Breaking News

కార్మికుల పోరాట ఫలితంగానే విజయం

 

– సిఐటియు

కామారెడ్డి, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటాల ఫలితంగానే విజయం సాధించారని అది కార్మికుల విజయమని సిఐటియు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రాజలింగం అన్నారు.

కామారెడ్డిలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో 44 రోజుల పాటు పంచాయతీ కార్మికులు ప్రతిమండల కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారని బెదిరింపులకు లొంగకుండా చేసిన ఉద్యమాల ఫలితంగా పంచాయతీరాజ్‌ కమీషనర్‌ చర్చలకు పిలిచారన్నారు. ఫలితంగా ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. భవిష్యత్తులో సైతం సమస్యల సాదనకు ఉద్యమాలే శరణ్యంగా పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, సిఐటియు ప్రతినిదులు బాలనర్సు, రాజు, యాదమ్మ, సాయిలు, అంజయ్య తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article