Breaking News

చికిత్స పొందుతూ వృద్దురాలి మృతి

 

బీర్కూర్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ శుక్రవారం గ్యాస్‌ సిలిండర్‌లీకేజీ సంఘటనలో గాయపడ్డ వృద్దురాలు చాకలి గంగవ్వ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. వారి వివరాల ప్రకారం… ఈనెల 11 న శుక్రవారం మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై నలుగురికి తీవ్ర గాయాలు కాగా గంగవ్వ (68) ను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ మూడురోజులుగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్టు తెలిపారు.

ఆసరా పింఛన్‌ కోసం ఎదురుచూచి తనువు చాలించిన వృద్దురాలు :

రాష్ట్ర ప్రబుత్వం అట్టహాసంగా ప్రారంబించిన ఆసరా పథకంలో 68 సంవత్సరాల వృద్దురాలు చాకలి గంగవ్వకు ఇంతవరకు పింఛన్‌ రాకపోవడం విడ్డూరం. ఒకవైపు వృద్దాప్య కోటాలో, మరోవైపు వితంతు కోటాలో అర్హురాలైనప్పటికి నాయకుల చుట్టు, అధికారుల చుట్టు తిరిగి విసిగి వేసారిపోయింది. భర్త చనిపోయిన దృవీకరణ పత్రం తెమ్మని పంచాయతీ అధికారులు, ఆధార్‌ కార్డులో 65 సంవత్సరాలు నిండలేదని నాయకులు చెప్పడంతో పింఛన్‌పై ఆశలు వదులుకొని ప్రయివేటు పాఠశాల ముందు పళ్లు అమ్ముకొని జీవనం సాగించేది. ఆమ్‌ ఆద్మీ యోజన పథకంలో ఐకెపి కార్యాలయం నుంచి నెలకు 500 రూపాయలు తీసుకోగా, గత ఆరునెలల నుంచి ఆ మొత్తం కూడారావడం లేదు. దీంతో పించన్‌పై ఆశలు వదులుకుంది. చివరకు గ్యాస్‌లీకై చనిపోవడంతో ఆసరా పింఛన్‌ రాకుండానే తనువు చాలిందని కుటుంబీకులు, స్తానికులు కన్నీరు మున్నీరయ్యారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article