Breaking News

Daily Archives: December 8, 2015

22,23,24 తేదీల్లో ఏఐకెఎంఎస్‌ తొలి మహాసభలు

  భీమ్‌గల్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దామని ఏఐకెఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాజేశ్వర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని నందిగల్లిలోని పార్టీ కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించారు. నక్సల్‌బరి, శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రైతాంగ సమస్యలు, ఉద్యమాలే ఎజెండా రాష్ట్ర తొలి మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 22,23,24 తేదీల్లో ఆర్మూర్‌లో జరిగే ఏఐకెఎంఎస్‌ సభలకు అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు ...

Read More »

భీమ్‌గల్‌ విద్యార్థికి కాంస్య పతకం

  భీమ్‌గల్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని బి.సంపద నవంబర్‌ 28వ తేదీ నుంచి 30 వరకు మెదక్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్తాయి అండర్‌-14 (ఎస్‌జిఎఫ్‌) కబడ్డి క్రీడల్లో ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించడంతో మంగళవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినిని అభినందించడం జరిగింది. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్‌ షఫీక్‌, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్‌ నాయర్‌, నిజాముద్దీన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పరంజ్యోతి, కుమార్‌, వెంకటేశ్‌, రాజమణి, తదితరులు ...

Read More »

ఉపాధి హామీ పనుల సమీక్ష

  సదాశివనగర్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపిడివో చంద్రకాంత్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీలతో మాట్లాడుతూ గిట్టుబాటు ధర అందించేలా ఉపాధి కూలీలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలన్నారు. పని కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే తక్షణమే పని కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపివో రవిందర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

టిఎంఎస్‌ఆర్‌యు దేశవ్యాప్త సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో ఈనెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన గోడప్రతులు మంగళవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల సవరణలను వ్యతిరేకిస్తూ ఎస్‌ఎంఆర్‌ఏఐ దేశ వ్యాప్తంగా 3 లక్షల మంది మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రజలు, కార్మికుల పక్షాన నిలబడి సమ్మెకు దిగుతుందన్నారు. మందుల ధరలు తగ్గించాలని, ...

Read More »

విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించాలి

  కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సరస్వతి శిశుమందిరాలు విద్యార్థులకు సంస్కారం అందించేందుకు, జాతీయ భావాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. మిగతా పాఠశాలలకు సరస్వతి శిశుమందిరాలకు మధ్య తేడా విషయాన్ని ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్తులను సొంత పిల్లలుగా భావించి సమాజంలో భావి భారతపౌరులుగా ...

Read More »

పిఏకెఎస్‌ రాష్ట్ర మహాసభల గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13,14 తేదీల్లో హన్మకొండలో నిర్వహించనున్న పిఏకెఎస్‌ రాష్ట్ర మహాసభల గోడప్రతులను మంగళవారం కామరెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మిక సంఘాల సమాఖ్య పిఏకెఎస్‌ రాష్ట్ర 2వ మహాసభలను హనుమకొండలోని ఆర్ట్స్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో తలపెట్టినట్టు చెప్పారు. సభలకు ప్రజాగాయకుడు గద్దర్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, తెలంగాణ జేఏసి ఛైర్మన్‌ కోదండరామ్‌తో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ...

Read More »

కోర్టు ప్రాంగణంలో స్వచ్చ భారత్‌

  కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి, మై విలేజ్‌- మాడల్‌ విలేజ్‌ సంయుక్త ఆద్వర్యంలో మంగళవారం కామరెడ్డి కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. గంజ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హనుమాన్‌ మందిరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి ట్యాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కోర్టు ప్రాంగణం శుబ్రం చేశారు. పేరుకుపోయిన చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిదులు దామోదర్‌రెడ్డి, జయప్రకాశ్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు శ్యాంగోపాల్‌రావు, ...

Read More »

మండలానికి రూ. 100 కోట్లు తక్షణ సహాయం అందించాలి

  సదాశివనగర్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులను కరవు బారి నుంచి రక్షించడానికి రూ. 100 కోట్ల తక్షణ సహాయం అందించే విధంగా నివేదిక పంపాలని జడ్పిటిసి పడిగెల రాజేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రానికి కరవు బృందం రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్టు ఆయన తెలిపారు. అయినా కరవు బృందానికి రెండు పేజీల లేఖ ద్వారా మండల పరిస్థితులను క్షుణ్ణంగా వివరించినట్టు ఆయన తెలిపారు.

