇవో రాజగంగారాం, మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ లింగాగౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read More »

పట్టణ దాహార్తిని తీర్చండి

  ఆర్మూర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతుంది. పట్టణంలో 23 వార్డులుండగా కేవలం 6 నీటి ట్యాంర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో 7 రోజులు గడుస్తున్నా ట్యాంకరు రాకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గురువారం మునిసిపల్‌ కార్యాలయం ఎదుట పట్టణంలోని మహిళలు కాళీ బిందెలతో ముట్టడించారు. అధికారులు, సిబ్బందిని లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. తమ దాహార్తిని తీర్చేవరకు కార్యాలయం ఎదుట నుంచి కదలమని భీష్మించారు. దీంతో మునిసిపల్‌ ...

Read More »

8న ఉపాధ్యాయులకు శిక్షణ

  ఆర్మూర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోగల కస్తూర్బా గాందీ బాలికల పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులకు ఈనెల 8న శిక్షణ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ గంగామణి తెలిపారు. జిల్లాలోని 25 మంది ఆర్ట్‌ ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రాజీవ్‌ విద్యా మిషన్‌ ఇవో శ్రీహరి, జిసిడివో పాల్గొంటారని తెలిపారు.

Read More »

బడిబయటి పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతోపాటు మండలంలోని అన్నిగ్రామాల్లో బడిబయట ఉన్న పిల్లలను అంగన్‌వాడి కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, విఆర్వోలు గుర్తించి బడిలో చేర్పించాలని ఎంపిడివో లింగయ్య చెప్పారు. ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలోని యాల్ల రాములు మెమోరియల్‌ హాల్‌లో గురువారం అంగన్‌వాడి కార్యకర్తలతో సమావేశమయ్యారు. బడి బయటి పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని చెప్పారు. అనంతరం సిపిడివో ఇందిర మాట్లాడుతూ బడి బయట పిల్లలను బడుల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు అంగీకరించకపోతే పోలీసుల ...

Read More »

మానసిక వికలాంగులకు క్రీడా పోటీలు

  ఆర్మూర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని భవిత పాఠశాలలో బుద్ది మాంద్యంగల మానసిక వికలాంగులకు ఎంఇవో రాజగంగారాం ఆధ్వర్యంలో గురువారం క్రీడా పోటీలు నిర్వహించారు. భవిత పాఠశాల ఆవరణలో మానసిక వికలాంగులకు క్యారమ్స్‌, పరుగుపందం నిర్వహించారు. ఈక్రీడలను ఎంఇవో రాజగంగారాం ప్రారంభించారు. అనంతరం పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిడివో లింగయ్య హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐఇఆర్‌టి సుధ, కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెవివిలో వికలాంగులకు సన్మానం

  డిచ్‌పల్లి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ 1,2,4వ యూనిట్ల ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ సెమినార్‌ హాల్‌లో గురువారం స్టీఫెన్‌ హాకింగ్స్‌, విజయాలు అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన వక్తగా విచ్చేసిన జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రమేశ్‌ మాట్లాడుతూ స్టీఫెన్‌ హాకింగ్స్‌ చదువుకునే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అభివృద్ది చెందలేదు. అభివృద్ది చెందుతున్న దశలో ఆయన శరీరంలోని అవయవాలు అందుకు అనుకూలంగా లేవు. అయినా కూడా మెదడు ...

Read More »

ఫతేపూర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

  ఆర్మూర్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ యోగితారాణా, ఆర్డీవో యాదిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్‌ మండలంలోని ఫతేపూర్‌ గ్రామంలో స్పెషల్‌ మ్యూటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

Read More »

వికలాంగులకు క్రీడాపోటీలు

  రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐకెపి ఆద్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల వికలాంగులకు గురువారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఐకెపి కార్యాలయంలో వికలాంగులకు వివిధ రకాల పోటీలు ఎంపిడివో చంద్రశేఖర్‌ ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎపిఎం సరళ, ఎపివో సతీష్‌, సర్పంచ్‌ చందూర్‌ సవిత, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

వికలాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగులందరికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను వర్తింపజేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితారాణా తెలిపారు. గురువారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లోనిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపుతున్న వికలాంగ పిల్లలను, వికలాంగులకు సేవలు అందిస్తున్న వైద్యులను జిల్లా కలెక్టర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులందరికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయించి పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఆర్థిక సహాయ పథకాల ...

Read More »

వారసులు పట్టామర్పిడిలు చేసుకోవాలి

  రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరణించిన వ్యక్తులకు చెందిన భూమి పట్టాలను వారసులు మార్పిడి చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. మండలంలోని బాగేపల్లి గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల పట్టా పాసుపుస్తకాలను సరిచూశారు. మరణించిన వ్యక్తి నుంచి భార్య తరువాత వారసుల పేర పట్టాలు చేసుకోవచ్చన్నారు. ఒకవేళ తల్లిదండ్రుల వయసు పైబడ్డచో వారి అంగీకారంతో పిల్లల పేర చేసు ఆస్కారముందన్నారు. పట్టా పాసు పుస్తకాలు సక్రమంగా లేకపోవడం వల్ల పంట ...

Read More »

వైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు కాదు

  బోధన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక వైకల్యం కలిగి ఉన్నప్పటికి ఎటువంటి మనోధైర్యాన్ని కోల్పోకుండా సమాజంలో ఆదర్శంగా నిలవడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలైన సుజాత సూర్యవంశిని వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వాసవి వనిత క్లబ్‌ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్‌ అద్యక్షురాలు హైమావతి మాట్లాడుతూ ఆత్మ స్థైర్యం కోల్పోకుండా ఎంతోమంది వికలాంగులకు మార్గదర్శకంగా నిలుస్తున్న సుజాత సూర్యవంశి కృషి మరువలేనిదన్నారు. వికలాంగత్వం శరీరానికే ...

Read More »

మూఢనమ్మకాలు నమ్మరాదు

  రెంజల్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రజలు మూఢనమ్మకాలను విడనాడాలని తహసీల్దార్‌ వెంకటయ్య, ఎస్‌ఐ రవికుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని బాగేపల్లి గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరనలో మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. వాటన్నింటిని సృష్టించుకొని ఆరోగ్యాలు పాడుచేసుకోవడమే నన్నారు. మంత్రాలు, తంత్రాలు ఏమి లేవని దేవుడు ఒక్కడేనని పేర్కొన్నారు. గ్రామంలో మరుగుదొడ్లు లేనివారు 900 రూపాయలు చెల్లించి నిర్మించుకోవాలని తహసీల్దార్‌ ...

Read More »

పౌరసేవలను పొందే హక్కు ప్రజలకు ఉంది

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందే హక్కు ప్రజలకు ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక హరితహోటల్‌ నుంచి కలెక్టరేట్‌ మైదానం వరకు నిర్వహించిన విద్యార్తుల ర్యాలీని జిల్లాకలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని అర్హులకు మాత్రమే అందేవిధంగా చూడాల్సిన బాధ్యతఅధికారులతో పాటు ...

Read More »