Breaking News

నందిపేటలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

 

నందిపేట, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో బుధవారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు.

పార్టీ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్‌ మాట్లాడుతూ సోనియాగాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆశించారు. జన్మదిన కానుకగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోవద్దన్నారు. తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు, యూత్‌ కాంగ్రెస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వినీత్‌, ఉపాధ్యక్షుడు మహిపాల్‌, నాయకులు చిన్నదొడ్ల కిషోర్‌, లోక హన్మాండ్లు, బుడ్డ శివ, తమ్మల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article