Breaking News

జర్మనీలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ

[easy-image-collage id=13037]

సెంట్రల్‌ డెస్క్‌, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత చదువులు చదువుకొని స్వగ్రామానికి, దేశానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని భారతీయ విద్యార్థులు జర్మనీ లాంటి దేశాలకు వెళుతున్నారు. దీన్ని అదనుగా భావించిన కొన్ని ప్రయివేటు సంస్థల వారు విద్యార్థులను విదేశాలకు పంపే క్రమంలో దృవీకరణ పత్రాల విషయంలో అవకతవకలకు పాల్పడుతూ వారి ఆశల్ని మొగ్గలోనే తుంచేసే కుట్రలు పన్నుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జర్మనీలో చోటుచేసుకుంది…. వివరాలు ఇలా ఉన్నాయి….

హైదరాబాద్‌లోని విదేశీ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌ సంస్థ గత కొన్నేళ్లుగా జర్మనీ, తదితర దేశాలకు విద్యార్తులను చదువుకోవడానికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బున్న విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి విద్యార్థుల సర్టిఫికెట్లు మార్చి తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి జర్మనీకి తరలించారు. తీరా అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన జర్మనీలోని ఆయా యూనివర్సిటీల అధికారులు తప్పుడు పత్రాలుగా గుర్తించి స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారు. యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వీల్లేదని బహిష్కరించారు.

ఇందుకు సంబంధించిన వివరాలు శుక్రవారం జర్మనీ మ్యూనిక్‌లోని భారత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేగాకుండా జర్మనీలో పైచదువులు చదవాలనుకునే విద్యార్థులు విదేశీ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌ సంస్థ, తదితర సంస్థలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. యూనివర్సిటీలకు సమర్పిస్తున్న డాక్యుమెంట్లను సరిగా పరిశీలించి పంపాల్సిందిగా సూచిస్తున్నారు. లేకుంటే యూనివర్సిటీలు తీసుకునే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని అన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article