Breaking News

Daily Archives: December 9, 2015

Sex interests and myths in the public-శృంగారం పట్ల మన సమాజంలో ఆసక్తి..అపోహలు.

స్త్రీలతో పోలిస్తే పురుషులకు సెక్స్‌ ఆలోచనలు ఎక్కువా? ఇది చాలా వరకూ నిజమే. ఇదేదో పురుషుల మీద లేనిపోని ముద్ర వెయ్యటం వంటిదేం కాదు. దీని వెనక జీవభౌతిక, శారీరక కారణాలున్నాయి. స్త్రీలలోనైనా, పురుషుల్లోనైనా లైంగిక వాంఛలకు మూలం ‘టెస్టోస్టిరాన్‌’ హార్మోను! పురుషుల్లో ఇదే ప్రధాన హార్మోను. కానీ స్త్రీల విషయానికి వచ్చే సరికి వారిలో స్త్రీ హార్మోన్త్లెన ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌లు ఎక్కువగానూ, ఈ  టెస్టోస్టిరాన్‌ తక్కువగానూ ఉంటాయి. అందుకే సహజంగానే పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువ. రెండోది- టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కూడా ...

Read More »

బ్లాక్ మనీలో ఇండియా నాలుగో ప్లేస్

ఇండియా బ్లాక్ మనీ ని పోగేసుకోవడం లో ఫోర్త్ రాంక్ కొట్టేసింది. US బేస్డ్ ధింక్-ట్యాంక్స్ ఈ విషయాన్ని తెలిపింది. చాలా కాలం నుంచి ఫారిన్ బ్యాంక్స్ లో మూలుగుతున్న ఇండియన్ బ్లాక్ మనీ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పదేళ్లలోనే 33.6 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్లు వెల్లడించాయి. బ్లాక్ మనీ ని కూడ బెట్టుకోవడంలో చైనా మొదటి స్ధానంలో ఉండగా, రష్యా, మెక్సికో తర్వాత స్ధానాల్లో ఉన్నట్లు గ్లోబల్ ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ (GFI) తెలిపింది. ...

Read More »

ఉపాధి చట్టం వలస నివారణకు ఉపయోగపడాలి

  – ఏఐఏడబ్ల్యువి రాష్ట్ర నేత ప్రసాద్‌ కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు పేదల ఆర్థిక స్వావలంనబకు వలస నివారణకు ఉపయోగపడాలని ఏఐఏడబ్ల్యువి రాష్ట్ర నేత ప్రసాద్‌ అన్నారు. కామారెడ్డిలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ మొదటి మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యకాస ఆద్వర్యంలో చేసిన పోరాటాలు వామపక్ష పార్టీలు యుపిఏ-1కి మద్దతిచ్చి గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసేందుకు ...

Read More »

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డి కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా నాయకులు మహ్మద్‌ నయీమ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తెలంగాణ దేవత సోనియా గాంధీ అని ఆమెను ప్రజలు ఎన్నటికి మరిచిపోలేరని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని ఆమె నెరవేర్చారని, ప్రజల హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్నారని, కార్యక్రమంలో కాంగ్రెస్‌, ...

Read More »

అలరించిన యువతరంగం సాంస్కృతిక పోటీలు

  కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్తాయి యువతరంగం సాంస్కృతిక పోటీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతరంగం – 2015 పోటీల్లో విద్యార్థులు జానపద, శాస్త్రీయ, తదితర విభాగాల్లో ప్రదర్శనలు చేశారు. నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. విశేష ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్తాయికి ఎన్నుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మోరియా యూనుస్‌, కామారెడ్డి డిగ్రీ కళాశాల ...

Read More »

అవినీతి నిర్మూలనకు విద్యార్థుల ప్రతిజ్ఞ

  కామరెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ అవినీతి నిరోదక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం టిజివిపి ఆధ్వర్యంలో విద్యార్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా టిజివిపి రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌, రజనీకాంత్‌లు మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం విద్యార్థులు నడుం బిగించాలని, అవినీతిని దేశం నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత దేశంగా భారతదేశాన్ని నిర్మించుకుందామన్నారు. అన్ని ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో అవినీతి కూరుకుపోయిందని, సమాజంలో అందరు బాధ్యతా యుతంగా పోరాడాలన్నారు. అవినీతి రహిత దేశ నిర్మాణమే లక్ష్యంగా ...

Read More »

బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం

  కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబరు 10న తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ను నిలిపి వేయాలని, లేకుంటే అడ్డుకొని తీరుతామని టిజివిపి జిల్లా అధ్యక్షుడు నవీన్‌ అన్నారు. కామారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరస్వతి నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని అసాంఘిక శక్తుల ప్రోద్బలంతో పాశ్చాత్య సంస్కృతి పోకడలను అనుసరిస్తూ బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సిద్దమయ్యారన్నారు. భారతీయులు గోవును ఆరాధ్య దైవంగా పూజిస్తారని, ఇలాంటి కార్యకలాపాలను టిజివిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డిసెంబరు 10 అంతర్జాతీయ ...

Read More »

ఎమ్మెల్యేజీవన్‌రెడ్డికి సన్మానం

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని బుధవారం పెర్కిట్‌ ముస్లిం కమ్యూనిటీ వారు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కమ్యూనిటీ హాల్‌కు నిదులు మంజూరు చేసేందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

అమ్దాపూర్‌లో పౌతీ సక్సేషన్‌ డ్రైవ్‌

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని అమ్దాపూర్‌ గ్రామంలో తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆద్వర్యంలో బుధవారం పౌతీ సక్సేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అందులో 20 పట్టా మ్యూటేషన్‌లు గుర్తించి పిపిబిఎస్‌ను జారీచేశారు.

