Breaking News

Daily Archives: December 14, 2015

నైట్ క్వీన్ మార్గశిరం కోసం వేచివుంది

శరద్రాతుల మలుపు దగ్గర నైట్ క్వీన్ మార్గశిరం కోసం వేచివుంది, రాత్రంతా అది విరజిమ్మిన పరిమళం ఇప్పుడెక్కడో పంటపొలాలమీద తొలిమంచు దుప్పటిగా పరుచుకుంది. పండివాలిన వరికంకులమీద గునుగుపూలు రాలినట్టు, రాత్రంతా సీతాకోకచిలుక పూలకలలే కన్నట్టు, నాకు తెలుసు, ఇప్పుడు వీథి చివర ఎవరో బలలైకా వాయిస్తున్నారు. అతడి చుట్టూ కిర్గిజిస్థాన్ కొండదేవతలు తేనెటీగల్లా మూగిఉంటారు. ఇన్నాళ్ళూ మనుషులకోసం బతికాను, ఇప్పుడు కొన్నాళ్ళు దేవతలకోసం బతకాలని ఉంది. మనుషుల్ని ప్రేమించినంతకాలం రాక్షసుల్ని సహిస్తూ గడిపాను, ప్లీజ్, కొన్ని క్షణాల పాటేనా ఇప్పుడొక దేవతను ధ్యానించనివ్వండి. నా ...

Read More »

ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డు బతుకమ్మ కుంటలో సోమవారం వార్డు కౌన్సిలర్‌ పద్మ ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జాతీయ ఫైలేరియా నివారణ వారోత్సవాల సందర్భంగా వార్డులోని ఒడ్డెరకాలనీ, బతుకమ్మ కుంట, రంగాచారి కాలనీ, సైలాన్‌ బాబా కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు ఉచిత మందులను అందించామన్నారు. వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాంకుమార్‌ గౌడ్‌, కాలనీ ...

Read More »

వేద విద్యార్థులకు వార్షిక పరీక్షలు

  కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేదభారతి పీఠ విద్యాలయంలో వేద విభూషణ 1 నుంచి 4 సంవత్సరాల వార్షిక పరీక్షలను సోమవారం నిర్వహించినట్టు పరీక్షకులు శంకర్‌ పాండే తెలిపారు. మహర్షి సాందీపని వేద విద్య ప్రతిష్టాన్‌ ఉజ్జయినీ ఎంఎస్‌ఆర్‌డి మంత్రాలయ ఆద్వర్యంలో వేద విద్యార్తులకు పరీక్షలు నిర్వహించామన్నారు. పరీక్షల్లో నవజీవన వేద విద్యాలయం తిరుపతి నుంచి 16 మంది బాసర వేద విద్యాలయం నుంచి 48 మంది మొత్తం 64 మంది వేద విద్యార్థులు రాత పరీక్షల్లో ...

Read More »

కార్మికుల పోరాట ఫలితంగానే విజయం

  – సిఐటియు కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటాల ఫలితంగానే విజయం సాధించారని అది కార్మికుల విజయమని సిఐటియు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రాజలింగం అన్నారు. కామారెడ్డిలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో 44 రోజుల పాటు పంచాయతీ కార్మికులు ప్రతిమండల కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారని బెదిరింపులకు లొంగకుండా చేసిన ఉద్యమాల ఫలితంగా పంచాయతీరాజ్‌ కమీషనర్‌ చర్చలకు పిలిచారన్నారు. ఫలితంగా ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. భవిష్యత్తులో సైతం ...

Read More »

బడిలో చేరిన బాలకార్మికులు

  భీమ్‌గల్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఆరుగురు బాల కార్మికులను సోమవారం లింగాపూర్‌పిఎస్‌ పాఠశాలలో చేర్పించడం జరిగిందని ఎంఇవో డి.స్వామి అన్నారు. బడిబయటి పిల్లలను బడిలో చేర్పించాలనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాల కార్మికులుగా ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఈఓపిఆర్‌డి లక్ష్మినర్సింహాచారి, ఏశాలకృష్ణ, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్‌, సిఆర్‌పిలు బాలరాజు, ఝాన్సీ, ఎస్‌ఎంసి పావన్న, పాఠశాల సిబ్బంది భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Read More »

చికిత్స పొందుతూ వృద్దురాలి మృతి

  బీర్కూర్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ శుక్రవారం గ్యాస్‌ సిలిండర్‌లీకేజీ సంఘటనలో గాయపడ్డ వృద్దురాలు చాకలి గంగవ్వ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. వారి వివరాల ప్రకారం… ఈనెల 11 న శుక్రవారం మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై నలుగురికి తీవ్ర గాయాలు కాగా గంగవ్వ (68) ను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి ...

Read More »

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

  ఎడపల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు చర్యలు చేపడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఎంపిపి అధ్యక్షురాలు రజిత యాదవ్‌, ఎస్‌పిహెచ్‌వో ప్రమీదలు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిలో రోగులకు బోదకాల వ్యాధి నివారణ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి దోమకాటు వల్ల వస్తుందని, అంతేగాకుండా పరిసరాల శుభ్రత లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొన్నారు. ...

