Breaking News

Daily Archives: December 7, 2015

నాచుపల్లిలో చిల్లరదొంగల హంగామా

  బీర్కూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చిల్లర దొంగ హంగామా గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం నాచుపల్లి గ్రామానికి చెందిన రమేశ్‌బాబు అనే వ్యక్తియొక్క రెండు బైకులను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అదే గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తి యొక్క టివిఎస్‌ ఎక్సెల్‌నుఇంటి వద్దనుంచి తీసుకెళ్లి నెమ్లి గ్రామ శివారులో పాడేశారు. గ్రామంలో ఓ లారీ నుంచి డెక్‌సెట్‌ను ఎత్తుకెళ్లారని తెలిపారు. సంబంధిత సమాచారాన్ని గ్రామ ...

Read More »

బాలికల వసతి గృహానికి ప్రతిపాదనలు

  బీర్కూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ ఉన్నత పాఠశాలలో బాలికల వసతి గృహానికి ప్రతిపాదనలు పంపామని పాఠశాల ప్రధానోపాద్యాయులు శివరాజ్‌ తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం జిల్లా విద్యాధికారులు పాఠశాలకు విచ్చేసి వసతి గృహ నిర్మాణానికి సదుపాయాలను పరిశీలించారని, జిల్లా అధికారులకు నివేదికలు పంపారని తెలిపారు. 6- 10వ తరగతి విద్యార్థిని, విద్యార్తులకు 2016-17 సంవత్సరానికి బాలికల వసతి గృహం మంజూరు చేయాల్సిందిగా కోరామని అన్నారు.

Read More »

ప్రజావాణిలో ఫిర్యాదు

  బీర్కూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి ఒక ఫిర్యాదు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. నాచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గంశెట్‌పల్లి గ్రామంలో గల సిఎస్‌ఐ చర్చికి సంబంధించిన భూమిని ఆగష్టు నెలలో సర్వేచేపట్టామని అట్టి వివరాలు రెవెన్యూ పహాణీ 16వ నెంబరులో చేర్చలేదని, 16వ కాలంలో చర్చి వివరాలు పొందుపరచాలని, గ్రామానికి చెందిన వెంకట్‌ ఫిర్యాదు చేశాడు. సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి బాధితులకు ...

Read More »

ఆశ వర్కర్ల భిక్షాటన

  బీర్కూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ ఆశ వర్కర్లుచేపట్టిన సమ్మె సోమవారంతో 96వ రోజుకు చేరుకుంది. ఇంతకాలంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆశ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 10న కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, గత మూడునెలల సమ్మెలో కూర్చొవడం వల్ల ఆశ వర్కర్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో హైదరాబాద్‌ పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 15 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 12 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

అంతర్గత నాణ్యత విభాగం పనితీరు నాక్‌ గుర్తింపులో కీలకం

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాక్‌ బృందం పరిశీలనకు వచ్చిన సమయంలో తెలంగాణ యూనివర్సిటీలో అంతర్గత నాణ్యత విభాగం పనితీరు కీలకంగా ఉంటుందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. సోమవారం అంతర్గత నాణ్యత విభాగం ఆధ్వర్యంలో జరిగిన విభాగాధిపతుల, డీన్ల, ప్రిన్సిపాళ్ళ సమావేశంలో ఆయన నాక్‌ పరిశీలనా బృందం పర్యటన గురించి దిశా నిర్దేశం చేశారు. నాణ్యతా ప్రమానాలు పాటించేలా ఇంటర్నల్‌ క్వాలిటీ అస్యూరెన్సు సెల్‌ ఎప్పటికప్పుడు వర్సిటీలో అప్రమత్తంగా ఉండి ...

Read More »

ఉపాధి హామీ కూలీలకు రూ. 150 చెల్లించాలి

  కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనికి తగ్గ కూలీలు ఇవ్వడం లేదని నిరసిస్తూ సోమవారం పోలీసు స్టేషన్‌ ఎదుట సాటాపూర్‌ గ్రామ ఉపాధి కూలీలు రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు చేసిన రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోజువారి వేతనంగా 30 నుంచి 40 రూపాయలే వస్తుండడతో తాము చేస్తున్న పనికి గిట్టుబాటు కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. పనికితగ్గ రోజుకు రూ. 150 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సంఘటన స్థలానికి తహసీల్దార్‌ వెంకటయ్య, ...

