Breaking News

అలరించిన యువతరంగం సాంస్కృతిక పోటీలు

 

కామారెడ్డి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్తాయి యువతరంగం సాంస్కృతిక పోటీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

యువతరంగం – 2015 పోటీల్లో విద్యార్థులు జానపద, శాస్త్రీయ, తదితర విభాగాల్లో ప్రదర్శనలు చేశారు. నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. విశేష ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్తాయికి ఎన్నుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మోరియా యూనుస్‌, కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, జిల్లా సాంస్కృతిక కో ఆర్డినేటర్‌ తుకారాం, కళాశాల కో ఆర్డినేటర్‌ లక్ష్మయ్య, న్యాయ నిర్ణేతలు భూమన్‌, ప్రభాకర్‌, కార్తీక్‌ మాస్టర్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులకు అఖిల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *