Breaking News

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

 

ఎడపల్లి, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు చర్యలు చేపడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఎంపిపి అధ్యక్షురాలు రజిత యాదవ్‌, ఎస్‌పిహెచ్‌వో ప్రమీదలు అన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిలో రోగులకు బోదకాల వ్యాధి నివారణ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి దోమకాటు వల్ల వస్తుందని, అంతేగాకుండా పరిసరాల శుభ్రత లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు ఉచితంగా మందులు పంపినీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు వైద్యురాలితోపాటు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల పిల్లలకు, గర్భిణీలకు, తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి కాలికడుపుతో ఉన్నవారికి డిసి అల్బెండజోన్‌ మాత్రలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి బోదక వ్యాధి నివారణ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌టిహెచ్‌ఇవో రాములు, సూపర్‌వైజర్లు నాగభూషణం, డాక్టరన ఫాతిమా, సుభద్ర, మధుమతి, స్టాఫ్‌ నర్సు నాగలక్ష్మి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article