Read More »

రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

  రెంజల్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ సదస్సు ద్వారా గ్రామంలో ఉన్న పట్టా మార్పిడి సమస్యలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య తెలిపారు. సోమవారం రెంజల్‌ మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కుటుంబంలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని తన కుమారుడు, భార్య, వారసుడు, వారసురాలి పేరుమీద పట్టా మార్పులు చేసుకోవాలని, వీటి కోసం తహసీల్‌ కార్యాలయానికి రావాల్సిన పనిలేదని, నేరుగా గ్రామంలోనే సమస్యపరిష్కరిచేందుకు రెవెన్యూ సదస్సు అని స్పష్టం చేశారు. సదస్సు ...

Read More »

బోదకాల మందుల పంపిణీ

  రెంజల్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, డాక్టర్‌ మధుసూదన్‌లు బోదకాల వ్యాధి నివారణకు మందులను సోమవారం పంపిణీ చేశారు. బోదకాల వ్యాధి భవిష్యత్‌ తరాలకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా మాత్రలు పంపినీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఎంపిపి మాట్లాడుతూ భవిష్యత్తు తరానికి ఫైలేరియాసిస్‌ నుంచి విముక్తిపొంది చిన్నారుల చిరునవ్వు సజీవంగా ఉండడానికి బోదకాల వ్యాధి నివారణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనినివారణకు మందులు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ...

Read More »

పిప్రిలో సక్సెషన్‌డ్రైవ్‌

  ఆర్మూర్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలో తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆద్వర్యంలో సోమవారం సక్సెషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో 18 మ్యుటేషన్స్‌ పరిష్కరించి పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్టు తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసి, ఎంఆర్‌ఐ, విఆర్వో తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణికి 13 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ వారం కూడా కొనసాగింది. తహసీల్దార్‌ శ్రీధర్‌ పిర్యాదుదారుల వద్దనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. 2 ఆన్‌లైన్‌ పహాణీల గురించి, 5 ఆహార భద్రత కార్డులకు సంబంధించి, 6 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More »

బోదకాలు లేని జిల్లాగా నిజామాబాద్‌ తీర్చిదిద్దాలి

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి బోధకాల మాత్రలు వేయాలని, బోదకాలు లేని జిల్లాగా నిజామాబాద్‌ను తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. జాతీయ ఫైలేరియా నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం స్థానిక కోటగల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను వేసుకొని విద్యార్థులకు డిఇసి, అలుబెండజోన్‌ మాత్రలనువేశారు. ఈ సందర్భంగా ఆమె ...

Read More »

డయల్‌ యువర్‌ ఎస్పీకి 16 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 16 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్టు ...

Read More »

బడి బయటి పిల్లలను బడుల్లో చేర్పించాలి

  నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్తాయిలో సిద్దం చేయాలని, మంచి ఫలితాలు రావడానికి అవసరమైన ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. సోమవారం వీడియో కాన్పరెన్సు ద్వారా పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నందున జనవరి 30 కల్లా సిలబస్‌ పూర్తిచేసి ఫిబ్రవరిలో రివిజన్‌ ప్రారంభించాలని ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ...

Read More »

పాడి పశువులకు పోషకాలు అందించే పశు గ్రాసాలు

వరిగడ్డిని పోషకవంతమైన పశుగ్రాసంగా చేయువిధానం పోషకవంతమైన వరిగడ్డి చేయు కారణాలు చేయువిధానం పోషకవంతమైన వరిగడ్డి చేయు కారణాలు మామూలు వరిగడ్డిలో మాంసకృతులు అసలే లేవు. మామూలు వరిగడ్డిలో జీర్ణయోగ్యమైన పోషక పదార్థాలు 40 శాతం వుంటుంది. మామూలు వరిగడ్డిలో తేమ 5 – 10 శాతం వరకు ఉండుట వలన పశువులు తక్కువగా మేస్తాయి చేయువిధానం ఒక రోజుకు ఒక పశువుకు 6 కేజిల యూరియాతో మాగగ వేసిన గడ్డి కావలసివస్తుంది. ఒక పశువుకు 7 – 8 రోజులకు 50 కేజీలు కావాలి. ...

Read More »

విద్య ఒక ప్రాథమిక హక్కు

ప్రతి భారతీయ పౌరుడికి విద్య ఒక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి. మనిషి తన తెలివి తేటల్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోడానికి వీలుగా విద్యాభ్యాసం కొనసాగిస్తు వుండాలి. అప్పుడే ఆ మనిషికి మౌలికమైన స్వేచ్ఛ లభిస్తుంది. మానవ హక్కులను  కాపాడుకోవచ్చు. తమ పిల్లలకు ఎటువంటి ప్రాథమిక విద్యను సమకూర్చాలనేది తలిదండ్రులే నిర్ణయించుకునే హక్కు వారికే ప్రథమంగా వుంది. అందరికీ విద్య ...

Read More »

సౌదీ అరేబియా ఎన్నికల్లో తొలిసారిగా పట్టం కట్టిన మహిళలు

సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. మక్కాలోని మద్రాకా కౌన్సిల్‌లో సల్మా బింట్‌ హిజాబ్‌ అల్‌ ఒటెబీ అనే మహిళా అభ్యర్థి విజయం సాధించినట్లు బంగ్లా ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ స్థానంలో మొత్తం ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు పోటీపడగా.. సల్మా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 284 సీట్లకుగానూ.. ...

Read More »