Breaking News

Daily Archives: December 11, 2015

బయోమెట్రిక్‌ ఉన్న భయంలేదు…

  – రెవెన్యూ అధికారుల తీరుమారేదెట్ల… ఎన్నడూ…. నిజామాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని మన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ప్రతిష్టాత్మకంగా భావించి బయోమెట్రిక్‌ విధానంలో హాజరు పద్ధతిని ఇటీవలే ప్రవేశపెట్టారు. కాగా ఇందులో ఆధార్‌తో అనుసంధానం చేసి వేలిముద్రలో హాజరు నమోదవుతుంది. ఇందుకోసం జిల్లాలో అత్యధికంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌లోని 62 మంది నమోదు చేసుకోగా, అత్యల్పంగా కమ్మర్‌పల్లి, నవీపేట, ...

Read More »

కథలు చెప్పొద్దు … ఫలితాలు చూపండి

  – జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఎడపల్లి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యావ్యవస్థపై అధికారులు కథలు చెప్పొద్దని, ఫలితాలు రాబట్టి నూటికి నూరుశాతం సాధించామని చేసి చూపెట్టాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా విద్యాశాఖాధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్‌సి భవనంలో మండల అధికారులతో విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మండలంలోని విద్యావ్యవస్థ తీరుతెన్నులు సాధించిన ఫలితాలు, చేపట్టబోయే కార్యాచరణ, ఇందుకు తీసుకోబోయే చర్యలపై కలెక్టర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో విద్యాశాఖ ...

Read More »

హాస్టల్‌ వార్డెన్‌ను తొలగించాలి

  బీర్కూర్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ బాలుర వసతి గృహం వార్డెన్‌ స్వామిని తొలగించాలంటూ వసతి గృహ విద్యార్తులు తహసీల్దార్‌ ప్రసాద్‌కు శుక్రవారం సాయంత్రం విన్నవించుకున్నారు. కాస్మొటిక్‌ చార్జీలు సరైన సమయంలో అందజేయడం లేదని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం భోజనం అందించడం లేదని, చీటికి మాటికి విద్యార్తులపై కోపగించుకుంటూ కొడతారని విద్యార్తులు తహసీల్దార్‌ ముందు వాపోయారు. సంబంధిత విషయమై వార్డెన్‌ స్వామిని వివరణ కోరారు. ఇలాంటి విషయాలు పునరావృతమైతే జిల్లా సంక్షేమాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ...

Read More »

హనుమాన్‌ విగ్రహ అపహరణపై ఫిర్యాదు

  కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలో గురువారం హనుమాన్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని వార్డు వాసులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో 20 సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ హనుమాన్‌ ఆలయం కోసం స్థలాన్ని కేటాయించి విగ్రహాన్ని ప్రతిస్టించారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులే రాత్రివేళ విగ్రహాన్ని తవ్వి తీసుకెళ్లారని చెప్పారు. నిందితులను పట్టుకొని, విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని కోరారు.

Read More »

విద్యార్థులు పట్టుదలతో సాధించాలి

  కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు క్రమశిక్షణ, అకుంఠిత దీక్షతో ఉన్నత స్తాయికి ఎదగాలని బల్దియా కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌ అన్నారు. పట్టణంలోని గంజ్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలసభ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ దిశగా కష్టపడి చదవాలని సూచించారు. మైవిలేజ్‌-మాడల్‌ విలేజ్‌ సభ్యులు వాలంటీర్ల పర్యవేక్షణలో విద్యార్తులు నృత్యాలు, నాటికలు, పొడుపుకథలు, పాటల పోటీల్లో పాల్గొని అందరిని అలరించారు. విద్యార్తుల సాంస్కృతిక ...

Read More »

డబ్ల్యుటివో గాట్‌ ఒప్పందాలను విరమించుకోవాలి

  – పట్టణంలో విద్యార్థుల ర్యాలీ కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబ్ల్యుటివో గాట్‌ ఒప్పందాల్లో ఉన్నత విద్యను చేర్చే కుట్రను మోడి సర్కారు విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి లోకం కదం తొక్కింది. పిడిఎస్‌యు ఆద్వర్యంలో పట్టణంలో శుక్రవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా మీదుగా రైల్వే కమాన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడి సర్కారు ఉన్నత విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో ...

