Breaking News

Daily Archives: December 5, 2015

అక్రమ లేఅవుట్లపైబల్దియా అధికారుల కొరడా…

  క్రమబద్దీకరించకపోవడంతో చర్యలు కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాలు అనుమతిలేని వాటిపై పట్టణ ప్రణాళికాధికారులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం అధికారులు అక్రమ లేఅవుట్లను గుర్తించి కొరడా ఝళిపించారు. ఇదివరకే వాటిని క్రమబద్దీకరించుకోవాలని అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో లే అవుట్లలోకి ప్రొక్లెయిన్లు తీసుకెళ్ళి చదునుచేయించారు. ప్రభుత్వం అనధికార భవనాలు, ప్లాట్ల క్రమబద్దీకరణ కోసంజీవో విడుదల చేసింది. బిఆర్‌ఎప్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకొని క్రమబద్దీకరించుకోవాలని తెలిపింది. వీటికి అపరాధ రుసుము విధించింది. అనధికారిక ...

Read More »

డెయిలీ మార్కెట్‌ అభివృద్ది కోసం ఎమ్మెల్యేకు వినతి

  కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డెయిలీ మార్కెట్‌ను అభివృద్ది చేయాలని శనివారం డెయిలీ మార్కెట్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు చిన్న వ్యాపారులకు న్యాయం చేయలేదని, ఏ ప్రభుత్వమూ తమను ఆదుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని తమకు అందేలా చూడాలని కోరారు. మార్కెట్లో సైతం మౌలిక వసతులు ...

Read More »

దుకాణాలపై సానిటరీ ఎస్‌ఐ దాడులు

  కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ దుకాణాలపై శనివారం సానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు దాడులు జరిపారు. ఎపిఎన్‌ రోడ్డు, ముస్రిఫ్‌బాగ్‌ ప్రాంతాల్లో గల ప్లాస్టిక్‌ సామగ్రి విక్రయించే దుకాణాలపై దాడులు చేశారు. 40 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం గల క్యారీ కవర్లను విక్రయిస్తుండడంతో వాటిని జప్తుచేశారు. వాటి విలువ సుమారు రూ. 8 వేలు ఉంటుందని తెలిపారు. శ్రీనివాస ప్లాస్టిక్‌ ఏజెన్సీ, రాందేవ్‌ లేడీస్‌ ఎంపోరియం దుకాణాలకు 2500 రూపాయల చొప్పున జరిమానా ...

Read More »

గణపతి ఆలయంలో దత్తపీఠాధిపతి పూజలు

  కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలోగల శ్రీసంకష్ట హర మహాగణపతి క్షేత్రాన్ని శనివారం దత్తపీఠ ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామిజి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. గణపతి క్షేత్రాన్ని ఎందరో జగద్గురువులు సందర్శించారని అన్నారు. క్షేత్ర మహిమను కొనియాడారు. దత్తపీఠాధిపతి రాకతో 18 మంది పీఠాధిపతుల దర్శన భాగ్యం కలిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ, అర్చకులు సంపత్‌ శర్మ, సంజీవరావు, కమిటీ ...

Read More »

వైభవంగా అయ్యప్ప ఆలయంలో పూజలు

  కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శనివారం స్వామివారికి భక్తిశ్రద్దలతో వైభవంగా పూజలు నిర్వహించారు. పబ్బ శ్రీహరిస్వామి 18వ సారి దీక్ష బూనిన నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. గణపతి హోమం, అష్టాభిషేకం, పడిపూజ మహోత్సవం ఘనంగా జరిపారు. అనంతరం అయ్యప్పలకు భిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి స్వామి ఆలయ అధ్యక్షుడు చీల ప్రభాకర్‌ సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉదయ్‌, లక్ష్మణ్‌, సాయాగౌడ్‌, గంగాధర్‌, బాలకిషన్‌, లక్ష్మికాంతం, శ్రీనివాస్‌, ముప్పారపు ...

Read More »

దైవ చింతనతో మానసిక ప్రశాంతత

  కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవునికి దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి శివారులోని దత్తాశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఘనంగా హనుమాన్‌ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆశ్రమంలోని దేవాలయాన్ని సందర్శించి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులకు విశేష ప్రవచనాలు చేశారు. భక్తులు ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి సేవ చేయాలన్నారు. కామారెడ్డి ఆశ్రమం కర్ణాటకలోని వె.కె.దాటు ఆశ్రమం లాగా ఉందని, ప్రశాంత ...

