Breaking News

బడి బయటి పిల్లలను బడుల్లో చేర్పించాలి

 

నిజామాబాద్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్తాయిలో సిద్దం చేయాలని, మంచి ఫలితాలు రావడానికి అవసరమైన ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. సోమవారం వీడియో కాన్పరెన్సు ద్వారా పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నందున జనవరి 30 కల్లా సిలబస్‌ పూర్తిచేసి ఫిబ్రవరిలో రివిజన్‌ ప్రారంభించాలని ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఒక్కరికే 10/10 గ్రేడ్‌ వచ్చినందున ఈ యేడు మంచి గ్రేడుతో పాటు విద్యార్థులందరు మంచి ఫలితాలుసాధించడానికి సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

10వ తరగతి విద్యార్థులకు అత్యంత ముఖ్యమైందని, ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే వారి భవిష్యత్తు పాడవుతుందని, వారు నిరుత్సాహానికి గురై తదుపరి పరీక్షలపై శ్రద్ద చూపరన్నారు. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు అధ్యాపకులు, సిఆర్‌పిలు, ఎంఇవోలు చురుకుదనం తక్కువగా ఉన్న విద్యార్తులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించాలన్నారు. మద్నూర్‌లోని 150 మంది, గాంధారిలో 136 మంది బడిబయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించినందుకు ఎంఇవోలను అభినందించారు. జిల్లాలో ఇంకా 1675 మంది పిల్లలను బడుల్లో చేర్పించాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. రాళ్ళుకొట్టే, చెరుకు నరికే కుటుంబాల పిల్లలనుగుర్తించి వారిని బడుల్లో చేర్పించాలన్నారు.

జిల్లాలో 30 వేల వరకు మ్యూటేషన్లు పూర్తిచేయడం అభినందనీయమని, రెవెన్యూ అధికారులు ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ, పనులు చేసి పెట్టాలన్నారు. జిల్లాకు 45 వేల దీపం కనెక్షన్లు కేటాయించడం జరిగిందని, 36 వేలకుపైగా లబ్దిదారులను గుర్తించామని, 33 వేల మందికి అనుమతించామని, ఇప్పటికి 7 వేల మందికి మాత్రమే గ్రౌండింగ్‌ చేశామని, వెంటనే మిగతావారికి గ్రౌండింగ్‌ చేయాలని సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు.

విసిలో అదనపు జేసి రాజారాం, డిఇవో లింగయ్య, డిసివో శ్రీహరి, డిఎంహెచ్‌వో వెంకట్‌, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, ఐకెపి పిడి వెంకటేశం, ఎన్‌సిఎల్‌పి పిడి సుధాకర్‌, డిసిఎల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ...

Comment on the article