Breaking News

ఉపాధి చట్టం వలస నివారణకు ఉపయోగపడాలి

 

– ఏఐఏడబ్ల్యువి రాష్ట్ర నేత ప్రసాద్‌

కామారెడ్డి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు పేదల ఆర్థిక స్వావలంనబకు వలస నివారణకు ఉపయోగపడాలని ఏఐఏడబ్ల్యువి రాష్ట్ర నేత ప్రసాద్‌ అన్నారు.

కామారెడ్డిలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ మొదటి మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యకాస ఆద్వర్యంలో చేసిన పోరాటాలు వామపక్ష పార్టీలు యుపిఏ-1కి మద్దతిచ్చి గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసేందుకు దోహదపడిందన్నారు. బిజెపి కేంద్రంలో, తెరాస రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఉపాధి హామీ పథకంలో సంస్కరణల పేరుతో చట్టం రద్దుచేసే కుట్రలను చేస్తుందని, వీటిని మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో కరువు నివారణకు 200 రోజుల పని కల్పించి కనీస వేతనం 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోతిరాం, నాయకులు నర్సింలు, రాజలింగం, సిద్దిరాములు, బలరాం, జగన్‌, వాలీ, సంగ్మా, లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article