Breaking News

Daily Archives: December 4, 2015

శరీరాకృతి తనకు నచ్చినట్టుగా లేదని అంటున్నారు

ప్రశ్న: మా వారికి యాభై అయిదేళ్లు. రతిలో యాక్టివ్‌గానే ఉం టారు. కాని ఇటీవల నా శరీరాకృతి తనకు నచ్చినట్టుగా లేదని అం టున్నారు. ఈ కారణం చేత రతిలో పటిష్టమయిన ఉద్రేకాన్ని పొంద లేకపోతున్నానని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు నేను స్లిమ్‌గా అవ్వా లంటే ఎలా… చెబితే వినడం లేదు. పైగా బయటకు పోతానని బెదిరింపు ఒకటి. వయసులో వున్నట్టుగా ఆకర్షణీయంగా వుండాలంటే ఆవుతుందా ఈయనకు ఎవరితోనయినా చెప్పిస్తే మంచి దనిపిస్తోంది. మీ సలహా ఏమిటి జవాబు: వయసు పైబడిన కొద్ది లైంగికోద్రేకస్థాయి కూడా ...

Read More »

విద్యుత్‌ సేవలపై వినియోగదారుల ఆందోళన

  కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ సేవలు దారుణంగా ఉన్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్వాన్నంగా ఉన్న విద్యుత్‌ సేవలపై వారు నిరసన తెలిపారు. శుక్రవారం కామారెడ్డి విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో వినియోగదారుల సమస్యల పరిస్కార వేదిక ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు విద్యుత్‌ సేవలపై అధికారులను నిలదీశారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే అధికారులకు డబ్బులు చెల్లించినా రోజుల తరబడి తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది వచ్చే ...

Read More »

డబ్ల్యుటివో గ్యాట్‌ ఒప్పందాన్ని భారత్‌ బహిష్కరించాలి

  – పిడిఎస్‌యు డిమాండ్‌ కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబ్ల్యుటివో – గ్యాట్‌ ఒప్పందాన్ని భారత్‌ బహిష్కరించాలని పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణంలోని పిడిఎస్‌యు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసినసమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్య ప్రయివేటీకరణ, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పిడిఎస్‌యు, విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలోని ఉన్నత విద్యలో పెద్ద ఎత్తున ...

Read More »

ప్రయివేటు లెక్చరర్ల వేతనాలు విడుదల చేయాలి

  – టిఎల్‌ఎఫ్‌ డిమాండ్‌ కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా ప్రయివేటు కళాశాలల్లో యాజమాన్యం కింద పనిచేస్తున్న లెక్చరర్ల జీతభత్యాలు విడుదల చేయాలని తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టిఎల్‌ఎఫ్‌ నేడు జీతభత్యాల కోసం పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు గత మూడు నెలలుగా లెక్చరర్లకు వేతనాలు ...

Read More »

వసతి గృహాల నిర్వహణపై రిజిస్ట్రార్‌ సమీక్ష

  డిచ్‌పల్లి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వసతి గృహాల నిర్వహణపై రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. న్యాక్‌ బృందం సందర్శన సందర్భంగా వసతి గృహాలు కల్సిస్తున్న సౌకర్యాలు, అభివృద్ది కార్యకలాపాలను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా వసతి గృహాల ప్రొఫైల్‌ పూర్తిచేసి విద్యార్థి, విద్యార్థిని పూర్తి సిబ్బంది సమాచారాన్ని కంప్యూటరైజ్‌చేసి బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. హాస్టల్స్‌, బిల్లుల నిర్వహణ, స్టోర్‌కు సంబంధించిన రికార్డులన్ని సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే వసతి ...

Read More »

చెన్నై వీధుల్లో తిరుగుతూ ఫుడ్, వాటర్ పంచిన విశాల్

(4 Dec) చెన్నై: తమిళ నటుడు విశాల్ భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు తనవంతు సహాయం అందించారు. నీళ్లతో నిండిపోయిన వీధుల్లో తన టీంతో తిరగుతూ ఫుడ్, వాటర్ పంపిణీ చేసారు. అందకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూడొచ్చు. తమిళనాడు వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు, తమిళం స్టార్లు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు డబ్బు రూపంలో విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. మరికొందరు నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, మెడిసిన్స్, వాటర్ పంపిణీ ...

Read More »

“మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్” గా కేటీఆర్.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు అరుదైన అవార్డు దక్కింది. ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ “రిట్జ్” ప్రముఖ సీఎన్ఎన్ఐబిఎన్ ఛానల్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఆడి రిట్జ్ ఐకాన అవార్డ్ 2015” కింద “మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్” అవార్డ్ కేటీఆర్ కు దక్కింది. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎన్నో వినూత్న పథకాలు ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ అవార్డ్ దక్కింది. ఈ నెల 13న బెంగుళూరులో తాజ్ వెస్టండ్ హోటల్లో జరిగే ఈకార్యక్రమంలో కేటీఆర్ కు ...

Read More »

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాన ఉర్దూ జర్నలిస్టు ఫోరం ప్రతినిధులు శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందిగా కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫోరం ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ జాఫర్‌ అలీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ద్వారా సిఎం కెసిఆర్‌ దృస్టికితీసుకెళతారని ఆశాభావం ...

