Breaking News

బోదకాల మందుల పంపిణీ

 

రెంజల్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, డాక్టర్‌ మధుసూదన్‌లు బోదకాల వ్యాధి నివారణకు మందులను సోమవారం పంపిణీ చేశారు.

బోదకాల వ్యాధి భవిష్యత్‌ తరాలకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా మాత్రలు పంపినీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఎంపిపి మాట్లాడుతూ భవిష్యత్తు తరానికి ఫైలేరియాసిస్‌ నుంచి విముక్తిపొంది చిన్నారుల చిరునవ్వు సజీవంగా ఉండడానికి బోదకాల వ్యాధి నివారణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనినివారణకు మందులు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ప్రతి ఒక్కరు ఈ మాత్రలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం డిసెంబరు 14న రాష్ట్రమంతటా ఉచిత మాత్రల పంపినీకి శ్రీకారం చుట్టిందని, వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు రమేశ్‌, సాయిలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడ్ ల‌క్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్‌లోని ...

Comment on the article