Read More »

మాల మహానాడు రెంజల్‌ గ్రామ కమిటీ ఎన్నిక

  రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనంలో సోమవారం రెంజల్‌ మాల మహానాడు గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గైని ఆనంద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా కిషన్‌, ఉపాధ్యక్షులుగా లోక గంగాధర్‌, కరికెల్లిగంగాధర్‌, సంయుక్త కార్యదర్శులుగా సిద్ద అశోక్‌, గైని రమేశ్‌, కోశాధికారిగా మెరుగు పోచయ్య, సలహాదారులుగా బోగిడి పోచయ్య, అబ్బయ్య, గోవూరు సాయిలులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా నాయకులు సంతోష్‌, నీరడి రమేశ్‌ తెలిపారు. ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ ...

Read More »

ఉచిత శిక్షణకు దరఖాస్తులు

  కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రైట్‌ కంప్యూటర్‌ ఇన్సిట్యూట్‌లో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఇన్సిట్యూట్‌ డైరెక్టర్‌ రాజేంద్ర తెలిపారు. కంప్యూటర్‌, బ్యూటీషియన్‌, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. శిక్షణ సమయంలో స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 8500442499 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Read More »

ప్రభుత్వ వైద్యాన్ని ప్రయివేటు పరం చేస్తే సహించం

  – సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వం ప్రయివేటు పరం చేయాలని చూస్తోందని ఈ కుట్రలను అడ్డుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్‌ ప్రభుత్వం బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెబుతూ గ్రామీణ పేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ గ్రామీణ పిహెచ్‌సిలను ప్రయివేటు పరం చేసే కుట్ర చేస్తుందన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ...

Read More »

8న ఎంబిసిల చలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత వెనకబడిన బిసి కులాలకు రిజర్వేషన్ల సాదన, బడ్జెట్‌ కేటాయింపుల కోసం ఈనెల 8న తలపెట్టిన ఎంబిసిల ఛలో హైదరాబాద్‌కు సంబంధించిన గోడప్రతులను సోమవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన బిసి కులాల అభ్యున్నతి కోసం బిసి సబ్‌ప్లాన్‌ సాదన సమితి పాటుపడుతుందన్నారు. బిసి కులాల్లోని సంచార, చిరు వృత్తులు చేసేవారు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బిసి ప్రతినిధులు క్యాతం సిద్దిరాములు, నర్సింగ్‌రావు, ...

Read More »

పంట నష్టం పూర్తిగా చెల్లించాలి

  కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా పంట నష్టపోయారని, వారికి పూర్తిస్తాయి నష్టపరిహారం చెల్లించేలా ప్రతిపాదనలు పంపాలని, కేంద్ర కరవు పరిశీలన బృందానికి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. సోమవారం వచ్చిన కేంద్ర కరవు పరిశీలన బృందాల్ని కలిసి రైతు కరవు పరిస్థితులను విన్నవించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలోని అన్ని మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్ని మండలాలను ...

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 50 ఎకరాల భూమి కేటాయించాలి

  కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 50 ఎకరాల భూమి కేటాయించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల అభివృద్దికి 200 ఎకరాలకు పైగా భూములు ఉన్నప్పటికి అవి కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతో యుజిసి నుంచి వచ్చే నిదులు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచివచ్చే నిదులు రాకపోవడంతో కళాశాల అభివృద్ది ...

Read More »

పశువుల నుంచి కాపాడాలని వినతి

  కామారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూరగాయలను నాశనం చేస్తున్న పశువుల నుంచి కాపాడాలని డెయిలీ మార్కెట్‌ వెల్పేర్‌అసోసియేషణ్‌ ప్రతినిధులు సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి డెయిలీ మార్కెట్లో తాము నిత్యంకూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రతిరోజు 20 నుంచి 30 ఆవులు తమను వ్యాపారం చేయనీయకుండా కూరగాయలు నాశనం చేస్తున్నాయని, వినియోగదారులను భయపెడుతూ వారిని వికలాంగులను చేస్తున్నాయన్నారు. రైతులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ...

