Breaking News

Daily Archives: December 10, 2015

చండీ యాగాల పేరుతో సిఎం కాలయాపన

  – ఆశల వంద కి.మీల పాదయాత్ర ప్రారంభం కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా చండీ యాగాల పేరుతో కాలయాపన చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ అన్నారు. ఆశ కార్యకర్తల సమ్మె గురువారం నాటికి 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కామారెడ్డినుంచి రాజధానికి 100 కి.మీల పాదయాత్ర చేపట్టారు. సిఐటియు, వ్యకాస, సిపిఎం రాష్ట్ర నాయకులు యాత్ర ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారావు, ...

Read More »

పాఠశాలల దత్తత పనులకు శ్రీకారం

  కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 5వ వార్డులోగల ఒడ్డెర కాలనీలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మైవిలేజ్‌-మాడల్‌ విలేజ్‌ స్వచ్చంద సంస్త దత్తత స్వీకరించింది. గురువారం 5వ వార్డు కౌన్సిలర్‌ పద్మా రాంకుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సమక్షంలో మైవిలేజ్‌-మాడల్‌ విలేజ్‌ సంస్థ వ్యవస్తాపకులు బాల్‌రాజ్‌గౌడ్‌ పాఠశాల దత్తత పనులకు శ్రీకారం చుట్టారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సమాజ సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్న బాల్‌రాజ్‌ గౌడ్‌ సేవలు అభినందనీయమన్నారు. కౌన్సిలర్‌ ...

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయ నిది కింద విడుదలైన చెక్కులను గురువారం స్తానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ బాధిత కుటుంబాలకు అందజేశారు. అడ్లూర్‌ గ్రామానికి చెందిన పోచవ్వ, ఆరేపల్లి గ్రామానికి చెందిన జమున, మద్దికుంటకు చెందిన నర్సవ్వ, లక్ష్మిరావులపల్లికి చెందిన జల్ల దేవేంద్ర, కామారెడ్డికి చెందిన సుజాతలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం 5 లక్షల చెక్కులు విడుదలయ్యాయి. వీరికి ఎమ్మెల్యే అందజేశారు.

Read More »

సరస్వతి శిశుమందిర్‌లో గోరక్షా దివస్‌

  కామరెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో గురువారం గోరక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను కొందరు హిందూ వ్యతిరేక శక్తులు చంపుతూ గోమాంసాన్ని పెద్దకూర పండగ పేరుతో తినడం అమానుషమన్నారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తూ అరాచక శక్తులు హైకోర్టు అనుమతిలేకున్నా జులుంతో పెద్దకూర పండగ చేస్తామని, పిచ్చి ప్రేలాపనలు కలగడం విద్యావంతులను, హిందువులను తలదించుకునేలా చేస్తుందన్నారు. ఇప్పటికైనా గోమాత విశిష్టతను తెలుసుకొని సమాజానికి అనుగుణమైన జీవనాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు ...

Read More »

దోమకొండ గడీకోటలో రాంచరణ్‌ ప్రత్యేక పూజలు

  కామరెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ గడీ కోటలోని మహాదేవుని ఆలయం, చాముండేశ్వరి ఆలయంలో గురువారం రాంచరణ్‌, ఉపాసన దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని మహదేవుని ఆలయంలో పూజలు చేశారు. దాంతోపాటు చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించారు. ఇంటి ఇలవేల్పుగా ఉన్న మహదేవుని ఆలయం, చాముండేశ్వరి ఆలయాల్లో దోమకొండ సంస్థానాధీశుడు విశ్రాంత ఐఏఎస్‌ కామినేని ఉమాపతిరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా అత్తమామలతో కలిసి ...

Read More »

మానవ మనుగడకు మానవ హక్కులుకీలకం

  – ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య డిచ్‌పల్లి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ మనుగడకు మానవ హక్కులుకీలకమని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కనకయ్య అన్నారు. గురువారం మానవహక్కుల దినోత్సవం సందర్భంగా వర్సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనిషి మనిషిగా గుర్తించడమే మానవ హక్కుల ప్రాథమిక సూత్రమని, దోపిడి, పీడనలేని సమాజమే అందరి ఆశయం కావాలన్నారు. మనిషి మనుగడ కొనసాగాలంటే జీవించే హక్కు ఉండాలని, అందరిహక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పించినప్పటికీ, అనేక ...