Read More »

పరిపాలనా, అకడమిక్‌ అధికారులదే కీలకపాత్ర

  – నాక్‌ నిపుణులు డిచ్‌పల్లి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాక్‌ బృందం పరిశీలన వచ్చిన సందర్భంగా అకడమిక్‌ అధికారులు, పరిపాలనా సిబ్బందిదే కీలకపాత్ర అని నాక్‌ నిపుణులు ప్రొఫెసర్‌ వి. ప్రసాద్‌, ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ అన్నారు. వారు విసి తో కలిసి టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. వారు తమ విభాగాలకు సంబంధించిన అన్ని అంశాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. తమ విధులు, బాధ్యతలు గుర్తెరిగి, దానికి సంబంధించిన అన్ని విషయాలను సర్వసన్నద్దం చేసుకోవాలన్నారు. ప్రతి ...

Read More »

20 సూత్రాల కార్యక్రమం లక్ష్యాలు పూర్తి చేయాలి

  నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 20 సూత్రాల కార్యక్రమంలో లక్ష్యాలు నిర్ణయించని శాఖలకు జిల్లా స్థాయిలోని లక్ష్యాలను అనుసంధానం చేయాలని, లక్ష్యాలు పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబర్చాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. 20 సూత్రాల కార్యక్రమంపై శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో సంబంధిత అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత మరుగుదొడ్లు, కళ్యాణలక్ష్మి, టిఎస్‌ ఐపాస్‌ అంగన్‌వాడి కేంద్రాలు, ఉపాధి హామీ, తదితర పథకాలపై మరింత లక్ష్యాలు పెంచుకొని పూర్తిచేయాలన్నారు. ...

Read More »

నాక్‌ గుర్తింపుతోనే నిధులు

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాక్‌ గుర్తింపుతోనే తెలంగాణ యూనివర్సిటీకి నిధులు వస్తాయని వైస్‌ ఛాన్స్‌లర్‌ సి.పార్థసారధి అన్నారు. నాక్‌ గుర్తింపు, మంచి గ్రేడింగ్‌తోనే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, రూసా పథకం కింద నిధులు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. శనివారం నాక్‌ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌హాల్‌లో సమావేశం ఏర్పాటు ...

Read More »

మనిషికి వైద్య పరీక్ష… మట్టికి నమూనా పరీక్ష తప్పనిసరి

  నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి రైతు తన భూమికి సంబంధించి మట్టి నమూనా పరీక్షలు తప్పకుండా చేయించాలని రాష్ట్ర విత్తనోత్పత్తి కమీషనర్‌, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి.పార్థసారధి తెలిపారు. శనివారం కొత్త అంబేడ్కర్‌ భవన్‌లో ప్రపంచ భూసార పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి ఏరకమైన పంటలకు అనుకూలిస్తుందో, ఏ మేరకు రసాయన ఎరువులు వాడాలో పరిశీలించకుండా అదిక మొత్తంలో రసాయన ఎరువులను వినియోగిస్తూ ...

Read More »

పూర్వ ప్రహరీకి ఆనుకొని నిర్మించాలని ధర్నా

  బోధన్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏబివిపి ఆద్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీని ఆనుకొని కొత్తప్రహరీని నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ధర్నా చేశారు. ప్రహరీ విషయంలో శుక్రవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామన్నారు. కాలేజీ స్థలం కాలేజీకే వదిలేయాలని, ఏ ఇతర వ్యక్తులు ఆక్రమించాలని చూసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ధర్నాలో ఏబివిపి నాయకులు లక్ష్మణ్‌ చౌహాన్‌, శ్రీనివాస్‌ చౌహాన్‌, గణేష్‌ నాయక్‌, ప్రదీప్‌, శ్రీకాంత్‌, ప్రణయ్‌ యాదవ్‌, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వెంకన్న ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం వెంకటేశ్వరునికి ఇష్టమైన రోజు కావడంతో ఉదయంనుంచే భక్తుల తాకిడి అధికంగా నెలకొంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి శనివారం వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలుచేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆలయ కమిటీ ...

