Breaking News

అవినీతి నిర్మూలనకు విద్యార్థుల ప్రతిజ్ఞ

 

కామరెడ్డి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ అవినీతి నిరోదక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం టిజివిపి ఆధ్వర్యంలో విద్యార్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈసందర్భంగా టిజివిపి రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌, రజనీకాంత్‌లు మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం విద్యార్థులు నడుం బిగించాలని, అవినీతిని దేశం నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత దేశంగా భారతదేశాన్ని నిర్మించుకుందామన్నారు. అన్ని ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో అవినీతి కూరుకుపోయిందని, సమాజంలో అందరు బాధ్యతా యుతంగా పోరాడాలన్నారు. అవినీతి రహిత దేశ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిజివిపి ప్రతినిధులు లక్ష్మణ్‌ యాదవ్‌, రజనీకాంత్‌, సాయి, రాజు, విద్యార్థులు తదితరులున్నారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article