Read More »

జూనియర్‌ కళాశాలలో లెక్చరర్లకు దరఖాస్తుల ఆహ్వానం

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉర్దూ మాద్యమంలో కాంట్రాక్టు లెక్చరర్‌గా బోధించడానికి లెక్చరర్లుగా అవకాశముందని ప్రిన్సిపాల్‌ కె.గంగారాం బుధవారం తెలిపారు. అర్హులైన అభ్యర్తులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పిజి రాజనీతి శాస్త్రంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీ లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More »

నిరుద్యోగ రుణాల కోసం 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టనంతోపాటు మండలంలోని గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు బిసి కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఇవో పిఆర్‌డి దామోదర్‌ బుధవారం తెలిపారు. సబ్సిడీ రుణాల కోసం ఈనెల 15వ రకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధికల్పించే ఉద్దేశంతో రునాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.

Read More »

సిద్దులగుట్టపై రుద్రాబిషేకం

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీకమాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం సామూహిక అన్నదానం, గిరి ప్రదక్షిణం నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, సుమన్‌, కిషన్‌ మాట్లాడుతూ సిద్దులగుట్ట పుణ్యక్షేత్రంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బక్తులు హాజరుకావడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. పట్టణ ప్రజల ప్రోత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారన్నారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో రథం ఏర్పాటు ...

Read More »

15న సామూహిక మహా పడిపూజ

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో అయ్యప్ప స్వాములు సామూహిక పడిపూజ ఈనెల 15న సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని సేవాసమితి అధ్యక్షుడు పెంట జలందర్‌, జనార్దన్‌గౌడ్‌, సదాశివులు బుధవారం తెలిపారు. సామూహిక పడిపూజకు ప్రముఖ వేద పండితులు గురుస్వామి బాల్యాపల్లి సుబ్బారావు ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

హిందీ పండిత శిక్షణకు అర్హత పరీక్షల కోసం దరఖాస్తులు

  ఆర్మూర్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు హిందీ ప్రచారసభ నిర్వహించే మాధ్యమ, విశారద, భూషణ్‌, విద్వాన్‌ పరీక్షలు రాసేవారు ఈనెల 21వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించాలని నిర్వాహకులు జనార్దన్‌ జ్యోతి బుధవారం తెలిపారు. హిందీ ప్రచారసభ నిర్వహించే పరీక్షలు రాసేందుకు ఆసక్తిగలవారు 9441594523 నెంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు.

Read More »

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంలో తెవివి విద్యార్థుల ప్రతిభ

  డిచ్‌పల్లి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారంరోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో సన్మానించారు. డిసెంబరు 5న తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్తులకు డిఎస్పీ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. తెలుగులో పి.అశోక్‌, శ్రీకాంత్‌, ఎన్‌.తిరుపతి, ఇంగ్లీష్‌లో నాగార్జున, ఆర్‌.రాజ్‌కుమార్‌, అంబయ్య, హిందీలో మనోజ్‌, ప్రఫుల్‌, ...

Read More »

నాక్‌ గుర్తింపు అనుబంధ కళాశాలలకు మేలే

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ నాక్‌ గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాల్లో అఫిలియేట్‌ కళాశాలలు కూడా భాగస్వామ్యం తీసుకోవాలని విసి పార్థసారధి పిలుపునిచ్చారు. తెయుకు నాక్‌ గుర్తింపు వస్తే అనుబంధ కళాశాలలకు కూడా మేలు జరుగుతుందని ఆయన వివరించారు. బుధవారం విసి, రిజిస్ట్రార్‌లు అఫిలియేట్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ళతో నాయకత్వం అన్న అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుబంధ కాలేజీల ప్రతినిధులతో కూడా నాక్‌ పరిశీలనా బృందం మాట్లాడుతుందని, ...

Read More »

అవినీతి అంతంతోనే దేశాభివృద్ధి

  -జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతి అంతంతోనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడానికి ప్రజలు బాద్యతతో పాటు ప్రభుత్వ అధికారులు నియమ, నిబంధనలకు అనుగుణంగా విదులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. ప్రజలు లోపాలు లేని సమాజం నిర్మించడానికి ...

Read More »

ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎంఆర్‌పిఎస్‌ నాయకుల ధర్నా

  బోధన్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం వద్ద ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ధర్నా చేట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఆమోదించి ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా వెనకబడిన మాదిగలకు ప్రభుత్వం ఆదుకోవాలని వారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమక్షంలో అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ ఆమోదంపై చర్చించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కన్నం దావులయ్య, శక్తిరాం, నాగనాథ్‌, కొందాపూర్‌ పోశెట్టి, చాందు, ...

Read More »

పేదలకు దుప్పట్ల పంపిణీ

  భీమ్‌గల్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండల కేంద్రంలో జమాతె ఇస్లామి హింద్‌ ఆద్వర్యంలో పేద ముస్లింలు, హిందువులకు మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హింద్‌ రాష్ట్ర అద్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో జమాతె ఇస్లామి హింద్‌ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ప్రజలందరు సోదర భావంతో మెలగాలని, మతసామరస్యాన్ని కలిగి ఉండాలని ఎస్‌ఐ అన్నారు. కార్యక్రమంలో భీమ్‌గల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

Read More »

నందిపేటలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

  నందిపేట, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో బుధవారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్‌ మాట్లాడుతూ సోనియాగాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆశించారు. జన్మదిన కానుకగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోవద్దన్నారు. తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ...

Read More »