Breaking News

రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

 

రెంజల్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ సదస్సు ద్వారా గ్రామంలో ఉన్న పట్టా మార్పిడి సమస్యలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య తెలిపారు. సోమవారం రెంజల్‌ మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.

కుటుంబంలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని తన కుమారుడు, భార్య, వారసుడు, వారసురాలి పేరుమీద పట్టా మార్పులు చేసుకోవాలని, వీటి కోసం తహసీల్‌ కార్యాలయానికి రావాల్సిన పనిలేదని, నేరుగా గ్రామంలోనే సమస్యపరిష్కరిచేందుకు రెవెన్యూ సదస్సు అని స్పష్టం చేశారు. సదస్సు ద్వారా భూమి పట్టా మార్పిడి పనులను చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ క్రాంతి కుమార్‌, విఆర్వో గంగాధర్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ ...

Comment on the article