Read More »

ట్రాక్టర్ల యజమానుల సంఘం ప్రతినిధులకు సన్మానం

  కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ట్రాక్టర్ల యజమానుల సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను శుక్రవారం సన్మానించారు. అధ్యక్షులుగా మల్లేశ్‌ యాదవ్‌, ఉపాధ్యక్షులుగా రాజు, భాస్కర్‌, అంజద్‌, మౌలానా, గంగాధర్‌, కార్యదర్శిగా గణేశ్‌, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్‌, సహ కార్యదర్శిగా రమేశ్‌, మోహన్‌, సలహాదారులుగా రాములు, భూంరెడ్డి, సిద్దిరాంరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా నజీర్‌, రాజు, గంగారాం తదితరులు ఎన్నికయ్యారు.

Read More »

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

  కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని రాజానగర్‌ కాలనీలో శుక్రవారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గురుస్వామి బెజ్జంకి అశోక్‌ స్వామి నివాసంలో జరిగిన మహా పడిపూజ కార్యక్రమానికి స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప స్వామి భజనలు, కీర్తనలతో పూజలు చేశారు. 18 మెట్ల పూజ, అభిషేకం, హారతులు సమర్పించారు. అనంతరం స్వాములందరికి భిక్ష అన్నదానం చేశారు. కార్యక్రమంలో బెజ్జంకి సుదర్శన్‌, గురుస్వాములు కృష్ణమూర్తి, వెంకటేశం, మధుసూదనాచారి, రాధాకృష్ణ, మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

  కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడలోని రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెలుతూ పట్టణంలోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో అభ్యర్థి బాలయ్య శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయని, ఇందులో పోటీచేయడానికి 200 మందితో బయల్దేరారు. పేదప్రజలకు సేవచేయడానికి అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు మహేశ్‌, కాంశెట్టి, సుధాకర్‌, లక్ష్మణ్‌రావు, రమేశ్‌, కృష్ణమూర్తి, మధు, రవి, రాజేశం, ...

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  – ఎస్‌బిఐ బ్యాంకు ఎఫ్‌ఐసి మేనేజర్‌ రామేశ్‌ కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బిఐ బ్యాంకు ఎఫ్‌ఐసి మేనేజర్‌ రామేశ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో ఎస్‌బిఐ కస్టమర్‌ సర్వీస్‌ ప్యానల్‌లోని ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రబుత్వం సురక్షా బీమా పథకాన్ని ...

Read More »

జర్మనీలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ

[easy-image-collage id=13037] సెంట్రల్‌ డెస్క్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత చదువులు చదువుకొని స్వగ్రామానికి, దేశానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని భారతీయ విద్యార్థులు జర్మనీ లాంటి దేశాలకు వెళుతున్నారు. దీన్ని అదనుగా భావించిన కొన్ని ప్రయివేటు సంస్థల వారు విద్యార్థులను విదేశాలకు పంపే క్రమంలో దృవీకరణ పత్రాల విషయంలో అవకతవకలకు పాల్పడుతూ వారి ఆశల్ని మొగ్గలోనే తుంచేసే కుట్రలు పన్నుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జర్మనీలో చోటుచేసుకుంది…. వివరాలు ఇలా ఉన్నాయి…. హైదరాబాద్‌లోని విదేశీ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌ సంస్థ ...

Read More »

గ్యాస్‌ లీక్‌ నలుగురికి గాయాలు

  బాన్సువాడ, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని పిఎస్‌ఆర్‌ కాలనీలో ప్రమాద వశాత్తు గ్యాస్‌ లీకైన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం వంట చేసే క్రమంలో గ్యాస్‌ రాకపోవడంతో ఇంటి యజమాని గ్యాస్‌ డీలర్‌కు సమాచారం అందించారు. గ్యాస్‌ సరఫరా కేంద్రంలో పనిచేసే కృష్ణ అనే కార్మికుడు వచ్చి గ్యాస్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం సంభవించి అక్కడేఉన్న కార్మికుడు కృష్ణతోపాటు గంగవ్వ, అంజవ్వ, గంగోత్రి అనే బాలికతో పాటు ...