Read More »

పిడిఎస్‌యు నూతన కార్యవర్గం ఎన్నిక

  భీమ్‌గల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం భీమ్‌గల్‌ ఏరియా నూతన కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు డి.అజయ్‌, ప్రధాన కార్యదర్శిగా బి.రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా భానుప్రియ, యాసీన్‌, సహాయ కార్యదర్శులుగా నవీన్‌, హరిక, మధు, కోశాదికారిగా శివగీతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అధ్యక్షుడు తెలిపారు.

Read More »

వికలాంగ విద్యార్థులకు పండ్ల పంపిణీ

  భీమ్‌గల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని శుభోదయం వికలాంగుల పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా న్యూ ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో వికలాంగ విద్యార్తులకు ఐకెపి సిసిలు, గణేష్‌, సుమన్‌, అధ్యక్షులు రావుట్ల అరవింద్‌ల చేతుల మీదుగా పండ్లు పంపినీ చేశారు. కార్యక్రమంలో యూత్‌ ఉపాధ్యక్షులు రామవత్‌ శ్రీకాంత్‌, సభ్యులురాగి భార్గవచారి, ముత్యం, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More »

9న మైన్స్‌, క్వారీ యజమానులు, లీజుదారులకు సదస్సు

  నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మైన్స్‌, క్వారీ యజమానులు, లీజుదారులందరికి ఈనెల 9వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు గనులు మరియు భూగర్భశాఖ సహాయ సంచాలకులు యస్‌. సురేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా ఖనిజ రవాణా పర్మిట్లు జారీ చేయడానికి నిర్ణయించిందని, ఆన్‌లైన్లో పర్మింట్లు పొందే విధానం సంపూర్ణ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్థానిక ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ సదస్సుకు ...

Read More »

రాష్ట్ర ఉత్తమ ఆచార్య అవార్డు గ్రహీత సి.శివరామకృష్ణ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటు

  డిచ్‌పల్లి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఉత్తమ ఆచార్య అవార్డు గ్రహీత, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతాచార్యులు, గొప్ప ఆర్థికవేత్త, మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్‌ సి.శివరామకృష్ణ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని తెలంగాణ యూనివర్సిటీ అర్ధశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ పాతనాగరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం సెమినార్‌ హాల్‌లో సంతాపసభ ఏర్పాటు చేశారు. ఎం.ఎ. ఎకనామిక్స్‌, అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ విద్యార్థులు, ఆచార్యులు డాక్టర్‌ రవిందర్‌రెడ్డి, డాక్టర్‌. బి.వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఎ.పున్నయ్య, డాక్టర్‌ స్వప్న, డాక్టర్‌ సంపత్‌, డాక్టర్‌ ...

Read More »

నేడు వెంకన్న ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాన తిరుమల ఆలయంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం వెంకటేశ్వరునికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేపడతామన్నారు. భక్తులకు సదుపాయాల్లో భాగంగా మధ్యాహ్నం విరాళాలచే మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.

Read More »

ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

  బీర్కూర్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ ఆశ వర్కర్లు చేస్తున్న నిరవదిక సమ్మె శుక్రవారంతో 93వ రోజుకు చేరుకుంది. . నిరసనలో భాగంగా మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 93 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ...

Read More »

న్యాక్‌ పరిశీలనకు యుద్ద ప్రాతిపదికన చర్యలు

  డిచ్‌పల్లి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 21వ తేదీ నుంచి న్యాక్‌ సభ్యుల బృందం యూనివర్సిటీకి విచ్చేయనున్నట్టు తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని శాఖలు పరిపూర్ణ సన్నద్దతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం రిజిస్ట్రార్‌ అద్యక్షతన కంప్యూటర్‌ సైన్స్‌ భవనంలో సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీడ్‌బ్యాక్‌ పారాలు అందజేసి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని అన్నారు. అలాగే తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. న్యాక్‌ సబ్యులు ప్రతి విషయంలో గ్రేడ్‌లు ...

Read More »

శంకరాభరణం గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

స్వామి రారా, కార్తికేయ , సూర్య vs సూర్య వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘శంకరాభరణం’.క్రైమ్ & కామెడీ తో తెరకెక్కిన ఈ చిత్రంన్ని స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మించడం తో ఈ చిత్రం ఫై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.. ఆ అంచనాలు తగ్గట్టు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.. ముఖ్యంగా ఆడియన్స్ సప్తగిరి కి హీరో నిఖిల్ కి మద్య వచ్చే కామెడీ ని ...

Read More »

సుపరిపాలన శూన్యమేనా?

ఏ ప్రభుత్వంలోనైనా సుపరిపాలన సాగుతున్నదా, లేదా! అన్నది చెప్పడానికి రెండే గీటురాళ్లు. ఒకటి ప్రజల సమస్యలు, రెండోది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రజలకు నిత్యసమస్యలు అనేకానేకం ఉన్నా, అన్నిటికంటె ప్రధానమైనది నిత్యావసరాల ధరవరలు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రధానంగా చూడవలసింది కేటాయింపులు, అప్పులు. ఈ రెండింటిని బట్టి చూస్తే ప్రభుత్వపాలన ఏ విధంగా ఉన్నదో తేలికగానే చెప్పవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడచిన 16 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం సుపరిపాలనకు ఇంకా చాలా దూరంగానే ఉన్నదని ఆ రెండు గీటురాళ్లను పరిశీలిస్తే ...

Read More »