Read More »

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందించాలి

  నందిపేట, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు బండి నర్సాగౌడ్‌ మంగళవారం ‘నిజామాబాద్‌న్యూస్‌’తో మాట్లాడారు. యంత్రలక్ష్మి పరికరాలు అదికార పార్టీ వారికే కాకుండా అర్హులకు ఇవ్వాలని, ముందుగా పత్రిక ప్రకటనల ద్వారా ప్రజలకు వివరించి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభలో అర్హులను గుర్తించాలని సూచించారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన హామీలను నెరవేర్చాలని 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపకం ...

Read More »

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే నాక్‌

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల మెరుగైన భవిష్యత్‌ కోసమే నాక్‌ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. మంగళవారం వర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కామర్స్‌ కళాశాల భవనంలో సమావేశమయ్యారు. నాక్‌ గుర్తింపు యూనివర్సిటీకి నాణ్యతా ప్రమాణాల పరంగా మంచి గుర్తింపును, విద్యార్థుల పట్టాలకు విలువను ఇస్తుందని వివరించారు. యూనివర్సిటీకి నాక్‌ గుర్తింపువస్తే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు కంపెనీలు ...

Read More »

సీడ్‌ ఎక్స్‌పోర్టు జోన్‌గా అంకాపూర్‌ ప్రాంతం అభివృద్ది

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకాపూర్‌ ప్రాంతంలో పండిస్తున్న విత్తనాలకు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించి, విత్తనాలను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసేందుకు సీడ్‌ ఎక్స్‌పోర్టు జోన్‌గా అభివృద్ది చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితారాణా తెలిపారు. మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌లో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విభాగం ఆద్వర్యంలో అంకాపూర్‌ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అంకాపూర్‌ రైతులు దాదాపు మూడు దశాబ్దాల నుంచి ...

Read More »

శారదా ఆలంయలో మహా లింగార్చన

  కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తూర్పు హౌజింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీ శారదా శంకరాచార్య ఆలంయలో మహా లింగార్చన కార్యక్రమం జరపనున్నట్టు తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యానార్థం మహా లింగార్చన, కైలాస పరమశివ పార్దివ లింగ పూజ జరుగుతుందన్నారు. మట్టితో వెయ్యి లింగాలు పేర్చి విశేష ఫల, పంచామృతాలతో మహా అభిషేకం, పూజలు చేస్తామన్నారు. భక్తులు పెద్ద సంక్యలో పాల్గొని శివుని అనుగ్రహాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలోఆలయ కమిటీ ప్రతినిదులు ...

Read More »

భోగేశ్వరాలయము (మట్టెవాడ)

కార్తీక మాసం వచ్చిందండీ.  శివారాధకులకు ఈ మాసమంతా పండుగే.  ప్రతి శివాలయంలోనూ ఉత్సవాలే.   అయితే, ఆధ్యాత్మికంగా, చారిత్రికంగా అద్భుతమైన సంపదగల మన దేశంలోని ఆలయాలెన్నో  చరిత్ర పుటలలో మరుగునపడుతున్నాయి.   ఒక్కసారి వాటిని పరిశీలిస్తే అద్భుత చారిత్రక గాధలెన్నో తెలుసుకోవచ్చు.   ఇలాంటి సంపదను జాగ్రత్తగా కాపాడి మన భావితరాలవారికి అందించవలసిన మనం  వీటిని విస్మరిస్తున్నాం.  అలాంటివాటిని దర్శించటానికి కూడా అశ్రధ్ధ చేస్తున్నాము. అందుకే ఈ కార్తీక మాసంలో కొన్ని అపురూప శివాలయాలను పరిచయం చేస్తున్నాను. ఆధ్యాత్మిక, చారిత్రిక నిలయాలైన అద్భుతమైన ఆలయాలు కాకతీయ సామ్రాజ్యంలో ...

Read More »