Breaking News

డయల్‌ యువర్‌ ఎస్పీకి 16 ఫిర్యాదులు

 

నిజామాబాద్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఎస్పీకి నేడు 16 ఫిర్యాదులు వచ్చినట్టు జిల్లా పోలీసు శాఖాధికారి వెల్లడించారు.

జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి వివిధ రకాల సమస్యలపై మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఈ ఫిర్యాదుల పట్ల ఎస్‌పి సానుకూలంగా స్పందిస్తూ పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి జి.ప్రసాద రావు ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article