Read More »

మొక్కలు కూడా ఒత్తిళ్ళను తట్టుకుంటాయి

  డిచ్‌పల్లి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని వృక్షశాస్త్ర విభాగంలో మూడురోజులుగా పాపులర్‌ లెక్చర్‌ సిరీస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం చివరిరోజు వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య విద్యావర్ధిని మాట్లాడుతూ మొక్కల్లో కలిగే వివిధ రకాల ఒత్తిళ్ళ నుంచి మొక్కలు ఎలా రక్షించుకుంటాయో వివరించారు. ప్రపంచ పారిశ్రామికీకరణ వల్ల పరిశ్రమలనుంచి విడుదలైన వ్యర్థాలు, రకరకాల రసాయనాలు, ఇతరత్ర వ్యర్థపదార్థాలను నదులు, చెరువులు, కాలువలు, కుంటలు, చివరకు సముద్రాల్లో కూడా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఉండే ...

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  ఆర్మూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి చలికి వణుకుతుండగా 108 అంబులెన్సులో రాత్రి సమయంలో ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైనచికిత్స కోసం అదేరోజు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 5వ తేదీ రాత్రి మృతి చెందినట్టు ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సోమవారం తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆర్మూర్‌ విఆర్వో కె.సుభాష్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ...

Read More »

బీర్కూర్‌లో పతంజలి యోగ శిబిరం

  బీర్కూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువు రాందేవ్‌బాబా ఆశీస్సులతో వారి శిష్యుడయిన గురు రఘువీర్‌ ఆధ్వర్యంలో బీర్కూర్‌లో పతంజలి యోగ శిబిరం కొనసాగుతుంది. ఇందులో భాగంగా సోమవారం 6వ రోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు యజ్ఞము, యోగాసనాలు, ప్రాణాయామం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీర్‌ స్వామి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భగవంతుని నామస్మరణతో మన పనులు చేసుకుంటూ భగవంతుని ఏవిధంగా ధ్యానం చేయాలో సూచించారు. చదువుతుండగా, వ్యవసాయం ...

Read More »

ప్రజావాణికి 9 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈవారం కూడా జరిగింది. ఇందులోతహసీల్దార్‌ శ్రీధర్‌ ఫిర్యాదుదారుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈవారం ప్రజావాణిలో 9 పిర్యాదులు వచ్చాయన్నారు. 2 ఆహారభద్రత కార్డులకు, 2 ఎస్‌కెఎస్‌ పిటింగ్‌ గురించి, 2 భూమికి సంబంధించిన ఫిర్యాదులు, 3 పింఛన్లకు సంబంధించి పిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు.

Read More »

శరణార్ధుల్ని పరిశీలించిన బృందం

అల్‌ మహా మెడికల్‌ బృందం, తనిఖీల్లో భాగంగా టర్కీలోని రెహ్యాన్లిలోగల అల్‌ అమాల్‌ హాస్పిటల్‌ని సందర్శించింది. ఖతార్‌ ఛారిటీ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించింది. 2016 సంవత్సరానికిగాను ఆసుపత్రికి అవసరమయ్యే సౌకర్యాలు, ముఖ్యంగా మందులు వంటి వాటి గురించి ఈ బృందం అక్కడి వారిని అడిగి సమాచారాన్ని సేకరించింది. సిరియా నుంచి వస్తున్న శరణార్ధుల కోసం ఏర్పాటైన ఒకే ఒక్క హాస్పిటల్‌గా అల్‌ అమాల్‌ ఆసుపత్రి పేరొందింది. ఖతార్‌ ఛారిటీ గడచిన మూడేళ్ళలో 4,000,000 ఖతారీ రియాల్స్‌ని ఈ ఆసుపత్రి కోసం వెచ్చించింది. 2014-2015 ...

Read More »

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏడుగురు ఖరారు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసే అభ్యర్థులను మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారుచేశారు. ఆదివారం తెలంగాణ భవనలో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కాగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులకుగాను ఏడుగురి పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్నివర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ చర్యలు తీసుకుంటుందని ...

Read More »