Breaking News

బోదకాలు లేని జిల్లాగా నిజామాబాద్‌ తీర్చిదిద్దాలి

 

– జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి బోధకాల మాత్రలు వేయాలని, బోదకాలు లేని జిల్లాగా నిజామాబాద్‌ను తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. జాతీయ ఫైలేరియా నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం స్థానిక కోటగల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను వేసుకొని విద్యార్థులకు డిఇసి, అలుబెండజోన్‌ మాత్రలనువేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల వల్ల సంక్రమించే బోదకాల వ్యాధి సోకకుండా ఈ మాత్రలు తప్పకుండా అందరు వేసుకోవాలని, కుటుంబ సభ్యులకు చెప్పాలని అన్నారు. రెండు సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణీలు, తీవ్ర అనారోగ్యం, వ్యాధులున్న వారు వీటిని వేసుకోవద్దన్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా తప్పకుండా ఇళ్ళల్లో మరుగుదొడ్లు నిర్మించుకునేలా చెప్పాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో 23 లక్షల మందికి ఈ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు.

నగర మేయర్‌ ఆకుల సుజాత మాట్లాడుతూ అందరు ఈ మాత్రలు వేసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్చ భారత్‌ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని, ఇంటిని, వీధిని, దేశాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. తద్వారా అందరు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్‌ అనురాధ మాట్లాడుతూ జిల్లాలో 5 వేల మంది బోదకాల బాధితులున్నారని, హైడ్రోసిల్‌ వ్యాధిగ్రస్తులు జిల్లాలో అధికంగా ఉన్నారని చెప్పారు.

కార్యక్రమంలో డిఎంహెచ్‌వో వెంకట్‌, డిఎంఓ లక్ష్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article