Read More »

కాంగ్రెస్‌ నాయకుడిని పరామర్శించిన మాజీ మంత్రి

  ఎడపల్లి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పి.లక్ష్మణ్‌ను మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్‌ త్వరగా కోలుకోవాలని ఆయన అభిలషించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్‌, నాయకులు బిల్ల రామ్మోహన్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, ఎడపల్లి సింగిల్‌ విండో ఉపాధ్యక్షులు యాసాడ నర్సింగ్‌, సూరిబాబు, ...

Read More »

ఎడపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

  ఎడపల్లి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోగురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్తానిక సాయిబాబా ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డయాబెటీస్‌, కంటిచూపు, గుండె సంబంధిత పరీక్షలతో పాటు వివిధ రకాల వ్యాధులను గుర్తించే పరీక్షలు నిర్వహించారు. అమెరికాలోని ఆటా తెలంగాణ అసోసియేషన్‌లో ఫిజిషియన్‌ డాక్టర్‌ కరుణాసాగర్‌రెడ్డి ఈ వైద్య శిబిరానికి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన పలువురు రోగులను పరీక్షించారు. రాష్ట్ర మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, బోధన్‌ డిఎస్పీ వెంకటేశ్వర్లు, ...

Read More »

ఇసుక ట్రాక్లర్లు సమయ పాలన పాటించాలి

  – ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి బీర్కూర్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీర పరివాహక ప్రాంతం నుంచి ప్రతి వారం ఇసుక తరలిస్తున్న ట్రాక్టరు దారులు తహసీల్దార్‌ నిర్దేశించిన సమయాన్ని తప్పకుండా పాటించాలని ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోగల పోలీసు స్టేషన్లో ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక ట్రాక్టరు దారులు అధిక వేగంతో గ్రామాల గుండా తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని, తగిన వేగంతో నడిపించాలని సూచించారు. అధిక లోడుతో ఇసుక తరలించవద్దని, ...

Read More »

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

  బీర్కూర్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో మంజీర పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అనుమతుల సమయం దాటిన తర్వాత రాత్రి వేళ ఇసుక రవాణా చేస్తున్న బీర్కూర్‌ గ్రామానికి చెందిన మూడు ట్రాక్టర్లను ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి పట్టుకున్నారు. తహసీల్దార్‌ నిర్దేశించిన సమయం దాటిన తర్వాత ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు అన్ని సక్రమమే

  – సంయుక్త కలెక్టర్‌ నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎన్నుకునే ఏకైక ఎమ్మెల్సీ స్థానానికి దరఖాస్తు చేసిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి, సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి ప్రకటించారు. గురువారం సంయుక్త కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినికి తెరాస అభ్యర్థి తరఫున ఎన్నికల ఏజెంటు గంగారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి, ఇండిపెండెంట్‌ అబ్యర్థి బి.జగదీష్‌లు హాజరయ్యారు. వారి సమక్షంలో నామినేషన్‌ పత్రాలను సంయుక్త ...

Read More »

17న అంగవైకల్య విద్యార్థులకు ఉపకరణాలు అందజేత

  బీర్కూర్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల 18 సంవత్సరాలలోపు అంగవైకల్య విద్యార్థులకు ఈనెల 17వ తేదీన బాన్సువాడ జూనియర్‌ కళాశాలలో ఉపకరణాలు అందజేయబడతాయని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య బృందం ఈనెల 17న బాన్సువాడకు విచ్చేస్తుందని, అంగవైకల్య విద్యార్థులు తమ వెంట 8 పాస్‌ పోర్టు సైజ్‌ ఫోటోలు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఆదాయ దృవీకరణ పత్రాలు తీసుకొని బాన్సువాడ జూనియర్‌ కళాశాలలో హాజరుకావాలని సూచించారు. మండలంలోని ప్రయివేటు, ప్రభుత్వ ...

Read More »

తలనొప్పి/మైగ్రేన్

దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే. సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గుపడకూడదు. వైద్యుడు, తలనొప్పి తీవ్రంగ ఉన్నదా, మళ్ళీ మళ్ళీ వస్తున్నదా లేదా జ్వరంతో పాటువస్తున్నదా అని పరీక్షించాలి. తలనొప్పి ఎప్పుడు తీవ్రమనిపిస్తుంది? ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోకపోవడం వల్లా లేదా ...

Read More »