Read More »

స్టాక్‌ మార్కెట్స్‌-బిఎస్‌ఇపై తెవివిలో అవగాహన సదస్సు

  డిచ్‌పల్లి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వ్యాపార నిర్వహణ విభాగం, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ వారి సౌజన్యంతో శుక్రవారం తెవివిలో స్టాక్‌మార్కెట్స్‌-బిఎస్‌ఇ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిసోర్సు పర్సన్‌ సంతోష్‌ వి.రెడ్డి స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన, స్టాక్‌ మార్కెట్‌లో నిర్వహించే అంశాలను బోధించారు. కార్యక్రమంలో హెడ్‌, డీన్‌ ఆచార్య సత్యనారాయణచారి, ఎంబిఎ, ఐఎంబిఎ విద్యార్థులు, డాక్టర్‌ కైసర్‌ మహ్మద్‌, డాక్టర్‌ వి.రాజేశ్వరి, సి.హెచ్‌.ఆంజనేయులు, డాక్టర్‌ కె.అపర్ణ, డాక్టర్‌ ...

Read More »

ఆర్డీవో కార్యాలయం ముట్టడి

  బోధన్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బోధన్‌ ఆర్డీవో కార్యాలయాన్ని ఎంఆర్‌పిఎస్‌ కార్యకర్తలు ముట్టడించారు. వర్గీకరణ బిల్లుపై అనేక హామీలిచ్చిన రాజకీయ పార్టీలు వాటిని నెరవేర్చడంలో విఫలమవుతున్నారన్నారు. సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం ఆగేది లేదని జిల్లా కార్యదర్శి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ముట్టడికి ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, వెంకట్‌, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

  ఆర్మూర్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 23 వార్డుల్లో భూగర్భజలాలు తగ్గిపోయాయి. తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. పట్టణంలోని 23 వార్డులున్నాయి. కేవలం 9 నీటి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నట్టు మునిసిపల్‌ కమీషనర్‌ సివిఎన్‌ రాజు తెలిపారు. పట్టణంలో నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసిందని, ఇందులోంచి 15 లక్షలను వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు కేటాయించామని, మరో 5 లక్షలు బోర్ల ఫిల్లింగ్‌ డిపెండింగ్‌ చేస్తున్నామని వివరించారు. ...

Read More »

క్రిస్మస్‌ వేడుకలకు రూ. 2 లక్షలు

  ఆర్మూర్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలోని రాములు మెమోరియల్‌ హాల్‌లో ప్రబుత్వ ఆదేశాల మేరకు చర్చి పాస్టర్లతో తహసీల్దార్‌ శ్రీధర్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గంలోని నందిపేట, మాక్లూర్‌, ఆర్మూర్‌ మండలానికి చెందిన 116 చర్చిల పరిధిలోని క్రైస్తవులకు క్రిస్మస్‌ పండగ సందర్భంగా ప్రభుత్వం రూ. 2 లక్షలు మంజూరు చేసిందని, ఈ నిధులతో ఈనెల 16వ తేదీన దుస్తుల పంపిణీ, 19న ఆర్మూర్‌లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన సిద్దులగుట్ట వెనకగల సియోల్‌ చర్చిలో ...

Read More »

క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకోవాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోని ఎంఆర్‌ గార్డెన్స్‌లో శుక్రవారం క్రైస్తవ సంఘాల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల పాస్టర్ల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. అద్యక్షుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ ఈనెల 25న క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతిఇంట్లో క్రిస్మస్‌ ట్రీని, నక్షత్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో ఆర్మూర్‌, బాల్కొండ గ్రామాలకు చెందిన క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

సుర్బిర్యాల్‌లో పౌతీ కేసుల పరిష్కారం

  ఆర్మూర్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని సుర్బిర్యాల్‌ గ్రామంలో శుక్రవారం తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పౌతీ కేసులను పరిష్కరించారు. జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆదేశాల మేరకు ఈ సమావేశాలు నిర్వహించి పట్టా పేరు మార్పిడి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం గ్రామంలో 12 పట్టా పాసుపుస్తకాలను పంపినీ చేసినట్టు ఆయన తెలిపారు.

Read More »