Read More »

చక్కర ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలి

  బోధన్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ చక్కర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకొని నడిపేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం రోజుకు 18వ రోజుకు దీక్షలు చేరుకున్నాయి. నిజాం షుగర్‌ రక్షణ కమిటీ సలహాదారుడు, న్యాయవాది హెచ్‌.వి. హన్మంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమాలు ఆపేది లేదన్నారు. వెంటనే ప్రభుత్వం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని వచ్చే క్రషింగ్‌నైన ప్రభుత్వ ఆధీనంలో నడిపేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు, ...

Read More »

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

  బీర్కూర్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మీర్జాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోగల వీరాపూర్‌ దుబ్బ గ్రామంలో బాల్య వివాహాన్ని శనివారం ఐసిడిఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వాణి కథనం ప్రకారం వీరాపూర్‌ గ్రామానికి చెందిన దత్తాత్రి రూప దంపతుల కుమార్తె అయిన సోని (15) అదే గ్రామానికి చెందిన శ్యాం సింగ్‌, పద్మ దంపతుల కుమారుడు జంపన్నతో ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శనివారం అడ్డుకున్నారు. బాల్య వివాహాల వల్ల ...

Read More »

కరపత్రాలు ఆవిష్కరించిన ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

  బోధన్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్తాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం డిసెంబరు 8న తహసీల్‌ కార్యాలయాలు దిగ్భందం చేస్తున్నట్టు శనివారం బోధన్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు గంగాధర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. 8 వ తేదీన జిల్లాలోని అన్ని తహసీల్‌ కార్యాలయాలను దిగ్బందం చేయడం జరుగుతుందని, 11వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ...

Read More »

స్వీట్‌ బ్రెడ్‌ ఆమ్లెట్‌

కావాల్సినపదార్థాలు: బ్రెడ్‌ ముక్కలు – ఐదు, కోడి గుడ్లు – రెండు, పంచదార పొడి – 50గ్రాములు, సోడా – చిటికెడు, నూనె – తగినంత. తయారుచేయు విధానం: ఒక్కో బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో పంచదారపొడి వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా సోడా కూడా వేసి స్పూనుతో బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టాలి. బాగా వెడెక్కాక రెండు స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు కట్‌ చేసిన ...

Read More »

హట్టా – ఒమన్‌ చెక్‌పాయింట్‌ మూతపై కన్‌ఫ్యూజన్‌

హట్టా మీదుగా ఒమన్‌ మరియు యూఏఈ మధ్య రాకపోకలు నిర్వహించే ప్రయాణీకులు, చెక్‌పోస్ట్‌ మూసివేతపై ఆందోళనకు గురువుతున్నారు. షార్జా రూట్‌లో కల్బా మీదుగా వెళ్ళాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సైతం ఈ అంశంపై పెదవి విప్పడంలేదు. వరుస సెలవులు వస్తుండడంతో భద్రతా కారణాల రీత్యా చెక్‌పోస్ట్‌ మూసి వేసి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హట్టా మీదుగా చేసే ప్రయాణంతో పోల్చితే షార్జా వైపు ప్రయాణం రెండు గంటలు అదనంగా ఉంటోందని ప్రయాణీకులు అంటున్నారు. కల్బా దారి, హట్టా దారితో ...

Read More »

‘ఆర్యుల దాడి’ని తిప్పికొట్టిన అంబేద్కర్!

రాజ్యాంగం అనగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్ఫురించడం సహజం… రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన చర్చలలో సమైక్య భావం వెల్లివిరిసింది. అయితే అద్వితీయ భారత జాతి ఏకాత్మకతకు భంగం కలిగించే భావాలు కూడ తొంగి చూసా యి. ఇలా తొంగి చూడడం బ్రిటిష్ దురాక్రమణ నాటి వికృత వారసత్వం! విషబీజం మొలకెత్తితే వృక్షంగా మారడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చు, దశాబ్దుల తరువాత లేదా శతాబ్దుల తరవాతనో దాని ప్రభావం కనిపించవచ్చు! అంకురించిన అమృతపు విత్తనం కూడ మహా ...

Read More »